TE/Prabhupada 0457 - కృష్ణ చైతన్యం మాత్రమే కొరతగా ఉంది

Revision as of 09:16, 22 September 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0457 - in all Languages Category:TE-Quotes - 1977 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.9.6 -- Mayapur, February 26, 1977


శాస్త్రము అంటే కేవలం పరిశీలన మాత్రమే కాకుండా ప్రయోగం కూడా అది సంపూర్ణము. లేకపోతే సిద్ధాంతము. ఇది సైన్స్ కాదు. వారికి వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరైనా ఏదైనా చెప్పవచ్చు. అది కాదు... కానీ వాస్తవం ఏమిటంటే కృష్ణుడు ఆధ్యాత్మికము మరియు అతను దేవాదిదేవుడు. Nityo nityānāṁ cetanaś cetanānām (Kaṭha Upaniṣad 2.2.13) ఇది వేదముల ఉత్తర్వు. భగవంతుడు సర్వశ్రేష్ఠమైన నిత్యము శాశ్వతమైన వాడు మరియు సర్వశ్రేష్ఠమైన జీవి. నిఘంటువులో కూడా చెప్పబడింది భగవంతుడు అంటే సర్వోన్నత జీవి అని అర్థం. సర్వోన్నత జీవిని వారు అర్థం చేసుకోలేరు. కానీ వేదాలలో ఇది చెప్పబడింది దేవాదిదేవుడు సర్వోన్నతుడు మాత్రమే కాదు, కానీ సర్వోన్నత జీవి అని. Nityo nityānāṁ cetanaś cetānām eko yo bahūnāṁ vidadhāti kāmān (Kaṭha Upaniṣad 2.2.13). ఇది దేవుని గురించిన వివరణ. కావున ఆధ్యాత్మిక సారాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టము, మరియు ఇంక దేవుని గురించి ఏమి మాట్లాడుతాము. ఆధ్యాత్మిక విజ్ఞాన ఆరంభం ఏమిటంటే మొదట ఈ ఆత్మ ఏమిటి? అని అర్థం చేసుకోవాలి. మరియు వారు తెలివిని లేదా మనసును ఆత్మగా తీసుకుంటారు. కానీ అది ఆత్మ కాదు. అంతకు మించినది, Apareyam itas tu viddhi me prakṛtim parā ( BG 7.5)

