TE/Prabhupada 0039 - ఆధునిక నాయకుడు కేవలం తోలుబొమ్మలాంటివాడు

Revision as of 10:13, 17 April 2015 by YamunaVani (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0039 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on SB 1.10.3-4 -- Tehran, March 13, 1975


కావున యుధిస్థిర వంటి ఆదర్శ రాజు, ఈ భూమినే కాకుండా, సముద్రాలను,ఈ గ్రహం అంతటిని పాలించగలడు. అది ఆదర్శం. చదువుతూ: ఆధునిక ఆంగ్ల చట్టము అయిన మొదట పుట్టిన వారికీ వారసత్వం మహారాజ యుధిస్థిర భూమిని మరియు సముద్రాలను పాలిస్తున్న ఆ రోజుల్లో కూడా ప్రబలముగా ఉండేది అంటే మొత్తం గ్రహం, సముద్రాలతో కలుపుకొని. చదువుతూ: ఆ రోజుల్లో హస్తినపురము రాజు, ఇప్పుడు న్యూఢిల్లీ లో భాగము, ఈ ప్రపంచానికి చక్రవర్తి, సముద్రాలను కలుపుకొని. మహారాజ పరిక్షిత్ కాలము వరకు, మహారాజ యుధిస్థర ,మనవడు. అతని చిన్న తమ్ముళ్ళు అతనికి మంత్రిగా మరియు సైనిక దళపతులుగా వ్యవహరించేవారు. మరియు రాజు యొక్క అన్నదమ్ముల మధ్య సంపూర్ణమైన సహకారం ఉండేది. మహారాజ యుధిస్థర ఆదర్శవంతమైన రాజు లేదా శ్రీకృష్ణుడి ప్రతినిధి.. రాజు కృష్ణుని యొక్క ప్రతినిధి అయ్యి ఉండాలి. ఈ భూమిని పాలించడానికి మరియు ఇంద్ర రాజుతో పోల్చడానికి, స్వర్గ గ్రహము యొక్క అధికారిక పరిపాలకుడు. దైవాంశ సంభూతులు అయిన ఇంద్ర, చంద్ర, సూర్య, వరుణ,వాయు, మొదలగు వారు విశ్వములో వివిధ గ్రహముల యొక్క ప్రతినిధి రాజులు. అదేవిధముగా మహారాజ యుధిస్థర కూడా వాళ్ళలో ఒకరు, ఈ భూమండలాన్ని పరిపాలించేవాడు. మహారాజ యుధిస్తర ఆధునిక ప్రజాస్వామ్యం యొక్క జ్ఞానం లేని రాజకీయ నాయకుని వంటి వాడు కాదు. భీష్మదేవా మరియు నిర్దుష్టమయిన భగవంతుడిచే ఆదేశాలు పొందినవాడు. అందువలన అతనికి ప్రతి దాని పైన కచ్చితమైన జ్ఞానము ఉండేది ఆధునికంగా ఎన్నుకోపడ్డ దేశ నాయకుడు ఒక కీలు బొమ్మ వంటి వాడు ఎందుకంటే అతనికి ఎటువంటి రాజు శక్తి లేదు. అతను మహారాజ యుధిస్థిర లాగా జ్ఞానం ఉన్నవాడు అయినా, అతని తన మంచి ఉద్దేశముతో ఏమైనా చేద్దాం అనుకున్న అతని రాజ్యాంగ స్థితి వల్ల చెయ్యలేడు. అందుకే, ఈ భూమి పైన చాలా రాజ్యాలు గొడవలు పడుతున్నాయి. ఎందుకంటే సైద్ధాంతిక తేడాలు లేదా వేరే స్వార్ధమైన ఆలోచనల వల్ల. కానీ మహారాజ యుధిస్థిర వంటి రాజుకు తన యొక్క సొంత సిద్ధాంతం ఏమి లేదు. అతను తప్పు చెయ్యని భగవంతుడి ఆదేశాలను పాటించాలి మరియు భగవంతుడి ప్రతినిధి, మరియు అధికార ప్రతినిధి, భీష్మదేవా. గొప్ప అధికారిని అనుసరించాలని శాస్త్రములలో సూచించ పడింది. మరియు నిర్దుష్టమయిన భగవంతుడిని ఎటువంటి వ్యక్తిగత మరియు తయారు