TE/Prabhupada 0502 - మీరు ఈ వెర్రి భావనలను విడిచిపెట్టి,కృష్ణచైతన్యము యొక్క విస్తృత జీవితం తీసుకోండి
Lecture on BG 2.15 -- Hyderabad, November 21, 1972
కాబట్టి ప్రహ్లాద మహారాజు, "మీరు ఈ వెర్రి భావనలను విడిచిపెట్టండి" అని సలహా ఇచ్చారు. Vanaṁ gato yad dharim āśrayeta ( SB 7.5.5) కేవలము vanaṁ gataḥ, జీవితం యొక్క ఈ భావన, gṛham andha-kūpam కేవలం ఈ భావన నుండి బయటపడుము అని అర్థం. కృష్ణచైతన్యము యొక్క విస్తృత జీవితం తీసుకోండి. అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. Hitvātma-pātaṁ gṛham andha-kūpaṁ vanaṁ gato yad dharim āśrayeta ( SB 7.5.5) Harim āśrayeta. వాస్తవమైన కర్తవ్యము harim āśrayeta. Vanaṁ gataḥ. Vanaṁ gataḥ అంటే అడవికి వెళ్లడం. పూర్వం, గృహస్థ జీవితం తరువాత, వానప్రస్థ జీవితం, సన్యాస జీవితం, వారు అడవిలో నివసించేవారు. కానీ అడవికి వెళ్లడం అనేది జీవితం యొక్క ప్రధాన ఉద్ధేశ్యం కాదు. ఎందుకంటే అడవిలో అనేక జంతువులు ఉన్నాయి. అది ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధి చెందినట్లు అర్థమా? దీనిని markaṭa-vairāgya. అని పిలుస్తారు. మర్కట-వైరాగ్య అంటే "కోతి పరిత్యాగము." కోతి నగ్నంగా ఉంది. నాగ-బాబా. దిగంబరంగా. మరియు పండు తింటుంది, కోతి, ఒక చెట్టు కింద లేదా చెట్టు మీద నివసిస్తుంది. కానీ దానికి కనీసం మూడు డజన్ల భార్యలు ఉంటారు. కాబట్టి ఇది మర్కట -వైరాగ్య, ఈ విధమైన పరిత్యాగమునకు విలువ లేదు. వాస్తవమైన పరిత్యాగము. వాస్తవ పరిత్యాగము అంటే మీరు andha-kūpa జీవితాన్ని వదలివేయాల్సి ఉంటుంది, మరియు కృష్ణుడిని ఆశ్రయించాలి, harim āśrayeta. మీరు కృష్ణుడి ఆశ్రయం తీసుకుంటే, అప్పుడు మీరు ఈ అన్ని " ism" జీవితాన్ని వదిలివేయగలరు. లేకపోతే, అది సాధ్యం కాదు; మీరు ఈ "ism" జీవితం ద్వారా మాయలో చిక్కుకుంటారు. అందువలన hitvātma-pātaṁ gṛham andha-kūpaṁ vanaṁ gato yad dharim āśrayeta ( SB 7.5.5) వదులుకోవద్దు... మీరు ఏదైన వదిలేయాలనుకుంటే, మీరు మరొక దానిని తీసుకోవాలి. లేకపోతే, అది చెదిరిపోతుంది. తీసుకోండి. అది సిఫారసు: paraṁ dṛṣṭvā nivartate ( BG 2.59) మీరు మీ కుటుంబ జీవితం, సామాజిక జీవితం, రాజకీయ జీవితం, ఈ జీవితం, ఆ జీవితం, వదలివేయవచ్చు మీరు కృష్ణ చైతన్య జీవితాన్ని తీసుకున్నప్పుడు. లేకపోతే, అది సాధ్యం కాదు. లేకపోతే, మీరు ఈ జీవితంలో కొoత తీసుకోవాలి. మీరు స్వేచ్ఛ పొందే ప్రశ్నే లేదు. ఆందోళనల నుండి స్వేచ్ఛ పొందే ప్రశ్నే లేదు. ఇది మార్గం.
