TE/Prabhupada 0333 - పవిత్రము అవ్వమని ప్రచారము చేస్తున్నాము

Revision as of 00:21, 27 August 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0333 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 16.6 -- Hawaii, February 2, 1975


Evaṁ paramparā-prāptam imaṁ rājarṣayo viduḥ ( BG 4.2) సరిగ్గా ఆ విధముగా ఇక్కడ సూర్యుడు భగవంతుడు యొక్క ఒక సృష్టిలో చాల అల్పమైన వాడు. సూర్యుడు చాలా ప్రకాశము, శరీర కిరణాలు కలిగి ఉన్నాడు, సూర్యుడు మొత్తం విశ్వాన్ని ప్రకాశవంతంగా వేడిగా ఉంచుతాడు. మీరు దీన్ని తిరస్కరించలేరు. ఇది సూర్యుని యొక్క పరిస్థితి. సూర్యుడులు మిలియన్ల ట్రిలియన్ల ఉన్నారు,కొన్ని ఈ సూర్యుని కంటే పెద్దవి, ఉన్నాయి. ఇది అతి చిన్న సూర్యుడు. పెద్ద, పెద్ద సూర్యుడులు ఉన్నారు. శరీర కిరణాలు అంటే మనము అర్థం చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. కృష్ణుడి శరీర కిరణాలను బ్రాహ్మణ్ అని పిలుస్తారు. Yasya prabhā prabhavato jagad-aṇḍa-koṭi-koṭiṣu vasudhādi-vibhūti-bhinnam, tad brahma: (Bs. 5.40) అది బ్రాహ్మణ్, ఆ ప్రభ.

అదేవిధంగా, కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడు, స్థానికముగా. ఇది నిరాకర విస్తరణ. సూర్యరశ్మి సూర్యుని యొక్క నిరాకర విస్తరణ లాగానే, అదేవిధంగా, బ్రాహ్మణ్ ప్రకాశము కృష్ణుడి శారీరక కిరణాల యొక్క నిరాకర విస్తరణ. అంతేగాక అతను ప్రతిచోటా, aṇḍāntara-stha-paramāṇu-cayāntara-stham... (Bs. 5.35). అయిన ఈ విశ్వంలో ఉన్నాడు. అయిన మీ హృదయం లోపల, నా హృదయము లోపల ఉన్నాడు. అయిన ప్రతిదానిలోపల ఉన్నాడు. "ప్రతిదానిలో" అనగా పరమాణువులో కూడా ఉన్నాడు. అది అయిన పరామత్మా లక్షణం. చివరి అంతిమ లక్షణం కృష్ణుడి యొక్క వ్యక్తిగత శరీరం. Sac-cid-ānanda-vigrahaḥ. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ sac-cid-ānanda-vigrahaḥ (Bs. 5.1).

విగ్రహ అంటే రూపం. ఆ రూపం మన రూపము లాంటిది కాదు. అది sat, cit, ānanda . శరీరము మూడు లక్షణాలను కలిగి ఉంది. సత్ అంటే శాశ్వతమైనది. , అయిన శరీరం మన శరీరం నుండి విభిన్నమైనది. మన, ఈ శరీరం చరిత్రలో శాశ్వతమైనది కాదు. తండ్రి మరియు తల్లి ఈ శరీరాన్ని సృష్టించినప్పుడు, ప్రారంభమైన తేది ఉంది. ఈ శరీరం పూర్తయినప్పుడు, నాశనమైతే మరొక తేది ఉంటుంది. తేదిల మధ్యలో ఏదైనా ఉన్నాది, అది చరిత్ర. కానీ కృష్ణుడు అలాంటి వాడు కాదు. Anādi. కృష్ణుడి శరీరం ఎప్పుడు ప్రారంభమైనది అని మీరు అంచనా వేయలేరు. అనాది. ఆదీ, మళ్ళీ ఆదీ. అయిన ప్రతి ఒక్కరికీ ఆరంభం. అనాది. అయినే అనాది; ఎవరూ అయిన ప్రారంభ సమయము ఏమిటో తెలుసుకోలేరు. అయిన చరిత్రకు అతీతమైన వాడు. , అయిన ప్రతిఒక్కరి ఆరంభంలో ఉన్నాడు. నా తండ్రి నా శరీరా ప్రారంభము వలె తండ్రి నా శరీరం లేదా మీ శరీరం యొక్క ప్రారంభము , ప్రతి ఒక్కరికి కారణం. అందుచే అతనికి ప్రారంభము లేదు. ఆయినకు తండ్రి లేడు కానీ అతను సర్వశక్తిమంతుడైన తండ్రి. ఇది భావన, క్రైస్తవ భావన: దేవుడు సర్వోన్నతమైన తండ్రి. అది వాస్తవము, ఎందుకంటే అయిన ప్రతి ఒక్కరికి ఆరంభం. Janmādy asya yataḥ: ( SB 1.1.1) ఏది ప్రపంచములోనికి వచ్చినా , ఆది కృష్ణుడి నుండి వచ్చింది. ఇది భగవద్గీతలో చెప్పబడింది. Aham ādir hi devānām ( Bg 10.2) దేవతలు ... ఈ బ్రహ్మానందము బ్రహ్మ యొక్క సృష్టి. అయిన దేవతలలో ఒకడు . కృష్ణుడు చెప్పుతాడు, aham ādir hi devānām, నేను దేవతల ప్రారంభము మీరు కృష్ణుడిని ఈ విధంగా అధ్యయనం చేస్తే, అప్పుడు మీరు దైవ, పవిత్రముగా దివ్యముగా ఉంటారు. దైవ సంబంధమైన.

