TE/Prabhupada 0908 - నేను సంతోషంగా ఉండటానికి ప్రయత్నించవచ్చు కృష్ణుడు మంజూరు చేయకపోతే సంతోషంగా ఉండలేను

Revision as of 12:51, 17 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0908 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730419 - Lecture SB 01.08.27 - Los Angeles


నేను సంతోషంగా మారడానికి ప్రయత్నించవచ్చు, కానీ కృష్ణుడు సమ్మతించకపోతే, నేను ఎప్పుడూ సంతోషంగా ఉండలేను సంబంధంలో ఏదైనా... ఉదాహరణకు ప్రహ్లాద మహారాజు లాగానే. ప్రహ్లాద మహారాజు నిలబడి ఉన్నాడు, ఆయన తండ్రి చంపబడ్డాడు. ఇది నైతికమా? మీ తండ్రి మీ సమక్షంలో చంపబడడాన్ని మీరు చూడాలనుకుంటున్నారా, మీరు నిలబడి ఉంటారా? మీరు వ్యతిరేకించరా. అది నైతికమా? ఎవరూ అంగీకరించరు. ఇది మంచి పని అని, లేదు కానీ వాస్తవానికి అలా జరిగింది, ఆ హిరణ్యకశిపుడు చంపబడ్డాడు... చిత్రం ఇక్కడ ఉంది, ప్రహ్లాద మహారాజు హంతకుడికి పూలమాల వేయడానికి ప్రయత్నిస్తున్నాడు-చంపినవానికి. (నవ్వు) నా ప్రియమైన ప్రభూ, మీరు చంపినారు, మీరు ఈ పూలమాలను తీసుకోండి. మీరు నా తండ్రిని చంపుతున్నారు. మీరు చాలా మంచి అబ్బాయి. "(నవ్వు) మీరు చూడండి. ఇది, ఇది ఆధ్యాత్మిక అవగాహన. ఎవ్వరూ అంగీకరించరు... మీ తండ్రిని మీరు రక్షించుకోలేకపోతే, కనీసము నిరసన వ్యక్తము చేయాలి మీరు ఇలా ఏడవాలి: "ఇక్కడ నా తండ్రి చంపబడుతున్నాడు, రండి రండి, రండి, దయచేసి సహాయము చేయండి లేదు. ఆయన పూలమాలతో తయారు అయినాడు. అతడు చంపబడినప్పుడు, అతడు నరసింహస్వామితో ఇలా చెప్పాడు: నా ప్రియమైన ప్రభూ, ఇప్పుడు నా తండ్రి చంపబడ్డాడు. కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. మీరు మీ కోపమును వదిలేయవచ్చు " ఎవరూ దుఃఖపడరు. ఆయన ఈ వాక్యాన్ని చెప్పాడు. Modeta sādhur api vṛścika-sarpa-hatyā ( SB 7.9.14) Modeta sādhur api. ఒక సాధువు, ఒక పవిత్రమైన వ్యక్తి, ఎవ్వరూ ఒకరిని చంపటానికి ఎన్నడూ అంగీకరించరు. ఎప్పుడూ. ఒక జంతువుని కూడా. ఒక సాధువు ఆమోదించరు. ఎందుకు జంతువు చంపబడాలి? అది సాధువు కర్తవ్యము. కానీ ప్రహ్లాద మహారాజు చెప్పినారు: modeta sādhur api. ఒక సాధువు కూడా ఆనందముగా ఉంటాడు. ఎప్పుడు? ఒక తేలు లేదా ఒక పాము చంపబడినప్పుడు. వారు కూడా జీవులే చనిపోతున్న మరో జీవిని చూసి ఒక సాధువు ఎప్పుడూ సంతృప్తి చెందడు, కానీ ప్రహ్లాద మహారాజు ఇలా అంటున్నాడు "ఒక పాము చంపబడినప్పుడు లేదా ఒక తేలును చంపినప్పుడు కూడా ఒక సాధువు సంతోషంగా ఉంటాడు. నా తండ్రి కేవలం పాము మరియు తేలు వంటి వాడు. అందువలన అతడు చంపబడ్డాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు." ప్రతి ఒక్కరూ... అటువంటి రాక్షసుడు ఎవరైతే కేవలము భక్తులుకు ఇబ్బంది కలుగ చేస్తాడో, అటువంటి రాక్షసుడు, చాలా ప్రమాదకరమైన రాక్షసుడు. కాబట్టి అటువంటి రాక్షసుడు చంపబడినప్పుడు, సాధువులు కూడా సంతృప్తి చెందుతారు. సాధువు వ్యక్తులు, ఎవరూ చంపబడాలని వారు కోరుకోరు. కాబట్టి కృష్ణుడు akiñcana-vitta. అకించన విత్త. అన్నింటినీ భౌతికంగా కోల్పోయిన ఒక వ్యక్తి, అతడికి కృష్ణుడు మాత్రమే ఓదార్పు.

