TE/Prabhupada 0516 - మీరు స్వేచ్చా జీవితమును పొందవచ్చు, ఇది కథ లేదా కల్పన కాదు

Revision as of 01:48, 27 September 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0516 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968


ప్రభుపాద: Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi (Bs. 5.29). భక్తులు: Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi (Bs. 5.29). ప్రభుపాద: మనము దేవాదిదేవుడిని, గోవిందుడిని పూజిస్తున్నాం. ఇది మన కర్తవ్యము. గోవిందుడిని పూజించడము వలన ఫలితము ఏమిటి? ప్రజలు చంద్ర లోకమునకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్లుగా. చాలా చిన్న ప్రయత్నం వారు చంద్ర లోకమునకు వెళ్ళినా కూడా, వారు ఏమీ ప్రయోజనము పొందరు, శాస్త్రవేత్తలు చంద్రుని లోకములో ఉష్ణోగ్రత 200 డిగ్రీలు, సున్నా పాయింట్ కంటే తక్కువగా ఉంటుంది అని అంటారు. కాబట్టి మనము ఆ లోకము యొక్క చల్లని వాతావరణమును తట్టుకోలేము, మనం చంద్రుని గ్రహానికి వెళ్లినా కూడా ఎలా ప్రయోజనమును పొందుతాము? చంద్రుని లోకము మనకు అతి సమీప లోకము. మిలియన్ల కొద్ది ఇతర లోకములు కూడా ఉన్నాయి, శాస్త్రవేత్తలు అత్యధిక దూరములో ఉన్న, చివరి లోకమునకు చేరుకోవడానికి, అది నలభై వేల సంవత్సరాలు తీసుకుంటుంది. వెళ్లి తిరిగి రావాటానికి నలభై వేల సంవత్సరాలు జీవించబోయేది ఎవరు?

ఈ ఆచరణాత్మక ఇబ్బందులు, అందువలన మనల్ని బద్ధజీవులు అని పిలుస్తారు. మన కార్యక్రమాలు షరతులకు లోబడినవి. స్వేచ్ఛ లేదు. కాని మీరు స్వేచ్చా జీవితమును పొందవచ్చు, అపరిమిత శక్తి ఉన్న జీవితం, అపరిమితమైన ఆనందం, అపరిమితమైన ఆహ్లాదము. అవకాశం ఉంది. ఇది కథ లేదా కల్పన కాదు. ఈ విశ్వంలో మనము చాలా గ్రహాలు చూస్తున్నాము. మనము చాలా ఎగిరే వాహనాలను కలిగి ఉన్నాము, కాని మనము అతి సమీపంలో ఉన్న దానిని కూడా చేరుకోలేము. మనము చాలా పరిమితంగా ఉన్నాము. కాని మనము గోవిందుడిని పూజించినట్లయితే, అది సాధ్యమే. మీరు ఎక్కడైనా వెళ్ళవచ్చు. మేము ఇతర గ్రహాలకి సులభమైన ప్రయాణము చిన్న పుస్తకములో ఈ ప్రకటనలు వ్రాశాము. ఇది సాధ్యమే. ఈ లోకములు అన్నిటిలో ఈ లోకము ఒక్కటే అని అనుకోకండి. చాలా, చాలా లక్షల మంచి ఇతర గ్రహాలు ఉన్నాయి. ఆనందం యొక్క ప్రామాణికత, ఆనందం యొక్క ప్రమాణాలు మనము ఇక్కడ అనుభవిస్తున్న దాని కంటే చాలా రెట్లు ఎక్కువ. కాబట్టి ఎలా ఇది సాధ్యమవుతుంది?

భగవద్గీత యొక్క ఏడవ అధ్యాయం నేను చదువుతాను, ఇది గోవిందునిచే స్వయముగా మాట్లాడబడినది. భగవద్గీత, ఏడవ అధ్యాయం. భగవంతుడు కృష్ణుడు చెప్తాడు,

mayy āsakta-manāḥ pārtha
yogaṁ yuñjan mad-āśrayaḥ
asaṁśayaṁ samagraṁ māṁ
yathā jñāsyasi tac chṛṇu
(BG 7.1)

ఇప్పుడు, ఇక్కడ యోగాం అనే పదము కూడా వివరించబడింది. ఏ విధమైన యోగా కృష్ణుడు సిఫార్సు చేస్తున్నాడు? Mayy āsakta-manāḥ. ఎల్లప్పుడూ మనస్సును కృష్ణుడి మీద లగ్నము చేయటము, ఈ యోగ పద్ధతి. ఈ కృష్ణ చైతన్యము యోగ పద్ధతి. ప్రస్తుత రోజున, వారు తమ మనస్సును కేంద్రీకరిస్తున్నారు, శూన్యము, నిరాకారము మీద,వారి సొంత ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాస్తవమైన పద్ధతి మనస్సును దేని మీదైనా కేంద్రీకరించడము. కాని ఆ దేని మీదైనా, మనము దానిని శూన్యము చేస్తే, ఆ విధముగా మన మనస్సును కేంద్రీకరించడము చాలా కష్టము. ఇది భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో కూడా వివరించబడింది: kleśo 'dhikataras teṣām avyaktāsakta-cetasām ( BG 12.5) నిరాకారము మరియు శూన్యమైన దాని మీద ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తున్న వారి, కష్టాలు ఎక్కువ, దేవాదిదేవుడు మీద ధ్యానం చేసేవారి కష్టాల కన్నా. ఇది వివరించబడింది. ఎందుకు? Avyaktā hi gatir duḥkhaṁ dehavadbhir avāpyate. మనము మన మనస్సును ఏదైనా నిరాకారము మీద మనస్సును కేంద్రికరించలేము. మీరు మీ స్నేహితుడి గురించి ఆలోచిస్తే, మీరు ఆలోచిస్తే మీ తండ్రి, తల్లి గురించి లేదా మీరు ఇష్టపడే ఎవరినైనా, మీరు అలాంటి వారి గురించి గంటలపాటు ఆలోచనలు కొనసాగించవచ్చు. కాని మీ మనసును కేంద్రీకరించడానికి మీకు ఏ లక్ష్యమూ లేకుంటే, అది చాలా కష్టము. కాని శూన్యము మరియు నిరాకారము అనే దాని మీద కేంద్రీకరించమని ప్రజలు భోదించబడ్డారు