TE/Prabhupada 0719 - సన్యాసము తీసుకుంటున్నారు.దీనిని చాలా సంపూర్ణంగా పాటించండి
Excerpt from Sannyasa Initiation of Viraha Prakasa Swami -- Mayapur, February 5, 1976
శ్రీ చైతన్య మహాప్రభు నీవు సన్యాసాను తీసుకుంటున్న ఈ ప్రదేశంలో నివసించేవారు. అందువల్ల ఆయన సన్యాసమును తీసుకున్న ఉద్దేశ్యం ఏమిటి? ఆయన చాలా గౌరవప్రదమైన బ్రాహ్మణుడు, నిమాయి పండిట్. భూమి యొక్క ఈ చిన్న భూభాగం, నవద్వీపం, అత్యంత ప్రాచీన కాలము నుండి విద్యావంతులైన బ్రాహ్మణులు నివాసము ఉన్న ప్రదేశం. శ్రీ చైతన్య మహాప్రభు చాలా గౌరవప్రదమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు, జగన్నాథ మిశ్రా కుమారుడు; ఆయన తాత, నీలాంబర చక్రవర్తి. చాలా గౌరవప్రదమైన, గౌరవప్రదమైన వ్యక్తులు. ఆయన ఆ కుటుంబంలో జన్మించాడు. వ్యక్తిగతంగా ఆయన చాలా అందంగా ఉండేవాడు; అందువలన ఆయన మరొక నామము గౌరసుందర. అతడు చాలా జ్ఞానము కలిగినవాడు కూడా. అందువలన ఆయన మరొక నామము నిమాయి పండిట్. ఈ విధముగా, మరియు ఆయన కుటుంబ జీవితములో ఆయన చాలా చక్కని, అందమైన యవ్వనములో ఉన్న భార్యను కలిగి ఉన్నారు విష్ణుప్రియ, మరియు చాలా ప్రేమ కలిగిన తల్లి, ఆయన చాలా ప్రభావవంతమైనవారు. అది నీకు తెలుసు. ఒక రోజులోనే ఆయన ఖాజీ యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయటానికి లక్ష మంది అనుచరులను సేకరించాడు. ఈ విధముగా ఆయన సామాజిక పరిస్థితి చాలా అనుకూలమైనది. వ్యక్తిగత పరిస్థితి చాలా అనుకూలమైనది. అయినప్పటికీ, ఆయన సన్యాసను తీసుకున్నారు , ఇంటిని వదిలి వెళ్ళాడు. ఎందుకు? దయితయే: ప్రపంచంలోని పతితులైన ఆత్మలపై దయ చూపించడానికి, అనుగ్రహించడానికి.
కాబట్టి ఆయన వారసత్వముగా ఇచ్చినారు భారతదేశంలో జన్మించిన ఎవరైనా,
- bhārata-bhūmite manuṣya-janma haila yāra
- janma sārthaka kari' kara para-upakāra
- (CC Adi 9.41)
అందువలన ఆయన వ్యక్తిగతంగా పరోపకారం ఎలా చేయాలో చూపెట్టారు. ఇతరుల సంక్షేమం కొరకు, పతితులైన ఆత్మలకు. కాబట్టి ఈ సన్యాస అంటే శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశాన్ని అనుసరించడం, అది
- āmāra ājñāya guru hañā tara' ei deśa
- yāre dekha tāre kaha 'kṛṣṇa'-upadeśa
- (CC Madhya 7.128)
కాబట్టి మనము ఒక స్థానాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్నాము... భారతీయులకు మాత్రమే ఈ బాధ్యత ఉంది అని కాదు, కానీ శ్రీ చైతన్య మహాప్రభు ప్రకారం, ఎవరైనా- pṛthivīte āche yata nagarādi grāma (CB Antya-khaṇḍa 4.126) - వారు ఈ ధర్మప్రచారపు పనిని చేపట్టాలి. నేను మీకు చాలా ఋణపడి ఉన్నాను, మీరు అమెరికన్ అబ్బాయిలు మరియు అమ్మాయిలు కూడా, మీరు ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును చాలా తీవ్రంగా తీసుకున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కృపతో మీరు సన్యాసమును తీసుకుంటున్నారు, మీలో కొందరు ఉన్నారు. దీనిని చాలా సంపూర్ణంగా పాటిస్తూ, పట్టణం నుండి పట్టణానికి వెళ్లండి, నగర నగరానికి, గ్రామ గ్రామానికి, ప్రపంచవ్యాప్తంగా ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును వ్యాప్తి చేయండి కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. ప్రజలు చాలా బాధపడుతున్నారు. వారు, ఎందుకంటే వారు మూర్ఖులు, దుష్టులు, వారికి మానవ రూపంలో జీవన పరిస్థితిని ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియదు. ఇది భాగవతము-ధర్మము ప్రతీచోటా. కాబట్టి మానవ రూపం కుక్కగా పందిగా, పెంపుడు పందిగా మారడానికి కాదు మీరు పరిపూర్ణ మానవుడిగా మారాలి. Śuddhyet sattva. మీ జీవితమును పవిత్రము చేసుకోండి. ఎందుకు మీరు జన్మ, మరణము, వృద్ధాప్యము వ్యాధులకు గురి అవుతున్నారు? ఎందుకంటే మనం అపవిత్రము కనుక . మన జీవితముని పవిత్రము చేసుకుంటే అప్పుడు జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధి వంటివి ఉండవు. ఇది శ్రీ చైతన్య మహాప్రభు మరియు కృష్ణుడి కథనము. కేవలం కృష్ణుడిని అర్థం చేసుకోవడం ద్వారా మీరు పవిత్రమవుతారు మీరు జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధి యొక్క కలుషితాన్ని తప్పించుకుంటారు.
కాబట్టి సాధారణ ప్రజలను, తత్వవేత్తలను, మతమును పాటించే వారిని ఒప్పించేందుకు ప్రయత్నించండి. మనకు అటువంటి విషయం లేదు, వర్గపు అభిప్రాయం లేదు. ఎవరైనా ఈ ఉద్యమంలో చేరవచ్చు స్వయంగా పవిత్రమవ్వ వచ్చు. Janma sārthaka kari' kara para-upakāra ( CC Adi 9.41) అందువలన నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు సమాజానికి ఇప్పటికే సేవ చేశారు. ఇప్పుడు మీరు సన్యాసమును తీసుకొని ప్రపంచమంతటా ప్రచారం చేయండి, తద్వారా ప్రజలు ప్రయోజనమును పొందవచ్చు. చాలా ధన్యవాదాలు. భక్తులు: జయ శ్రీల ప్రభుపాద