TE/Prabhupada 0029 - బుద్ధుడు రాక్షసులను మోసగించాడు
Sri Isopanisad, Mantra 1 -- Los Angeles, May 3, 1970
బుద్ధుడు దెయ్యాల్ని మోసం చేసాడు. ఎందుకు ఆయన మోసం చేసాడు? సదయ-హ్రదయ దర్శిత-పశు-ఘటం. ఆయన చాలా కారుణ్యము కలిగిన వాడు. భగవంతుడు అన్ని జీవాల పై ఎల్లప్పుడూ జాలి కలిగి ఉంటాడు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆయన కొడుకులే. కానీ ఈ జులాయిలు ఎటువంటి నియంత్రణ లేకుండా చంపుతున్నారు, కేవలం జంతు హత్యలు చేస్తున్నారు. మరియు మీరు అడిగితే ఎందుకు చంపుతున్నారు అని ? వారు వెంటనే తిరిగి చెప్తారు, ఓహ్ ఇది వేదములలో చెప్పబడింది అని .పసవో వదయ స్రష్ట . జంతు హత్య వేదములలో చెప్పబడింది, కానీ దాని ఉద్దేశం ఏంటి? అది వేద మంత్రములకు పరీక్ష. ఒక జంతువుని అగ్ని లో కి పంపించి, వేద మంత్రములతో దానిని మరలా జీవం పోస్తారు. అది త్యాగం, జంతు త్యాగం, తినడానికి ఉద్దేశించి కాదు. కావున ఈ కలి యుగములో అన్ని రకములు అయిన యజ్ఞాలను చైతన్య మహాప్రభు నిషేదించారు. ఎందుకంటే, నేను చెప్పేది ఏమిటంటే మంత్రములను జపించే నిపుణుడు అయిన బ్రాహ్మణుడు ఎవ్వరు లేరు. మరియు వేద మంత్రములతో ఈ విధముగా ప్రాణం తిరిగి పోయడానికి ప్రయోగం చేయగల బ్రాహ్మణుడు ఎవ్వరు లేరు. అది ఏంటంటే, యజ్ఞము చేసే ముందు మంత్రము యొక్క శక్తి ని తెలుసుకోవడానికి, జంతువును చంపి మళ్లీ తిరిగి కొత్త జన్మను ఇవ్వడం చెయ్యడానికి. ఆ మంత్రములను జపించే వారు పూజారులు అని అర్థం చేసుకోవాలి, అది సరైన పద్ధతి. అది ఒక పరీక్ష. జంతు సంహరణ కోసం కాదు. కానీ ఈ వెధవలు, జంతువులను తినడానికి వేదములను చూపించి, " ఇక్కడ వుంది జంతు సంహరణ" కలకత్తా లో మాదిరిగా..కలకత్తా కి మీరు వెళ్ళరా? అక్కడ కాలేజీ వీధి అనే పేరుతో ఒక వీధి వుంది..ఇప్పుడు అది వేరే పేరుతో వుంది. విధాన రాయ..ఆ విధమైన పేరు ఏదో వుంది.. ఏమైనప్పటికీ, అక్కడ కొన్ని కబేళాలు వున్నాయి. కబేళాలు అనగా హిందువులు, ముస్లిముల అంగడి నుంచి మాంసం కొనరు. అది అపరిశుభ్రమైనది. ఇరువైపులా ఒక్కటే : అటువైపున అదే మలినము మరియు ఇటువైపున కూడా. వారు మాంసాన్ని తింటున్నారు మరియు హిందువుల అంగడి స్వచ్ఛమైనది మరియు ముస్లిములది అపరిశుభ్రమైనది. ఇవ్వన్ని పిచ్చి కల్పితాలు. మతము ఆ విధముగా ప్రయాణిస్తోంది. అందువలన గొడవలు.. నేను హిందువును, నేను ముస్లిమును, నేను క్రైస్తవుడును అని. మీరు చుడండి. ఎవ్వరికి మతము గురుంచి తెలియదు.. ఈ వెధవలు మతాన్ని మరిచిపోయి వదిలేసారు. అటువంటి మతము లేదు. అసలైన మతము దేవుడిని ఎలా ప్రేమించాలో నేర్పించే కృష్ణుడి చైతన్యము. అంతే. అదే మతము. హిందూ మతమైన, ఇస్లాం అయిన, క్రైస్తవం అయిన, ఏది అయిన అది సంభందం లేదు, మీరు భగవంతుడి పై ప్రేమను పెంచితే, అప్పుడు మీరు మీ మతములో సక్రమమైన మార్గములో ఉన్నారు.