TE/Prabhupada 0199 - దుష్టవ్యాఖ్యాతలు కృష్ణుడిని తప్పించాలను కుంటారు
Lecture on BG 13.8-12 -- Bombay, September 30, 1973
తత్వము లేకుండా ఏమి అర్ధము చేసుకున్న, అది ముఢవిశ్వాసము. ధర్మము లేకుండా తత్వము మానసిక కల్పన. ఈ రెండు విషయాలు ప్రపంచవ్యాప్తంగా కలవ కుండా ఉన్నాయి అనేక ధర్మ పద్ధతులు ఉన్నాయి, కానీ తత్వము లేదు. అందువల్ల ఆధునిక విద్యావంతులైన వ్యక్తులకు ధర్మ పద్ధతి అర్ధము కాదు. వారు క్రైస్తవ, ముస్లిం, హిందూ ధర్మముని వదిలి పెడతారు. కేవలం లాంఛనాలు, ఆచారాలు, వారు ఇష్టపడరు. వారు తత్వము ఆధారంగా ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు. ఇది భగవద్గీత.
భగవద్గీత తత్వము మీద ఆధారపడి ఉంది, ఈ పద్ధతి, కృష్ణ- భక్తి భగవద్గీత అంటే కృష్ణ-భక్తి, కృష్ణుడికి భక్తి, కృష్ణ చైతన్యము. ఇది భగవద్గీత. భగవద్గీత, ఉపదేశము man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru (BG 18.65). ఇది భగవద్గీత. "ఎల్లప్పుడూ నా గురించి ఆలోచించండి." కృష్ణ చైతన్యము, పవిత్రమైనది సరళమైనది. Man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru (BG 18.65). ప్రతి చోటా కృష్ణుడు తన వ్యక్తిత్వంపై నొక్కిచెప్పాడు. Aham ādir hi devānām: (BG 10.2) "నేను అందరి దేవతల యొక్క మూలం." Mattaḥ parataraṁ nānyat kiñcid asti dhanañjaya (BG 7.7).
- ahaṁ sarvasya prabhavo
- mattaḥ sarvaṁ pravartate
- iti matvā bhajante māṁ
- budhā bhāva-samanvitāḥ
- (BG 10.8)
అంతా ఉంది. కావున sarva dharmān parityajya mām ekam (BG 18.66), mām, aham, "నన్ను." ప్రతి శ్లోకమునులో, ప్రతి అధ్యాయంలో, కృష్ణుడు. Mayy āsakta-manaḥ pārtha yogaṁ yuñjan mad-āśrayaḥ. Mayy āsakta, "నా పై ఆసక్తి కలిగిన వారు" āsakta-manaḥ, " మనస్సును నా పై లగ్నము చేసిన వారు, అది యోగము Yogīnām api sarveṣāṁ mad-gatenāntarātmanā. Mad-gata, again mat (BG 6.47). Mad-gatenāntarātmanā, śraddhāvān bhajate yo māṁ sa me yuktatamo mataḥ. అందువల్ల ప్రతి ఒక్క దానికి ఒత్తిడి ఇవ్వబడినది, కృష్ణుడికి. కానీ రాస్కల్ వ్యాఖ్యాతలు, వారు కృష్ణుడిని తీసివేయలనుకుంటున్నారు.
ఈ మూర్ఖత్వము భారతదేశమును నాశనమ చేసింది. ఈ దుష్ట వ్యాఖ్యాతలు, వారు కృష్ణుడిని తప్పించటానికి ఇష్టపడతారు. అందువల్ల ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఈ దుష్టులకు ఒక సవాలు. ఇది ఒక సవాలు, "మీరు కృష్ణుడిని లేకుండా కృష్ణుడినిగా చేయాలని అనుకోవటం ఇది అర్ధంలేనిది."