TE/Prabhupada 0046 - మీరు జంతువు కావద్దు, ఎదుర్కొనండి

Revision as of 09:01, 16 April 2015 by YamunaVani (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0046 - in all Languages Category:TE-Quotes - 1974 Category:TE-Quotes - Mo...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Morning Walk -- May 28, 1974, Rome

యోగేశ్వర్: భగవాన్ తను వెళ్ళేప్పుడు నాకు కొన్ని ప్రశ్నల జాబితాను ఇచ్చివేల్లాడు. వాటిలోని కొన్ని ప్రశ్నలను మిమ్మల్ని అడగవచ్చునా ? ప్రభుపాద: అడగండి !! యోగేశ్వర: మొదటిది, ఈనాడు మనం తరచూ ఎదుర్కొంటున్న సమస్య "ఉగ్రవాదం లేదా తీవ్రవాద" సమస్య !! అనగా!!, కొంతమంది వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రేరేపించబడుతున్నారు. ప్రభుపాద: అవును!!, దీని మూల సూత్రం నేను మీకు ముందుగానే తెలియజేసాను. ఎందుకనగా వాళ్ళు జంతువులతో సమానం!! అంతేకాదు వారు కొన్ని సందర్భాలలో క్రూరమైన మృగాలుగా కూడా ప్రవర్తిస్తారు!! జంతువులలో కూడా చాలా రకాలు కలవు !! ఉదా: పులి మరియు సింహం లాంటివి క్రూరమైన జంతువులు !! కానీ , మనం జంతు సమాజంలో నివసిస్తున్నాము!! జంతు సమాజం కనుకనే కొన్ని క్రూరమైన జంతువులూ నివసిస్తాయి!! దాంట్లో ఆశ్చర్యపడవలసింది ఏమిలేదు !! ఎంతైనా మనం జంతు సమాజంలో నివసిస్తున్నాము కదా!! కనుక, నువ్వు మనిషిగా ప్రవర్తించు. అదియే చాలా ఉత్తమం !! ఈ ఉత్తమ జీవనమే ఈ సమస్యకి పరిష్కారం!! మనం ఉంటున్నదే జంతు సమాజం, కావున ఎప్పుడైనా ఒక కౄరమృగం ఎదురుపడితే, దాంట్లో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు కదా ?? ఎంతైనా ఇది జంతు సమాజం !! పులైనా లేదా ఎనుగైనా అది జంతువే కదా !! కాని నీవు జంతువులా ప్రవర్తించకు. వాటిని తగిన విధంగా సమర్థంగా ఎదుర్కోను!! ఇదే మనకి కావాల్సింది !! మనిషి ఒక విచక్షణా జ్ఞానం కలిగిన ప్రాణి. విచక్షణా జ్ఞానం!! ఇది చాల ముఖ్యం!! నీవు ఎప్పుడైతే ఆ విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతావో నీవు కూడా ఒక జంతువుతో సమానం !! నీవు ఒక మనిషిగా మారడమే ముఖ్యం. కాని, దుర్లభం మానుష జన్మ తదపి అధ్రువామార్థదం. ఆ పైన చెప్పిన వ్యక్తులకి ఒక లక్ష్యం అంటూ ఏమి ఉండదు. మనిషి జీవిత లక్ష్యం ఏమిటో వారికి తెలియదు. కనుక వారి పశు స్వభావాన్నిఎదో ఒక విధంగా సంతుష్ట పరచుకుంటున్నారు. ఉదా: వారు నగ్న నృత్య ప్రదర్శనకి వెళ్ళడం. రోజు వారి భార్యలని నగ్నంగా చూసినప్పటికీ , డబ్బులు చెల్లించి మరీ ఆ నృత్యాన్ని చూడడానికి వెళ్తారు , ఇదియే పశుప్రవృత్తి. ఎందుకంటే వారికి వారి వాంఛలను తీర్చుకోవడం తప్ప వేరే ఏ ఇతర వ్యాపకం లేదు. ఇది నిజమా కాదా ? మరి ఈ నగ్న నృత్యాలని చూడటం వల్ల సాధించేదేమిటి? మీరు మీ భార్యలని ప్రతీ రోజు , ప్రతీ రాత్రి నగ్నంగా చూస్తూనే ఉన్నారు. ఎందుకలా!!..., ఎందుకంటే మీకు వేరే ఏ ఇతర వ్యాపకం లేకపోవడమే. జంతువులూ , పునః పున్స్చర్విత చర్వణానాం ( శ్రీ.