TE/Prabhupada 0128 - నేను ఎప్పుడు మరణించను

Revision as of 15:59, 28 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0128 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Press Conference -- July 16, 1975, San Francisco

పాత్రికేయుడు: యునైటెడ్ స్టేట్స్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? నాకు రెండు వేలమంది ఉన్నారని చెప్పారు. సుమారుగా సరైనదేనా?

ప్రభుపాద: వారు చెప్పగలరు. జయతీర్దా: మకు ప్రపంచవ్యాప్తంగా పదివేలమంది సభ్యత్వం కలిగివున్నారు. వీరిలో ఎంతమంది యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నారు అన్నది సరిగ్గా విశ్లేషించ లేదు.

పాత్రికేయుడు: నేను ఐదు సంవత్సరాల క్రితం ఈ ఉద్యమం మీద ఒక కథ వ్రాసాను. ఆ సమయంలో యునైటెడ్ స్టేట్స్ లో రెండు వేలు ఉన్నారని అంచనా వేశాను.

ప్రభుపాద: ఇది పెరుగుతోంది.

పాత్రికేయుడు: అది పెరుగుతోందా?

ప్రభుపాద: అవును. ఖచ్చితంగా.

జయతీర్దా: నేను ప్రపంచవ్యాప్తంగా పదివేల మంది ఉన్నారని చెప్పుతున్నాను.

పాత్రికేయుడు: అవును, నేను అర్థం చేసుకున్నాను. మీకు ఎంత వయస్సు ఉంటుందో నాకు చెప్తారా?

జయతీర్దా: మీ వయసును, శ్రీల ప్రభుపాద ఆయన తెలుసుకోవాలనుకుoటున్నాడు.

ప్రభుపాద: నాకు ఒక నెల తర్వాత ఎనభై ఉంటుంది.

పాత్రికేయుడు : ఎనభై?

ప్రభుపాద: ఎనభై సంవత్సరాల వయస్సు.

పాత్రికేయుడు: ఏం జరుగుతుంది ...

ప్రభుపాద: నేను 1896 లో జన్మించాను, ఇప్పుడు మీరు లెక్కించవచ్చు.

పాత్రికేయుడు: మీరు మరణించినప్పుడు యునైటెడ్ స్టేట్స్లో ఈ ఉద్యమమునకు ఏమి జరుగుతుంది?

ప్రభుపాద: నేను ఎప్పటికీ చనిపోను.

భక్తులు: జయ! హరి బోల్! (నవ్వు) ప్రభుపాద: నేను నా పుస్తకాలలో జీవించి ఉంటాను, మీరు ఉపయోగించుకుంటారు.

పాత్రికేయుడు: మీరు ఒక వారసుడికి శిక్షణ ఇస్తున్నారా?

ప్రభుపాద: అవును, నా గురు మహరాజా అక్కడ ఉన్నారు.నా గురు మహారాజ యొక్క ఫోటో ఎక్కడ ఉంది? నేను అనుకుంటున్నాను ... ఇక్కడ ఉంది.

పాత్రికేయుడు: హరే కృష్ణ ఉద్యమం ఎందుకు సాంఘిక నిరసనలో పాల్గొనదు?

ప్రభుపాద: మనము ఉత్తమ సామాజిక కార్యకర్తలము. ప్రజలు మూర్ఖులు, దృష్టులు.. మనము దేవుడి చైతన్యము అనే మంచి ఆలోచనను బోధిస్తున్నాము. మనము ఉత్తమ సామాజిక కార్యకర్తలము. మనము అన్ని నేరాలను ఆపివేస్తాము. మీ సామాజిక పని ఏమిటి? హిప్పీలను, నేరస్థులను ఉత్పత్తి చేస్తూన్నారు. అది సామాజిక పని కాదు. సాంఘిక పని అంటే జనాభా చాలా శాంతియుతమైన, తెలివైన, తెలివితేటలు, దేవుడి చేతన్యము కలిగిన ఉత్తమ వ్యక్తులు. ఇది సామాజిక పని. మీరు నాల్గవ-తరగతి, ఐదవ-తరగతి, పదవ తరగతి వ్యక్తులను ఉత్పత్తి చేస్తే అది సామాజిక పని ఎలా అవుతుంది? మనము ఉత్పత్తి చేస్తున్నాము. చూడండి. ఇక్కడ మొదటి-తరగతి మనిషి. వారికి ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు, అక్రమ లైంగిక సంబంధము, మత్తు, మాంసం తినడం, లేదా జూదం ఆడడడము లేదు. వారు అందరు యువకులు. వీటన్నింటికి వారు బానిసలు కాలేదు. ఇది సామాజిక పని.