కావున ఈ పరిపూర్ణత. ప్రహ్లాద మహారాజు పొందిన విధముగా. దేవాది దేవుడు తాకిన వెంటనే, మనము కూడా కలిగి ఉంటాము. అక్కడ అవకాశముంది, చాలా సులభంగా, ఎందుకంటే మనం పతితులము , మందః చాలా నెమ్మదిగా, చాలా దుష్టులము. మంద మరియు సుమంద మతయో. మరియు ఈ కారణంగా మనం చాలా దుష్టులుగా వున్నాం, ప్రతి ఒక్కరు ఒక సిద్ధాంతాన్ని తయారు చేశారు. సుమంద. మత. మత అంటే అభిప్రాయము మరియు ఆ అభిప్రాయమేమిటి? మంద మాత్రమే కాదు, కానీ సుమంద, చాలా చాలా దుష్ట. సుమంద మతయో. Mandāḥ sumanda-matayo manda-bhāgyāḥ ( SB 1.1.10) మరియు అన్ని దురదృష్టకరమైన లేదా అదృష్ట హీనమైన. ఎందుకు? అక్కడ జ్ఞానం ఉన్నప్పుడు, వారు తీసుకోరు. వారు సిద్ధాంతాలు చెప్పుతారు. వారు దురదృష్టవంతులు. వాస్తవ జ్ఞానం ఉంది , కానీ వారు ఊహించుకుంటారు. ఇది ఇలా ఉంటుంది. అది అలా ఉంటుంది. ఇదిలా ఉండవచ్చు. బహుశా.... కావచ్చు... ఇది జరుగుతోంది. అందువలన మంద భాగ్య. ఉదాహరణకు ఇక్కడ డబ్బు ఉంది. ఎవరూ ఆ డబ్బు తీసుకోరు. అతను డబ్బు సంపాదించడానికి పందులు కుక్కల వలె పని చేస్తాడు. అంటే దురదృష్టము అని అర్ధము. mandāḥ sumanda-matayo manda-bhāgyāḥ. ఎందుకంటే manda-bhāgyāḥ, అక్కడ upadrutaḥ నిరంతరం కలత ఉంటుంది, ఈ యుద్ధం, ఆ యుద్ధం, ఆ యుద్ధం , ప్రారంభం నుండి. మొత్తం చరిత్రంతా కేవలం యుద్ధం. ఎందుకు యుద్ధం? ఎందుకు ఈ పోరాటం ఉంది? అక్కడ ఎటువంటి పోరాటం ఉండదు. ఎందుకంటే ప్రతిదీ పూర్ణము... pūrṇam idam (Īśopaniṣad, Invocation). దేవాది దేవుని దయతో మొత్తం ప్రపంచమంతా నిండి పోయింది ఎందుకంటే ఇది ఆయన రాజ్యం ... ఇది కూడా దేవుని రాజ్యం. కానీ మనం అనవసరంగా పోరాటంచే దీనిని నరకం చేశాము. అంతే లేకపోతే ఇది... భక్తుని కొరకు pūrṇam. Viśvaṁ pūrṇaṁ sukhāyate. ఎందుకు పోరాటము ఉండాలి? దేవుడు అన్నింటినీ సరఫరా చేశారు. మీకు నీరు కావాలా? భూమి మూడువంతులు నీటితో నిండి ఉంది. కానీ ఆ నీరు ఉప్పగా ఉంది. దాన్ని ఎలా తీపి చేయాలనే పద్ధతి భగవంతుడి దగ్గర ఉంది. మీరు దాన్ని చేయలేరు. మీకు నీరు కావాలి. అక్కడ తగినంత నీరు ఉంది. మరి నీటి కొరత ఎందుకు ఉంది? ఇప్పుడు మనం వింటున్నాము యూరోప్లో వారు నీటిని దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు. (నవ్వు) అదికాదా? అవును. ఇంగ్లాండ్లో వారు దిగుమతి గురించి ఆలోచిస్తున్నారు. అది సాధ్యమవుతుందా? (నవ్వు) కానీ ఈ మూర్ఖపు శాస్త్రవేత్తలు ఇలా భావిస్తారు వారు దిగుమతి చేస్తారు. ఎందుకు చేయకూడదు? ఇంగ్లాండ్ చుట్టూ నీరు ఉంది. నీవు ఆ నీటిని ఎందుకు తీసుకోకూడదు? లేదు. Nire kari bas na me tilo piyas. నేను నీటిలో ఉన్నాను కానీ దాహంతో మరణిస్తున్నాను. ఈ మూర్ఖుల జ్ఞానము... లేదా లో.... నా బాల్యం లో నేను ఒక పుస్తకంలో చదివాను అని అనుకుంటున్నాను. ఒక నీతి పాఠ్యపుస్తకము. అందులో ఒక కథ ఉంది ఒక ఓడ శిథిలమైనది. వారు ఒక ఓడ యందు ఆశ్రయం తీసుకున్నారు. కానీ వారిలో కొందరు దాహంతో మరణించారు. ఎందుకంటే వారు నీటిని తాగలేరు. వారు నీటిలోనే జీవిస్తున్నారు కానీ వారు దాహంతో చనిపోయారు.

మన పరిస్థితి ఆ విధంగానే ఉంది. ప్రతిదీ సంపూర్ణముగా ఉన్నది అయినప్పటికీ మనం చనిపోతున్నాము మరియు పోరాడుతున్నాము. కారణం ఏమిటి? కారణం మనం కృష్ణుడిని అనుసరించము. ఇదీ కారణం. కృష్ణచైతన్యము లేకపోవడం. నా గురు మహారాజు చెప్తూ ఉండేవారు ఈ ప్రపంచములో ప్రతిదీ సంపూర్ణముగా ఉన్నది. కేవలం కృష్ణ చైతన్యం మాత్రమే కొరతగా ఉంది ఇది మాత్రమే కొరత. లేకపోతే అక్కడ ఏ కొరతా లేదు మొత్తం పూర్తిగా ఉంది. మరియు మీరు కృష్ణుడి ఉపదేశం తీసుకుంటే వెంటనే సంతోషంగా ఉంటారు. మీరు మొత్తం ప్రపంచాన్ని సంతోషంగా చేయగలరు. భగవద్గీతలో ఇది కృష్ణుడు ఉపదేశము. ఎంతో పరిపూర్ణమైనది. ఇది సంపూర్ణంగ ఉండాలి, ఎందుకంటే ఇది కృష్ణుడి నుండి వస్తుంది. ఇది అటువంటి పిలువబడే శాస్త్రవేత్త సిద్ధాంతం కాదు. పరిపూర్ణ ఉపదేశము. మనము ఈ ఉపదేశమును అనుసరిస్తే మనము ఆచరణాత్మకంగా పాటించినట్లయితే అప్పుడు మొత్తం ప్రపంచము viśvaṁ pūrṇaṁ sukhāyate