TE/Prabhupada 0085 - జ్ఞాన సంస్కృతి అంటే ఆధ్యాత్మిక సంస్కృతి
Lecture on Sri Isopanisad, Mantra 9-10 -- Los Angeles, May 14, 1970
విజ్ఞాన సంస్కృతి నుండి ఒక ఫలితం వస్తుంది అజ్ఞానం సంస్కృతి నుండి వేరొక ఫలితం వస్తుంది కాబట్టి నిన్న మేము కొంత వరకు వివరించాము అజ్ఞాన సంస్కృతి అంటే ఏమిటో మరియు జ్ఞానం యొక్క సంస్కృతి అంటే ఏమిటి. విజ్ఞాన సంస్కృతి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం. అది నిజమైన జ్ఞానం. మరియు సౌకర్యలు కోసం పరిజ్ఞానాన్ని పెంపొందించడాము లేదా భౌతిక శరీరం రక్షించేందుకు, అది అజ్ఞానం సంస్కృతి. మీరు ఏ విధంగానైనా శరీరం రక్షించేందుకు ప్రయత్నించండి అది సహజ క్రమంలో వెళ్ళుతుంది. ఆది ఏమిటి? Janma-mṛtyu-jarā-vyādhi (BG 13.9). మీరు పునరావృతమవుతున్న జనన మరణముల నుండి, ఈ శరీరమును ఉపశమనం కావించలేరు పుట్టినప్పుడు వ్యాధి మరియు మరణముల నుండి ప్రజలు శరీరం యొక్క జ్ఞానమును పెంపొందించుకోవటానికి చాలా బిజీగా ఉన్నారు వారు ప్రతి క్షణం ఈ శరీరం కుళ్లిపోతుంది ఆని చుస్తున్నపటికి శరీరం యొక్క మరణం జన్మించినప్పుడు నమోదు అవుతుంది వాస్తవం. కాబట్టి మీరు శరీరం యొక్క సహజ క్రమమును ఆపలేరు. మీరు శరీరం యొక్క క్రమమును అంగీకరించాల్సి ఉంటుంది అవి, పుట్టుక, మరణము, ముసలితనం, వ్యాధి.
కాబట్టి భాగవతము చెప్పుతుంది yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke (SB 10.84.13). ఈ శరీరమును మూడు ప్రాథమిక అంశాలతో తయారు చేసారు శ్లేష్మం, పిత్తం, మరియు గాలి. ఇది వేదలు మరియు ఆయుర్వేద చికిత్స ప్రకారము ఈ శరీరం శ్లేష్మం, పిత్తం, మరియు గాలి యొక్క ఒక సంచి ముసలితనంలో వాయుప్రసరణ దెబ్బతింటుంది; కాబట్టి ముసలివారికి కీళ్ళవాతం మరియు చాలా శారీరక వ్యాధులు వస్తాయి కాబట్టి భాగవతము చెప్ప్పుతుంది, "పిత్తం, చీము, మరియు గాలి ఈ కలయికను తానుగా అంగీకరించినా వ్యక్తి, అతను ఒక గాడిద. నిజానికి, ఇది వాస్తవం. మనము పిత్త, శ్లేష్మం గాలి యొక్క కలయికను మానముగా అంగీకరిస్తే కాబట్టి తెలివైన వాడు, గొప్ప తత్వవేత్త, ఒక గొప్ప శాస్త్రవేత్త, దీని అర్ధము అతను పిత్త, శ్లేష్మం మరియు గాలి యొక్క కలయిక? కాదు, ఇది తప్పు. అతను పిత్త లేదా శ్లేష్మం లేదా గాలి నుండి భిన్నము. అతను ఒక ఆత్మ. మరియు అతని కర్మ ప్రకారం, అతను తన ప్రతిభను చూపిస్తున్నాడు కాబట్టి వారు కర్మ, కర్మ సిధ్ధాంతమును అర్థం చేసుకోలేరు. మనము వివిధ వ్యక్తులను ఎందుకు చూస్తాము?