TE/Prabhupada 0110 - మీ ఆచార్యుని దగ్గర కీలుబొమ్మ అవండి

Revision as of 12:18, 23 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0110 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Morning Walk -- April 19, 1973, Los Angeles

స్వరూప దామోదర: శ్రీమద్-భాగావతం శ్రవణము చేస్తే, వారి హృదయాలు మారుతాయి.

ప్రభుపాద: ఖచ్చితంగా.నిన్నఎవరో మన విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. మేము మీకు రుణపడి వున్నాము. మీరు భాగవతమును మాకు ఇస్తున్నారు ఎవరైనా చెప్పలేదా ?

భక్తులు: అవును అవును. త్రిపురరి అన్నారు. త్రిపురారి.

ప్రభుపాద: త్రిపురారి అవును. ఎవరైనా ఆలా అన్నారా?

త్రిపురారి: అవును, ఇద్దరు బాలురు విమానాశ్రయం వద్ద నిన్న, వారు శ్రీమద్-భాగావతం యొక్క రెండు సెట్లను కొన్నారు.

జయతీర్థ: మొత్తమా?

త్రిపురరి: ఆరు వాల్యూమ్స్. వారు భగవతమునుతీసుకొని "చాలా కృతజ్ఞతలు" అని అన్నారు. మరియు వారు వాటిని లాకర్స్ లో ఉంచి మరియు వారు తమ విమానం కోసం వేచి ఉన్నారు. మరియు వారు ఇరువురు మొదటి కాంటోను తమ దగ్గర ఉంచుకున్నారు

ప్రభుపాద: అవును. ఏ నిజాయితీ వున్నా వ్యక్తి అయిన ఈ ప్రచార ఉద్యమమునకు మనస్ఫూర్తిగా సహాయము చేయవలెనని బావిస్తడు ఈ పుస్తకాలను పంపిణీ చేయడం ద్వారా, మీరు కృష్ణుడికి గొప్ప సేవ చేస్తున్నారు. కృష్ణుడు ప్రతి ఒక్కరికి చెప్పాలని కోరుకుంటున్నారు: sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja(BG 18.66). అయిన వస్తారు. కాబట్టి ఎవరైనా ఆయినకు సేవ చేస్తున్న, "కృష్ణుడికి ఆశ్రయమును," అతనిని కృష్ణడు చక్కగా గుర్తిస్తాడు ఇది భగవద్గీత లో చెప్పబడింది. na ca tasmān manuṣyeṣu (BG 18.69). మానవ సమాజంలో, ప్రచారమునకు సహాయం చేస్తున్న వారికన్నా ఆయినకు ప్రీయమైన వారు ఎవరు లేరు హరే కృష్ణ.

బ్రహ్మానంద: మేము కేవలం మీ కీలుబొమ్మలము, శ్రీల ప్రభుపాద. మీరు మాకు పుస్తకాలు ఇస్తున్నారు.

ప్రభుపాద: కాదు. మనము కృష్ణుని యొక్క కీలు బొమ్మలము. నేను కూడా కీలు బోమ్మనే. కీలుబొమ్మలము ఇది గురు శిష్య పరంపర. మనము కీలు బొమ్మలుగా మారాలి. అంతే నేను నా గురు మహారాజకు కీలుబొమ్మగా ఉన్నాను, మీరు నాకు కీలుబొమ్మగా మారండి అప్పుడు అది విజయము. మన విజయము మన మునపటి ఆచార్యుని దగ్గర కీలు బొమ్మగా మారటము. Tāṅdera caraṇa sevi bhakta sane vāsa. భక్తులు సాంగత్యములో నివసిoచడము. మరియు ఆచార్యుని దగ్గర కీలుబొమ్మగా మారడము. ఇది విజయం. కనుక మనం అలా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కృష్ణ చైతన్య సంఘమునకు మరియు ఆచార్యునికి సేవ చేయడము. అంతే. Harer nāma harer nāma...(CC Adi 17.21). ప్రజలు వస్తారు. ప్రజలు మన ప్రచారాన్ని అభినందిస్తారు. కొంత సమయం పడుతుంది.

స్వరూప దామోదర్: వారు కొన్ని సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు ఎక్కువగా అభినందిస్తున్నారు

ప్రభుపాద: అవును, అవును.

స్వరూప దామోదర్: వారు వాస్తవ తత్వమును అర్థం చేసుకొనుట ప్రారంబిస్తున్నారు