TE/Prabhupada 0205 - వీరు అంగీకరిస్తారని నేనెప్పుడు ఊహించలేదు

Revision as of 12:30, 11 July 2017 by Jogeswara (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0205 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Morning Walk -- May 20, 1975, Melbourne

ప్రభుపాద: అతనిని కృష్ణ చైతన్యవంతునిగానే చేయాలి అని అనుకోవలసిన పని లేదు. కృష్ణ చైతన్య వంతునిగా అవటము అంత సులభమూ కాదు. ఇది అంత సులభం కాదు. దీనికి సమయం పడుతుంది, bahūnāṁ janmanām ante (BG 7.19), అనేక జన్మల తరువాత గాని జరుగదు. కానీ మీ విధిని మీరు చేయాలి. వెళ్ళండి మరియు బోధించండి. Yāre dekha, tāre kaha 'kṛṣṇa'-upadeśa (CC Madhya 7.128) మీ బాధ్యత పూర్తయింది. అయితే, మీరు అతన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు. అతను మారకపోతే, ఇది మీ విధికి సంబంధించిన విచలనం కాదు. మీరు కేవలం వెళ్ళి మాట్లాడాలి. ఎలా అంటే, నీను మీ దేశానికి వచ్చినప్పుడు ఇది విజయవంతమవుతుందని అనుకోలేదు. నాకు తెలుసు ఎందుకంటే, "నేను ఈ విషయాలు 'అక్రమ లైంగికత వద్దు, , మాంసం తిన వద్దు' అని చెప్పగానే వారు నన్ను తిరస్కరిస్తారు. (నవ్వు) నేను ఆశాజనకంగా లేనే లేను.

భక్తుడు (1): వారు వాటికి చాల బానిస అయివున్నారు

ప్రభుపాద: అవును. కాని ఇది మీదయ నన్ను అంగీకరించటము. నేను అసలు ఉహించలేదు. ఈ ప్రజలు అంగీకరిస్తారని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను ఎప్పుడూ ఊహించలేదు.

హరి-శౌరి: మనము కనుక కృష్ణునిపై ఆధారపడినట్లయితే ...

ప్రభుపాద: అవును, అది మన ఏకైక వ్యాపారం.

హరిశౌరి: మరియు మనము ఫలితాలు కోసం చూస్తే, అప్పుడు...

ప్రభుపాద: మనము ఆధ్యాత్మిక గురువు బోధించిన ప్రకారం మనము మన ధర్మం చేయాలి. Guru-kṛṣṇa-kṛpāya (CC Madhya 19.151). అప్పుడు రెండు వైపులా, మన ఆధ్యాత్మిక గురువు మరియు కృష్ణ మనమంటే ఇష్టపడతారు. మరియు అదే విజయం.