భక్తదాసా: శ్రీల ప్రభుపాద, వారు హరే కృష్ణ ఉద్యమము రాజకీయము మీద ఎటువంటి ప్రభావం చూపెడుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు?

ప్రభుపాద: హరే కృష్ణ ఉద్యమమును మీరు తీసుకుంటే అంతా ప్రకాశవంతముగా ఉంటుంది. Yasyāsti bhaktir bhagavaty akiñcanā sarvair guṇais tatra samāsate surāḥ (SB 5.18.12). ఈ దేవుడి చైతన్యమును వ్యాప్తి చేస్తే, అప్పుడు ప్రతి ఒక్కరూ ఉత్తమ అర్హతలను పొందుతారు దేవుడి చైతన్యం లేకుండా, మనము ఉదయం చర్చిస్తున్నట్లు విద్య అని పిలవబడే, దానికి విలువ ఉండదు. కేవలము వారు మాట్లాడుతున్నారు. మనము మాట్లాడుతున్న విషయం ఏమిటి?

బహులువా: ఈ ఉదయం మనస్తత్వశాస్త్రం.

ప్రభుపాద: ఫలితంగా విద్యార్థులు నిరాశతో ఎంతో ఎతైన టవరు నుంచి దుకుతున్నారు. వారిని గాజుతో రక్షిస్తున్నారు.

బహుళశివ: 60వ దశకంలో బెర్కేలే క్యాంపస్ విద్యార్ధులు బెల్ టవర్ మీదనుంచి తమను తాము చంపుకోవాడానికి ఆ గోపురం ఎత్తు నుంచి దూకేవారు. వారు విద్యార్థులను దుకడము ఆపటానికి అక్కడ గాజును ఉంచారు. అందువల్ల ప్రభుపాద వివరిస్తూన్నారు. ఇది వారి విద్య. వారు విద్య పొందిన తరువాత, వారు దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు (నవ్వులు)

ప్రభుపాద: ఇది విద్య కాదు. Vidyā dadhāti namratā. విద్యావంతుడు అంటే వినయము, సున్నితము, శాంతిగా, పూర్తి జ్ఞానము , క్రియాశీలక జీవన విధానములో జ్ఞానము, సహనము, మనస్సు నియంత్రణ, ఇంద్రియాలను నియంత్రణ కలిగి ఉండుట అది విద్య. ఈ విద్య ఏమిటి? 

పాత్రికేయుడు: మీరు ఒక కళాశాల ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారా? ప్రభుపాద: అవును, ఇది నా తరువాతి ప్రయత్నం, వర్గీకరణ ప్రకారం మనము విద్యావంతులను చేస్తాము. మొదటి తరగతి, రెండవ తరగతి, మూడవ తరగతి, నాలుగో తరగతి వరకు. ఆపై ఐదవ తరగతి, ఆరవ తరగతి, అక్కడ సహజముగా ఉంటుంది. అందువలన, మొదటి తరగతి వ్యక్తులు సమాజంలో ఉండాలి కనీసం ఆదర్శవంతమైన వ్యక్తులు ఉండాలి, అతను మనస్సును నియంత్రించటానికి శిక్షణ పొందిన వ్యక్తి, ఇంద్రియాలను నియంత్రణ కలిగి వుండి, చాలా, శుభ్రంగా నిజాయితీ, సహనంతో ,సరళతతో, పూర్తి జ్ఞానము కలిగి, జ్ఞానమును ఆచరించుటకు ఆచరణాత్మకమైన పద్ధతులను తేలిసుకొని, భగవంతుని పై సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండవలెను ఇది మొదటి తరగతి వ్యక్తి.