TE/Prabhupada 0547 - నేను అనుకున్నాను నేను మొదట గొప్ప ధనవంతుడను అవుతాను. తరువాత నేను ప్రచారము చేస్తాను

Revision as of 03:01, 2 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0547 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- New York, April 17, 1969


ప్రభుపాద: అంతా సరిగ్గా ఉందా?

భక్తులు: జయ.

ప్రభుపాద: హరే కృష్ణ. (నవ్వుతు) Ārādhito yadi haris tapasā tataḥ kim (Nārada-pañcarātra). Govindam ādi-puruṣaను హరి అంటారు. హరి అంటే "మీ అన్ని దుఃఖాలను తీసివేయువాడు." అది హరి. హరా. హరా అంటే తీసివేయువాడు. Harate. ఉదాహరణకు దొంగ కూడా తీసుకు వెళ్ళిపోతాడు, కాని ఆయన విలువైన వస్తువులను తీసుకు వెళ్ళిపోతాడు, భౌతికము విచారణ, కొన్నిసార్లు కృష్ణుడు మీకు ప్రత్యేకమైన దయను చూపించడానికి మీ భౌతికముగా వీలువైన వాటిని తీసివేస్తాడు. Yasyāham anugṛhṇāmi hariṣye tad-dhanaṁ śanaiḥ ( SB 10.88.8) యుధిష్టర మహారాజు కృష్ణుడి నుండి విచారణ చేశాడు, "మనము చాలా పవిత్రమైన వారిగా భావించబడుతున్నాము. నా సోదరులు గొప్ప యోధులు, నా భార్య అచ్చము అదృష్టదేవత, అన్నింటికన్నా, మీరు మా వ్యక్తిగత స్నేహితులు. కాబట్టి ఎలా మేము ప్రతిదీ కోల్పోయాము ? (నవ్వుతూ) మేము మా రాజ్యాన్ని కోల్పోయాము, మేము మా భార్యను కోల్పోయాము, మేము మా గౌరవాన్ని కోల్పోయాము - ప్రతిదీ. " అందుకు జవాబిస్తూ, కృష్ణుడు ఇలా అన్నాడు, yasyāham anugṛhṇāmi hariṣye tad-dhanaṁ śanaiḥ: నా మొదటి కరుణ ఏమిటంటే నా భక్తుని యొక్క అన్ని ఐశ్వర్యాలను నేను తీసివేస్తాను. అందువల్ల ప్రజలు కృష్ణ చైతన్యానికి రావటానికి చాలా ఉత్సాహంగా ఉండరు. కాని ఆయన అది చేస్తారు. పాండవులు ప్రారంభంలో ఇబ్బందుల్లో పెట్టబడ్డారు, కాని తరువాత వారు అత్యంత ఉన్నతమైన వ్యక్తులుగా మారారు మొత్తం చరిత్ర అంతటా. అది కృష్ణుడి యొక్క అనుగ్రహము. ఆరంభంలో, ఆయన ఆయన అలా చేయొచ్చు ఎందుకంటే మనము అనుబంధాన్ని కలిగి ఉన్నాము మా భౌతిక సంపదలకు.