భా 7.5.30 ) . కుక్కకి రుచికి సంబంధించిన జ్ఞానం లేదు. అది ఎప్పుడూ ఎదో ఒక ఎముక ముక్కని నములుతూనే ఉంటుంది ఎందుకంటే అది ఒక జంతువు. దాని వేరే ఏ పని లేదు కావున ఈ సమాజం ఒక జంతు సమాజం. ముఖ్యంగా పాశ్చ్యాత్యులు. మరియు వారు వారి పశు ప్రవృత్తిని ఆధారంగా చేసుకొని ఈ నాగరికతను అభివృద్ధి పరిచారు. అదేమిటంటే!! " నేను ఈ దేహాన్ని , మరియు నా ఇంద్రియ వాంఛలను తృప్తి పరచుట కొరకుమాత్రమె నా ఈ జీవితమును వాడుకుంటాను ". "నేను ఈ దేహాన్ని" ఇదియే పశు ప్రవృత్తి. దేహం అనగా ఇంద్రియాలు " మరియు ఇంద్రియాలను తృప్తి పరచుటయే జీవిత పరమావధి " ఇదీ !! వారి నాగరికత. కావున మీరు మనుష్య నాగరికతను అభివృద్ధి పరచాలి మీరు ఆశ్చర్యపోనవసరం లేదు , జంతువు అనేది వివిధ రకాల ఆకృతిలో ఉంటుంది. మరియు వివిధ రకములైన సామర్తాలని కలిగి ఉంటుంది ఐనా!! అది ఒక జంతువే కదా !! పశుత్వం దాని మూల సూత్రం !! ఎందుకంటే !! ఆతను " నేను ఈ దేహాన్ని" అని అనుకుంటున్నాడు ఎలాగైతే కుక్క తనను "నేను ధృడమైన, బలమైన దాన్ని " అని అనుకుంటుందో అలాగే మనిషి కూడా "నేను ఒక పెద్ద దేశాన్ని" అని అనుకుంటున్నాడు మరి అసలు మూల సూత్రం ఏమిటి ? ఎందుకంటే కుక్క కూడా తను ఒక దేహాన్ని అనే ఆలోచిస్తుంది అలాగే మనిషి కూడా నేను ఈ దేహాన్ని అనే ఆలోచిస్తున్నాడు అందువల్ల కుక్కకి మరియు మనిషికి ఏమీ తేడా లేదు కేవలం ప్రక్రుతి వరం వల్ల మనిషి ఉత్తమమైన ఇద్రియాలని కలిగిఉన్నాడు , ఇదే వారిరువురి మధ్య తేడా మరియు మనిషికి తన ఇంద్రియాలని దేనికొరకు వినియోగించాలో అనే విద్య గాని శక్తి గాని లేదు ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నతిని సాధించాలి మరియు ఎలా ఈ సంసార సాగరం (మాయా ప్రపంచం) నుండి విముక్తిని పొందాలి అనే విషయ పరిజ్ఞానం మనిషికి లేదు అతను తన తెలివితేటలను, సామర్థ్యాలను కేవలం పశువు లాగా ఇంద్రియ సౌఖ్యాల కొరకు వినియోగిస్తున్నాడు ఈది అసలు విషయం. అతనికి తన తెలివితేటలను ఎలా సద్వినియోగ పరచుకోవలో తగిన జ్ఞానం కరువైంది కనుకనే వాటిని కేవలం ఒక పశుప్రవృత్తి కోసం మాత్రమె వినియోగిస్తున్నాడు అందువల్లనే పాశ్చ్యాత్తులను బాగా అభివృద్ధి చెందిన వారిలాగా ఈ ప్రపంచం భావిస్తోంది అభివృద్ది ?? దేనిలో ??? పశుప్రవ్రుత్తిలో కాని ప్రాథమిక సూత్రం పశుప్రవ్రుత్తి మాత్రమె అని చెప్తే వీరు ఆశ్చర్యపోతారు వారు మిమ్మల్నిఅనుకరిస్తారు. కనుకనే వారు ఈ పశుప్రవృత్తిని మరియు పశునాగారికతను విస్తరింపజేస్తున్నారు మానవ నాగరికత అభివృద్ధి కొరకు మనమిప్పుడు వారిని సమర్థవంతంగా ఎదుర్కొనాలి