కాబట్టి కృష్ణుడు చాలా దయ కలిగిన వాడు ఎవరైనా సంపదను కావాలనుకుంటే, అదే సమయంలో, ఒక భక్తుడు కావాలని కోరుకుంటే... ఇది చైతన్య-చరితామృతములో చెప్పబడింది: ఎవరో నన్ను కోరుకుంటున్నారు. అదే సమయంలో, ఆయన భౌతిక సంపదను కోరుకుంటున్నాడు. ఆయన ఒక అవివేకి. ఆయన ఒక అవివేకి. " అందువల్ల ప్రజలు చాలా భయపడతారు, కృష్ణ చైతన్యమునకు రావటానికి. ఓ, నా భౌతిక సంపద పోతుంది. ఎందుకంటే వారికి కావాలి, వద్దు, అవసరము లేదు. వారు గాఢముగా కోరుకుంటున్నారు... సాధారణంగా, వారు చర్చికి వెళతారు, భౌతిక శ్రేయస్సు కోసం ఆలయానికి వెళ్తారు. ప్రభు మాకు మా రోజు వారి ఆహారమును ఇవ్వండి. ఇది భౌతిక శ్రేయస్సు. లేదా "నాకు ఇది ఇవ్వండి, నాకు అది ఇవ్వండి." వారు భగవంతుడు దగ్గరకు వచ్చారు కాబట్టి వారు కూడా పవిత్రమైన వారిగా అంగీకరించబడతారు.

నాస్తికుల తరగతి, వారు సమీపించరు. వారు ఇలా అంటారు: "నేను భగవంతుణ్ణి ఎందుకు సమీపిస్తాను? నేను నా సంపదను సృష్టించుకుంటాను శాస్త్రము పురోగతి ద్వారా, నేను సంతోషంగా ఉంటాను. " వారు duṣkṛtinaḥ, అత్యంత పాపము చేసినవారు వారు, ఎవరైతే ఈ విధముగా చెప్తారో ఆ: "నా శ్రేయస్సు కోసం, నేను నా స్వంత శక్తి మీద, నా సొంత జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది." కానీ అలా భావించే వారు ఎవరైనా వారు duṣkṛtinaḥ. ఎవరైతే నా శ్రేయస్సు భగవంతుడు దయ మీద ఆధారపడి ఉంటుందనే, వారు పవిత్రమైన వారు. వారు పవిత్రమైన వారు. ఇది ఏమైనప్పటికీ, భగవంతుడు అనుమతి లేకుండా, ఏదీ సాధించబడదు. అది సత్యము. Tāvad tanur idaṁ tanūpekṣitānām (?). ఇది కూడా ప్రకటన యొక్క... మా దుఃఖకరమైన పరిస్థితి తగ్గించుకోవడానికి చాలా ప్రతికూల పద్ధతులను మనము కనుగొన్నాము, కానీ అది భగవంతునిచే మంజూరు అవకపోతే, ఈ ప్రతికూల ప్రతిపాదన విఫలమవుతుంది.

ఉదాహరణకు... మీరు మంచి ఔషధమును కనిపెడితే, మీరు చాలా అర్హత కలిగిన వైద్యుడు. పర్వాలేదు. కానీ ఒక మనిషి రోగిగా ఉన్నప్పుడు, వైద్యుడిని అడగండి: ఈ రోగి యొక్క జీవితానికి మీరు హామీ ఇవ్వగలరా? ఆయన ఎప్పుడూ చెప్పడు: "లేదు, నేను అలా ఇవ్వగలను. నేనది చెయ్యలేను. నేను నా ఉత్తమ ప్రయత్నము చేస్తాను. అంతే." అంటే, అనుమతి ఇవ్వడము అనేది భగవంతుని చేతిలో ఉంది. నేను కేవలం పరికరం మాత్రమే. మీరు జీవించాలని భగవంతుడు ఇష్టపడకపోతే, అప్పుడు నా మందులు, నా శాస్త్రీయ జ్ఞానం, వైద్య జ్ఞానం, విఫలమౌతాయి. " అంతిమ మంజూరు కృష్ణుడిదే. వారు, అవివేకులు, వారికి తెలియదు. వారు, వారు... కాబట్టి వారిని మూర్ఖులు, లేదా దుష్టులు అని పిలుస్తారు. మీరు ఏమి చేస్తున్నారో అది చాలా మంచిది, అంతిమంగా, ఇది భగవంతుడిచే అనుమతించ బడనట్లయితే, కృష్ణుడి ద్వారా, ఇది అంతా వైఫల్యం అవుతుంది. అది వారికి తెలియదు. అందువల్ల వారు మూర్ఖులు. ఒక భక్తుడికి తెలుసు: "నాకు ఉన్న తెలివితో, సంతోషంగా ఉండటానికి ప్రయత్నించవచ్చు, కృష్ణుడు మంజూరు చేయకపోతే, నేను ఎప్పటికీ సంతోషంగా ఉండను. " ఇది భక్తుడు మరియు అభక్తుల మధ్య వ్యత్యాసం