కాబట్టి అది నా వ్యక్తిగత అనుభవం. ప్రారంభంలో, నా గురు మహారాజు నన్ను ఆదేశించినప్పుడు, నేను దానిని ఏమని భావించాను అంటే నేను మొదట గొప్ప ధనవంతుడను అవ్వుతాను.తరువాత నేను ప్రచారము చేస్తాను. (నవ్వుతూ) నా వ్యాపార వర్గములో చాలా బాగా చేస్తూన్నాను. వ్యాపార వర్గములో నాకు చాలా మంచి పేరు ఉంది, నాతో వ్యాపార వ్యవహారాలను చేస్తున్నవారు, వారు చాలా సంతృప్తిగా ఉన్నారు. కాని కృష్ణుడు మాయ చేసాడు అంతా పతనము అయింది, ఆయన నన్ను సన్యాసము తీసుకొనేటట్లు చేశాడు. కాబట్టి అది హరి. నేను కేవలము ఏడు డాలర్లతో మాత్రమే మీ దేశానికి రావలసి వచ్చింది. కాబట్టి వారు విమర్శిస్తున్నారు, "స్వామీ ఇక్కడకు డబ్బు లేకుండా వచ్చారు. ఇప్పుడు ఆయన చాలా సంపన్నమైనవాడు." (నవ్వుతు) కాబట్టి వారు వెనుక వైపు, నలుపు వైపు చూస్తున్నారు, మీరు చూడoడి? కాని ఈ విషయము... వాస్తవానికి, నేను లాభసాటిగా, లాభదాయకంగా ఉన్నాను, లేదా నేను లాభము పొందాను. నేను నా ఇంటిని, నా పిల్లలను ప్రతిదీ వదిలివేసాను. నేను ఏడు డాలర్లతో ఒక పేదవానిగా ఇక్కడకు వచ్చాను. అది పెద్ద డబ్బు కాదు. కాని నేను ఇప్పుడు గొప్ప సంపదను, వందలకొద్దీ పిల్లలను కలిగి ఉన్నాను. (నవ్వు) నేను వారి అవసరాల గురించి ఆలోచించడములేదు. వారు నా గురించి ఆలోచిస్తున్నారు. అది కృష్ణుడి కరుణ. ప్రారంభంలో, ఇది చాలా చేదుగా కనిపిస్తుంది. నేను సన్యాసమును తీసుకున్నప్పుడు, నేను ఒంటరిగా నివసిస్తున్నప్పుడు, నాకు చాల కష్టముగా ఉండేది కొన్నిసార్లు, నేను ఆలోచిస్తున్నాను "నేను తప్పు చేసానా సన్యాసమును అంగీకరించడం ద్వారా?" నేను ఢిల్లీ నుండి బ్యాక్ టు గాడ్ హెడ్ (భగవద్దర్శన్) ప్రచురిస్తున్నప్పుడు, ఒకరోజు ఒక ఎద్దు నన్ను నెట్టినది, నేను కాలిబాటపై పడిపోయాను నాకు తీవ్రముగా గాయం అయినది. నేను ఒంటరిగా ఉన్నాను. నేను ఆలోచిస్తున్నాను, "ఇది ఏమిటి?" నేను చాలా కష్టాల రోజులను కలిగి ఉన్నాను, కాని అది అంతా మంచి కోసము ఉంది. కాబట్టి కష్టాల గురించి భయపడకండి. మీరు చూడoడి? ముందుకు వెళ్ళoడి. కృష్ణుడు మీకు రక్షణ కల్పిస్తాడు. ఇది భగవద్గీతలో కృష్ణుడి వాగ్దానం. Kaunteya pratijānīhi na me bhaktaḥ praṇaśyati: ( BG 9.31) Kaunteya, ప్రియమైన కుంతీ కుమారుడా, అర్జునా, మీరు మొత్తం ప్రపంచమంతా ప్రకటించ వచ్చు నా భక్తులు ఎన్నటికీ పతనమవ్వరు. మీరు దానిని ప్రకటించ వచ్చు. " ఎందుకు ఆయన అర్జునుడిని చెప్పమని అడిగాడు? ఎందుకు ఆయన తనకు తాను ప్రకటించలేదు? అర్థం ఉంది. ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తే, ఆయన కొన్నిసార్లు ఆయన వాగ్దానం నెరవేర్చని సందర్భాలు ఉన్నాయి. కాని ఒక భక్తుడు వాగ్దానం చేస్తే అది ఎన్నడూ విచ్ఛిన్నమవ్వదు. కృష్ణుడు రక్షణను ఇస్తాడు; అందువలన ఆయన తన భక్తుడికి చెప్పాడు "నీవు ప్రకటించు". విచ్ఛిన్నం అయ్యే ప్రశ్నే లేదు. కృష్ణుడు చాలా దయ కలిగిన వాడు ఎందుకంటే కొన్ని సార్లు తన వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేస్తాడు, కాని ఆయన భక్తుడు వాగ్దానం చేస్తే, తన భక్తుల వాగ్దానం విచ్ఛిన్నం చేసే అవకాశం లేకుండా ఆయన చాలా శ్రద్ధ తీసుకుంటాడు. అది కృష్ణుడి కరుణ