TE/Prabhupada 0113 - నాలుకను నియంత్రించడం చాలా కష్టము

Revision as of 06:57, 24 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0113 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Lecture on SB 5.6.2 -- Vrndavana, November 24, 1976

రఘునాథ దాసు గోస్వామి చాలా ఖచ్చితంగా అనుసరించారు, చైతన్య మహాప్రభు కూడా చాలా ఖచ్చితంగా అనుసరించారు. రూప సనాతన గోస్వామి కుడా చాలా ఖచ్చితంగా అనుసరించారు. ఒక చిన్న వస్త్రముతో వృందావనములో ఉన్నంత మాత్రాన రూప గోస్వామి అయిపోరు రూపా గోస్వామి పూర్తిగా సేవలో ఉన్నారు. Nānā-śāstra-vicāraṇaika-nipuṇau sad-dharma-saṁsthāpakau lokānāṁ hita-kāriṇau. వారు బృందావనాములో ఉండేవారు, కానీ ఈ బౌతిక ప్రపంచానికి, ప్రజలకు ఎలా మంచి చేయాలని వారు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉన్నారు. ప్రహ్లాద్ మహారాజ్ వలె Śoce tato vimukha-cetasa. సాధువు యొక్క ఆందోళన ఏమిటంటే భౌతిక వ్యక్తుల గురించి ఆలోచించడం. వారు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు, వారి చైతన్యాన్ని ఎలా మర్పుచేయలో అని ప్రణాళిక చేస్తూ, వారు బాధపడుతున్నారు. ఇది సాధువు. Lokānāṁ hita-kāriṇau. నేను నా దుస్తులు ఈ విధంగా మార్చు కున్నాను అంటే సాధువు కాదు, ప్రజలు సెంటిమెంట్ ద్వార నాకు రోటీ ఇస్తారు, నేను తిని నిద్రపోతాను. " అది సాదువు కాదు. సాధువు ... భగవాన్ కృష్ణడు, ఒక సాధువు యొక్క నిర్వచనము ఇస్తారు. Api cet su-durācāro bhajate mām ananya-bhāk sādhur eva sa mantavyaḥ (BG 9.30). అతను సాదువు. కృష్ణుడికి పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేసాడు, అతను సాదువు. అతనికి కొన్ని చెడు అలవాట్లు ఉన్నప్పటికీ ... చెడు అలవాట్లు, ఒక సాదువు చెడు అలవాట్లను కలిగి ఉండకుడాదు ఎందుకంటే ఒకరు సాదువు అయితే, మనము కొన్ని చెడు అలవాట్లు మొదట్లో కలిగి ఉంటే, అది సరిచేయబడుతుంది Śaṣvad bhavati dharmātmā. Kṣipraṁ bhavati dharmātmā śaśvac-chāntiṁ nigacchati. అతను నిజానికి సాదువు అయితే, అతని చెడ్డ అలవాట్లు త్వరలోనే సరిచేయబడతాయి, త్వరలో, అతను తన చెడు అలవాట్లు కొనసాగీస్తూ వుంటే అతను ఒక సాధువు కాదు. అది కుదరదు. అతను సాదువు కాదు. బహుశా తన గత అలవాట్లను బట్టి, అతను కొoత పొరపాటు చేసి వుoడవచ్చు. అయితే, అతను సాదువు పేరుతో విముక్తి పొందిన వ్యక్తిగా మారి, అతడు అన్నీ చెత్త పనులు చేస్తూవుంటే, అతను ఒక మోసగాడు. అతను సాదువు కాదు. Api cet su-durācāro. Cet, yadi అవకాశం ద్వారా ఇది సాధ్యమవుతుంది. కానీ అతను కృష్ణ చైతన్యమును పాటిస్తూ వుంటే , అప్పుడు kṣipraṁ bhavati dharmātmā śaśvac-chāntiṁ nigacchati. ప్రారంభంలో కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు, కానీ మనము చూడాలి "నా తప్పులు ఇప్పుడు సరైనవా?" చాల అప్రమత్తంగా ఉండాలి. మనస్సును ఎన్నటికీ నమ్మకండి. ఇది ఇక్కడ ఉపదేశము. మనస్సును విశ్వసించరాదు. నా గురు మహారాజ, చెప్పుతు వుంటారు మీరు నిద్ర నుండి లేచిన తర్వాత, మీ బూట్లను తీసుకొని వందసార్లు మీ మనసును కొట్టండి. ఇది మీ మొదటి కర్తవ్యము మీరు నిద్ర పోయేటప్పుడు మీరు ఒక చీపురి కట్టను తీసుకొని మీ మనస్సును వంద సార్లు కోట్టండి. అప్పుడు మీరు మీ మనస్సును నియంత్రించవచ్చు లేకుంటే అది చాలా కష్టము


బూట్లు మరియు చీపురి కట్టతో కొట్టుకోవడము మరొక తపస్య మనస్సు మీద నియంత్రణలేని మా లాంటి వారికీ మనము ఈ తపస్యను సాధన చేయాలి , బూట్లు చీపురు కట్టతో మనస్సును కొట్టటము. అప్పుడు దానిని నియంత్రించవచ్చు. స్వామి అంటే మనస్సు మీద నియంత్రణ కలిగిన వాడు అని అర్థం. Vāco-vegam, krodha-vegam, udara-vegam, upastha-vegam, manasa-vegam, krodha-vegam, etān vegān yo viṣaheta dhīraḥ pṛthivīṁ sa śiṣyāt (NOI 1)). ఇది రూపా గోస్వామి ఆదేశం. మనము నియంత్రించవచ్చు vaco-Vegam ... ఇది krandana-vegam. (నవ్వుతు). వారు నియంత్రించలేరు. వారు నియంత్రించలేరు. అందువల్ల, వారు పిల్లలు. పిల్లలను క్షమించవచ్చు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో వున్నా ఒక వ్యక్తి, అతను నియంత్రించలేనప్పుడు, అది క్షమించరానిది. అతనికి ఆశాలేదు. దీనిని నియంత్రించవలెను Vaco-vegam, krodha-vegam, udara-vegam, upastha vegam. కానీ చాలా ముఖ్యమైన విషయము Udra-Vegm Jihvā-Vegm. Jihvā-Vegam ఇది చాలా నియంత్రించబడుతుంది. భక్తివినోద ఠాకూర్ చెప్పుతున్నారు అన్ని ఇంద్రియాలు వున్నాయి కానీ వాటిలో నాలుక చాలా ప్రమాదకరమైనది. Tā'ra madhye jihvā ati lobhamoy sudurmati tā'ke jetā kaṭhina saṁsāre. నాలుకను అదుపులో పెట్టడము చాలా, చాలా కష్టం.