ఇక్కడ అదే విషయం, అది tattva-darśibhiḥ, ఎవరైతే సంపూర్ణ సత్యమును వాస్తవముగా చూడగలరో... athāto brahma jijñāsā, ఇది వేదాంత-సూత్ర లో చెప్పబడింది... నిన్న, ఒక అబ్బాయి నన్ను అడుగుతున్నాడు: వేదాంత ఏమిటి? వేదాంతం, వేదాంతం యొక్క అర్థం ఏమిటి? ఇది చాలా బాగుంది, ఇది చాలా సులభం. వేదములు అంటే జ్ఞానం, అంత అంటే అంతిమం అని అర్థం. కాబట్టి వేదాంత అంటే అంతిమ జ్ఞానం. అంతిమ జ్ఞానం కృష్ణుడు. కృష్ణుడు చెప్తాడు, vedaiś ca sarvair aham eva vedyo vedānta-kṛd veda-vid ca aham. ఆయన వేదాంతం యొక్క సృష్టికర్త. ఆయన వేదాంతం తెలిసినవారు ఆయనకు వేదాంతం గురించి తెలియనట్లయితే, వేదాంతం ఎలా వ్రాయగలడు? వాస్తవమునకు, వేదాంత తత్వము కృష్ణుడి అవతారమైన వ్యాసదేవుని చేత వ్రాయబడింది, కాబట్టి ఆయన vedānta-kṛt. ఆయన Vedānta-vit కూడా. అందువల్ల ప్రశ్న ఏమిటంటే వేదాంత అంటే అద్వైత - వాదమా లేదా ద్వైత - వాదమా. కాబట్టి ఇది చాలా సులభం అర్థం చేసుకోవడం. వేదాంత యొక్క మొట్టమొదటి సూత్రం: athāto brahma jijñāsā, బ్రహ్మణ్, పరమ వాస్తవము గురించి ప్రశ్నించడానికి. ఇప్పుడు, ఎక్కడ విచారిస్తారు? మీరు విచారణ చేయాలనుకుంటే, మీరు ఆ విషయం తెలిసిన వ్యక్తి దగ్గరకు వెళ్ళాలి. అందువలన, వెంటనే, వేదాంత సూత్ర ప్రారంభంలో, ద్వంద్వత్వం ఉంది, ఒక వ్యక్తి విచారణ చేయాలి, ఒక వ్యక్తి సమాధానం చెప్పాలి. Athāto brahma jijñāsā. కాబట్టి వేదాంత-సూత్రాలను, అద్వైత - వాదమని ఎలా చెప్తారు? ఇందులో ప్రారంభంలో నుండి ద్వైత - వాదము ఉంది. Athāto brahma jijñāsā. ఒకరు విచారించాలి బ్రహ్మణ్ అంటే ఏమిటి? మరియు ఒకరు సమాధానం ఇవ్వాలి, లేదా ఆధ్యాత్మిక గురువు, లేదా శిష్యుడు, ఇది ద్వంద్వం. అద్వైత - వాదం అని మీరు ఎలా చెప్పగలరు? కాబట్టి మనము ఈ విధముగా అధ్యయనం చేయాలి. ఇక్కడ చెప్పబడింది, tattva-darśibhiḥ. తత్వ- దర్శిభిః అంటే వేదాంత-విత్, అంటే వేదాంతం తెలిసినవాడు. Janmādy asya yataḥ ( SB 1.1.1) ఎవరికైతే పరమ వాస్తవము తెలుసునో అతడు, ప్రతిదీ ఎక్కడ నుండి ప్రారంభమవుతుంది . Janmādy asya yataḥ. అది శ్రీమద్-భాగవతం యొక్క ఆరంభం.