TE/Prabhupada 0121 - చివరకు కృష్ణుడు పని చేస్తున్నాడు

Revision as of 05:53, 26 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0121 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Morning Walk At Cheviot Hills Golf Course -- May 17, 1973, Los Angeles

కృష్ణ కాంతి: మానవ మెదడు యొక్క క్లిష్టమైన స్వభావమును చూసి వైద్యులు ఆశ్చర్యపోతున్నారు.

ప్రభుపాద: అవును. అవును.

కృష్ణ కాంతి: వారు ఆశ్చర్యపోతున్నారు.

ప్రభుపాద: కానీ వారు ముర్ఖులు. ఇక్కడ పని చేస్తుంది మెదడు కాదు. ఇక్కడ పనిచేస్తున్నది ఆత్మ అదే విషయం: కంప్యూటర్ యంత్రం. రాస్కల్ ఒక కంప్యూటర్ యంత్రం పని చేస్తుంది అని అనుకుంటున్నారు. మనిషి పని చేస్తున్నాడు. అతను బటన్ను నొక్కినప్పుడు, అది పనిచేస్తుంది. లేకపోతే, ఈ యంత్రం యొక్క విలువ ఏమిటి? మీరు వేల సంవత్సరాలు యంత్రం ఉంచoడి, అది పనిచేయదు. మరొక వ్యక్తి వచ్చినప్పుడు, బటన్ నొక్కినప్పుడు, అది పని చేస్తుంది. ఎవరు పనిచేస్తున్నారు? యంత్రం పని చేస్తున్నదా లేదా మనిషి పని చేస్తున్నాడా? మనిషి కూడా మరొక యంత్రం. పరమాత్మా, దేవుడు అతనిలో ఉండటము వలన అతడు పని చేస్తున్నాడు. అందువలన, చివరికి, దేవుడు పని చేస్తున్నాడు. చనిపోయిన మనిషి పనిచేయలేడు. ఎంత కాలం మనిషి జీవిస్తాడు? పర్మాత్మా ఉన్నంత కాలం అక్కడ ఆత్మ కుడా ఉంటుంది. పరమాత్మా అతనికి తెలివితేటలు ఇవ్వకపోతే, ఆత్మ ఉన్నపటికీ అతను పని చేయలేడు. Mattaḥ smṛtir jñānam apohanaṁ ca (BG 15.15). దేవుడు నాకు మేధస్సు ఇస్తున్నాడు, "మీరు ఈ బటన్ను ఉంచoడి." అప్పుడు నేను ఈ బటన్ను ఉంచుతాను. అంతిమంగా కృష్ణుడు పని చేస్తున్నాడు. ఇంకొక, శిక్షణ లేని వ్యక్తి వచ్చి పని చేయలేడు. ఎందుకంటే అతనికి తెలివితేటలు లేవు. శిక్షణ పొందిన ఒక ప్రత్యేక వ్యక్తి, అతను పని చేయగలడు. ఈ విషయాలు జరుగుతున్నాయి. చివరకు కృష్ణుడి నుంచి వస్తుంది. మీరు ఏమి పరిశోధిస్తున్నరు, మీరు ఏమి మాట్లాడుతున్నరు, ఆది కూడా కృష్ణుడే చేస్తున్నాడు. కృష్ణుడు మీకు ఇస్తాడు ... మీరు, మీరు ఈ సౌకర్యం కోసం కృష్ణుడిని ప్రార్ధించoడి. కృష్ణుడు మీకు ఇస్తున్నాడు. కొన్నిసార్లు మీరు అనుకోకుండా మీ ప్రయోగం విజయవంతమయింది అని తెలుసుకుంటారు. మీరు మీ ప్రయోగాలపై చాల బాధపడుతున్నారని కృష్ణుడు చూసినప్పుడు, "సరే చేయ౦డి." అని అoటాడు యశోదామ్మ కృష్ణుడిని కట్టి వేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, కానీ ఆమె చేయలేక పోయింది. కాని కృష్ణుడు అంగీకరించినప్పుడు, అది సాధ్యమయింది. అదేవిధంగా, ఈ ప్రమాదవశాత్తు విజయము అంటే కృష్ణుడు మీకు సహాయం చేసాడు అని: "సరే, మీరు చాలా కష్టపడ్డారు, ఈ ఫలితం తీసుకోండి." అంతా కృష్ణుడే. mattaḥ sarvaṁ pravartate (BG 10.8). ఇది వివరించబడింది. Mattaḥ smṛtir jñānam apohanaṁ ca (BG 15.15). అంతా కృష్ణడి నుంచి వస్తుంది.

స్వరూపా దామోదర్, కృష్ణుడు ప్రయోగం చేయడానికి కావలసిన దశలు మాకు ఇవ్వలేదు అని చెప్పుతున్నారు.

ప్రభుపాద: అవును, కృష్ణుడు మీకు ఇస్తున్నాడు. లేకపోతే మీరు దాన్ని ఎలా చేస్తారు. మీరు ఏమి చేస్తున్న, అది కృష్ణుడి దయ ద్వారా జరుగుచున్నది. మీరు కృష్ణుడితో మరింత అనుకూలంగా ఉన్నప్పుడు, అప్పుడు కృష్ణడు మీకు మరిన్ని సౌకర్యాలు ఇస్తాడు. కృష్ణడు మీకు సౌకర్యలు ఇస్తాడు, మీమ్మల్ని కరుణిస్తారు. మీరు కోరుకున్నంత ఇస్తారు. అంతకంటే ఇవ్వరు Ye yathā māṁ prapadyante tāṁs tathaiva... కృష్ణుడికి మీరు ఆశ్రయము తీసుకున్నంత స్థాయిలో మీకు మేధస్సు వస్తుంది. మీరు పూర్తిగా ఆశ్రయము తీసుకుంటే, అప్పుడు పూర్తి మేధస్సు వస్తుంది. ఇది భగవద్గీతలో పేర్కొన్నారు. Ye yathā māṁ prapadyante tāṁs tathaiva bhajāmy aham (BG 4.11).