మన కృష్ణ చైతన్య ఉద్యమం ప్రతి ఒక్కరిని పవిత్రము అవ్వమని ప్రచారము చేయడానికి ఉద్దేశించబడింది. అది కార్యక్రమం. పవిత్రాత పొందడం వలన లాభమేమిటి? అది మునుపటి శ్లోకమునులో వివరించబడింది. Daivī sampad vimokṣāya ( BG 16.5) మీరు పవిత్రముగా ఉంటే, దివ్యమైన లక్షణాలను పొoదితే, abhayaṁ sattva-saṁśuddhiḥ jñāna-yoga-vyavasthitiḥ... అంటే ... మనము ఇప్పటికే చర్చించాము. మీరు పవిత్రముగా ఉంటే ... పవిత్రముగా ఉండటానికి అవరోధం లేదు. కేవలము మీరు దాని కోసం సాధన చేయాలి. ప్రతిఒక్కరు ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తిగా అయేటట్లుగానే. పతి ఒక్కరు యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు కావచ్చు. అవరోధము లేదు. కానీ మీరు అర్హత కలిగి ఉండాలి. మీరు అర్హులైతే, మీరు ఏమైనా కావచ్చు ... ఏ స్థానములోనైనా ఉండవచ్చు. అదేవిధంగా, ఆ విధముగా చెప్పినట్లు , దివ్యముగా ఉండటానికి, నీవు దివ్యత్వం పొందాలంటే నీవు అర్హుడివి కావలి. పవిత్రముగా ఎలా మారాలి? ఇది ఇప్పటికే వివరించబడింది. మనము ఇప్పటికే ... మీరు పవిత్రమైన లక్షణాల ద్వారా మీరు అర్హత పొందితే, అప్పుడు ప్రయోజనము ఏమిటి? Daivī sampad vimokṣāya. Mokṣa. Mokṣa మోక్షా అంటే విముక్తి. మీరు పవిత్రమైన లక్షణాలను పెoపొoదిoచుకుoటే, మీరు స్వేచ్ఛను పొoదడానికి అర్హతా కలిగి ఉoటారు. విముక్తి అంటే ఏమిటి? పునరావృతమవుతున్న జన్మ మరియు మరణం నుండి విముక్తి. ఇది మన వాస్తవమైన బాధ. ఆధునిక, దుష్ట నాగరికత, బాధల యొక్క ముగింపు ఏమిటో వాస్తవానికి వారికి తెలియదు. వారికి తెలియదు. విద్య లేదు. శాస్త్రము లేదు. వారు "ఈ చిన్న జీవిత కాలం, యాభై సంవత్సరాలు, అరవై సంవత్సరాలు, వంద సంవత్సరాలు, అంతే అని అనుకుంటున్నారు మనము ఒక చక్కని భార్యను, ఒక చక్కని అపార్ట్మెంట్ ను చక్కని మోటార్ కారు కలిగి ఉంటే, డెబ్బై మైళ్ల వేగంతో నడుస్తుంటే, ఒక చక్కని విస్కీ బాటిల్ ... " అది పరిపూర్ణము. కానీ అది vimokṣāya కాదు. వాస్తవ vimokṣa విముక్తి అంటే ఇక జన్మించడము, చావు, వృద్ధాప్యం వ్యాధి లేకపోవటము అది vimokṣa. కానీ అది కూడా వారికి తెలియదు.