TE/Prabhupada 0860 - ఇది బ్రిటీష్ ప్రభుత్వం యొక్క విధానము భారతదేశము యొక్క అన్ని విధానములను నిషేధించటము
750521 - Conversation - Melbourne
ఇది బ్రిటీష్ ప్రభుత్వం యొక్క విధానము భారత దేశమునకు చెందిన వాటిని నిషేధించటము దర్శకుడు: వారు సొంత తెలివి కలిగి లేరని మీరు అనుకుంటున్నారా? ప్రభుపాద: వారికి మనస్సు ఉన్నది, కానీ అది గందరగోళంగా ఉంది. పిచ్చివాడిలాగే ఆయన తన తెలివి కలిగి ఉన్నాడు, కానీ ఆ తెలివి యొక్క విలువ ఏమిటి? మీరు ఒక పిచ్చివాడి యొక్క అభిప్రాయాన్ని తీసుకోరు. ఆయన తన తెలివి కలిగి ఉన్నాడు, కానీ ఆయన పిచ్చివాడు. Mūḍha. Māyayāpahṛta-jñāna ( BG 7.15) ఆయన జ్ఞానం తీసివేయబడింది. బుద్ధి, ఏమి అంటారు, అస్తవ్యస్తమైన పరిస్థితిలో, ఆయన అభిప్రాయమునకు విలువ లేదు. దర్శకుడు: బ్రాహ్మణుడు ప్రపంచాన్ని తమ సొంత కోరికలతో పరిపాలిస్తున్నట్లయితే? ప్రభుపాద: హు? భక్తుడు: ఆయన అడుగుతున్నాడు, బ్రాహ్మణుడు వారి స్వార్థ ప్రయోజనము కోసం ప్రపంచాన్ని పరిపాలిస్తున్నట్లయితే? ప్రభుపాద: లేదు, లేదు. దర్శకుడు: కానీ పెట్టుబడిదారుల లేదా వేరే ఎవరైనా అయి ఉండవచ్చు... ప్రభుపాద: లేదు, లేదు. ఇది స్వార్థ ప్రయోజనము కాదు. ఇది స్వార్థము కాదు, ఇది స్వభావం, ఉదాహరణకు సమా వలె. అది శాంతి. దర్శకుడు: వారు వారి సొంత వర్గాన్ని ఏర్పరచుకొని, వారి స్వంత స్వార్థ ప్రయోజనము కొరకు, ప్రపంచమును పాలించటానికి ప్రయత్నిస్తే... ప్రభుపాద: లేదు, లేదు. వారు నిజాయితీగా ఉన్నారు కాబట్టి,.... వారు అలా చేయరు. దర్శకుడు: వారు పుస్తకం ప్రకారం వెళ్ళి ఉండాలి. ప్రభుపాద: అవును. నిజాయితీగా అంటే అర్థం, ఆయన తన సొంత ఆసక్తి కోసం కాదు, అందరి ఆసక్తి కోసం. ఇది నిజాయితీ. దర్శకుడు: ఇప్పుడు, ఆయనను తప్పుదోవ పట్టిస్తే? ప్రభుపాద: హుహ్? దర్శకుడు: ప్రపంచం మార్పులు చెందుతుంది, ఆయితే ఆ పుస్తకం... ప్రభుపాద: వారు అనుసరించకపోవడము కారణంగా. ఉదాహరణకు భారతదేశంలో వలెనే, ఇది బ్రాహ్మణుల ప్రవర్తన. తరువాత, క్రమంగా, సంస్కృతి గత వెయ్యి సంవత్సరాల నుండి పోయింది, ఎందుకంటే భారతదేశం విదేశీయుల చేత లోబరుచుకోబడినది. మహమ్మదీయులు, వారు వారి సంస్కృతిలో కొన్నింటిని ప్రవేశ పెట్టినారు. తరువాత బ్రిటీషర్లు వచ్చారు. వారు ప్రవేశ... ప్రతిఒక్కరూ ఒక ఆసక్తిని కోరుకుంటారు. బ్రిటిష్ వారు బ్రిటీష్ పాలన వచ్చినప్పుడు, వారి లార్డ్ మాకౌలే యొక్క వ్యక్తిగత నివేదిక ఏమిటంటే మీరు వారిని భారతదేశపు హిందువుగా ఉంచాలని కోరుకుంటే, మీరు ఎన్నటికీ వారిని పాలించలేరు. అందువల్ల ఇది బ్రిటీష్ ప్రభుత్వం యొక్క విధానము భారతదేశము యొక్క అన్ని విధానములను నిషేధించటము. దర్శకుడు: కానీ మీరు ముందు చెప్పారు వారు మద్యపానం అనుమతించలేదని, బ్రిటిష్ వారు. ప్రభుపాద: హుహ్? దర్శకుడు: ఇది ఇప్పుడే మాత్రమే... మీరు ముందు చెప్పలేదా? ప్రభుపాద: అవును, బ్రిటిష్ వారు అనుమతించారు. బ్రిటీష్, చాలా జాగ్రత్తగా, వారు ప్రత్యక్షంగా చేయనందున, వారి సంస్కృతిని ప్రవేశపెట్టి నందువలన. కానీ అంతర్గతముగా. ఇప్పుడు వారు శిక్షణ పొంది ఉన్నందున, ఇప్పుడు వారు బహిరంగంగా చేస్తున్నారు. కానీ శిక్షణ బ్రిటిష్ వారు ఇచ్చినది నాగరిక మానవ సమాజంలో త్రాగటము ఉండాలి. ఇది వారు ప్రవేశ పెట్టినారు. దర్శకుడు: కానీ భారతీయ సమాజంలో, వారు భారతదేశంలో దీనిని నిషేధించారు. ప్రభుపాద: భారతీయ సమాజం, వారికి టీ ని కూడా తాగటము తెలియదు. మా బాల్యంలో మేము బ్రిటిష్ వారు టీ తోటను ప్రారంభించటము చూసాము. బ్రిటీషర్లకు ముందు టీ మొక్కలు లేవు. బ్రిటీష్ వారు కార్మికులు చాలా చవకగా ఉన్నారని, వారు వ్యాపారముము చేయాలని వారు కోరుకున్నారు. అందువలన వారు ప్రారంభించారు ఉదాహరణకు వారు ఆఫ్రికాలో చేస్తున్నట్లుగా, చాలా తోటలు, కాఫీ టీ. కాబట్టి వారు ప్రారంభించారు, టీ అమెరికాలో విక్రయించడానికి బదిలీ చేయబడింది. వారు వ్యాపారము కోసము ఉన్నారు. ... ఇప్పుడు, చాలా టీ, ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వం ఒక టీ వర్గముల కమిటీని ప్రారంభించింది. టీ తోట యజమానులు అందరు, వారు ప్రభుత్వమునకు చెల్లిస్తారు ప్రతి రహదారిలో, ప్రతి వీధిలో, వారి పని వారి వ్యాపారమును ప్రచారము చేసుకోవటము, టీ తయారు చేయడము, మంచి చక్కని, రుచికరమైన టీ, మీరు టీని త్రాగితే వారు ప్రచారం చేస్తున్నారు, అప్పుడు మీరు చాలా ఆకలిని అనుభూతి చెందరు, మీ మలేరియా వెళ్లిపోతుంది, ఇంకా ఎన్నో ఎన్నో ప్రజలు టీ త్రాగడాన్ని ప్రారంభించారు. "చక్కని కప్." నేను దానిని చూశాను. ఇప్పుడు వారికి రుచి ఉంది. ఇప్పుడు క్రమంగా, ఇప్పుడు ఒక స్వీపర్ కూడా, ఉదయాన్నే, టీ కప్పు కోసము టీ కొట్టు ముందు వేచి ఉంటున్నారు. కొంత మంది దగ్గుతూ ఉంటే మా చిన్నప్పుడు టీ తీసుకోబడింది, కొన్నిసార్లు వారు టీ ఉపయోగించేవారు. అది తరువాత వచ్చినది. కానీ అది ఇంతకు ముందు లేదు టీ తాగటము, వైన్ త్రాగడం, ధూమపానం, మాంసం తినడం - ఈ విషయాలు ఇంతకు ముందు తెలియవు. వేశ్య వృత్తి. వేశ్య వృత్తి ఉంది. అంటే ప్రతి ఒక్కరూ వేశ్య కాదు. చాలా కఠినముగా ఉండే వారు. కాబట్టి ఈ విషయాల పట్ల జాగ్రత్త తీసుకోవాలి - కనీసం ఒక ఉన్నతమైన తరగతి వారు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, ఇతరులు చూస్తారు. శిక్షణ కొనసాగుతూ ఉండాలి. ఉదాహరణకు మనము చేస్తున్నట్లుగానే మాతో కీర్తన చేయడానికి, మాతో నృత్యం చేయడానికి, ప్రసాదమును తీసుకోవడానికి మేము ప్రజలను ఆహ్వానిస్తున్నాము. క్రమంగా వారు మారుతున్నారు. అదే వర్గము, త్రాగడానికి బానిస అయిన వారు, వేశ్య కు బానిస అయిన వారు, మాంసం తినడమునకు బానిస అయిన వారు, ఆయన సాధువుగా మారుతున్నాడు. ఇది ఆచరణాత్మకమైనది. మీరు చూడగలరు, వారి పూర్వ చరిత్ర ఏమిటి వారు ఇప్పుడు ఎలా ఉన్నారు. దర్శకుడు: కానీ మనము మన వైద్యులు ప్రోటీన్ల కొరకు మనము మాంసం తినాలని చెప్పినప్పుడు మనము ఎలా ఏమి ఆలోచించుకోవాలి ప్రభుపాద: ఇది ఒక మూర్ఖత్వం. వారు చివరి పది సంవత్సరాల నుండి మాంసం తినడం లేదు. మీరు వారి ఆరోగ్యం తగ్గుతుందని మీరు భావిస్తున్నారా? బదులుగా, ప్రజలు "ప్రకాశవంతమైన ముఖాలు" అని అంటారు. బోస్టన్లో... ఒక పూజారి, నేను లాస్ ఏంజిల్స్ నుంచి హవాయికి వెళుతున్నాను. సాదా దుస్తులలో ఒక పెద్ద మనిషి, ఆయన ఒక పూజారి, ఆయన చెప్పాడు, స్వామి, మీ విద్యార్థులు ఎలా ప్రకాశవంతముగా కనిపిస్తున్నారు? కొన్నిసార్లు మనము "ప్రకాశవంతమైన ముఖాలు" గా ప్రచారం చేయబడుతున్నాము. బోస్టన్లో లేదా ఎక్కడో, స్త్రీలు అడుగుతున్నారు, "మీరు అమెరికన్నా అని?"