చేసిన సిద్దంతాలు లేకుండా అనుసరించాలి. అందువలన మహారాజ యుధిస్థిర ఈ మొత్తం ప్రపంచాన్ని,సముద్రములతో కూడా పాలించగలిగాడు. ఎందుకంటే అతను పాటించిన సూత్రములు తప్పు లేనివి మరియు ప్రపంచ వ్యాప్తంగా అందరికి వర్తిస్తాయి. ప్రపంచం అంతా ఒకే దేశం అనే భావన నేరవేరాలి అంటే మనము నిర్దుష్టమైన అధికారాన్ని అనుసరించాలి. ఒక అసంపూర్ణమైన మనిషి అందరు అంగీకరించే సిద్దాంతాన్ని సృష్టించలేడు. కేవలం సంపూర్ణమైన మరియు నిర్దుష్టమైన అతనే ఒక కార్యక్రమాన్ని సృష్టించగలడు. ఏదైతే అందరికి అన్ని ప్రదేశాలలో వర్తిస్తుందో మరియు ప్రపంచం లో అందరు అనుసరించే విధంగా.. అటువంటి మనిషే పాలించగలడు, వ్యక్తిగత ప్రభుత్వం కాదు. మనిషి పరిపూర్ణుడు అయితే , ప్రభుత్వం కూడా పరిపూర్ణంగా ఉంటుంది. మనిషి మూర్కుడు అయితే, ప్రభుత్వం పిచ్చివాళ్ళ స్వర్గం. అది ప్రకృతి ధర్మం. లోపము కలిగిన రాజులు లేదా కార్యనిర్వాహకులు గురించి చాలా కధలు ఉన్నాయి. అందువలన, కార్యనిర్వాహకులు మహారాజ యుధిస్థిర వలె బాగా శిక్షణ పొంది ఉండాలి, మరియు అతనికి ప్రపంచం అంతా నిరంకుశంగా పాలించడానికి సంపూర్ణ అధికారం ఉండాలి. ప్రపంచం మొత్తం ఒకే రాజ్యం అనే భావన కేవలం మహారాజ యుధిస్థిర వంటి రాజు రాజ్యంలో మాత్రమే రూపు చెందగలదు. ఆ రోజుల్లో ప్రపంచం అంతా సంతోషంగా ఉండేది ఎందుకంటే మహారాజ యుధిస్థిర వంటి రాజులూ ప్రపంచమును పాలించేవారు. ఈ రాజులూ మహారాజ యుధిస్థిర అనుసరించి ఉదాహరణ చూపించండి సంపూర్ణమైన లోపము లేని రాజ్యము రాచరికము ద్వార ఎలా వస్తుందో అని శాస్త్రములో ఒక సూత్రము ఉంది, మరియు అతను దాన్ని అనుసరిస్తే , అతను అది చెయ్యగలడు. అతనికి శక్తి ఉంది. అప్పుడు సంపూర్ణమైన లోపములేని రాజు, అప్పుడు కృష్ణుడి యొక్క ప్రతినిధి. అందువలన, కామం వావర్స పర్జన్యః (SB 1.10.4) పర్జన్యః అనగా వర్షపాతం. కావున వర్షపాతం అనేది జీవితము యొక్క ప్రాధమిక అవసరాలు కోసము ప్రాధమిక అవసరం. అందువలన కృష్ణుడి భగవద్గీతలో చెప్తాడు, అన్నాద్ భవన్తి భూతాని పర్జన్యాద్ అన్న-సంభవః (భగ 3.14) మీరు ప్రజలను సంతోష పరచాలి అంటే , మనిషి మరియు జంతువు రెండూ.. జంతువులు కూడా ఉన్నాయి. అవి.. ఈ వెధవ రాజ్య కార్యనిర్వాహకులు, కొన్నిసార్లు ప్రజలు అవసరం కోసం కొన్ని ప్రదర్శనులు చేస్తారు కానీ జంతువులుకు ఎటువంటి లాభం ఉండదు. ఎందుకు? ఎందుకు ఈ అన్యాయము? అవి కూడా ఈ భూమి పైనే పుట్టాయి. అవి కూడా జీవం ఉన్న ప్రాణులే. అవి జంతువులూ అయి ఉండవచ్చు. వాటికీ తెలివి లేదు. వాటికీ తెలివి ఉంది, మనిషికి ఉన్నంతగా కాదు, కానీ దాని అర్థం వాటిని చంపడం కోసం నిత్య కృత్యమైన కబేళాలు నిర్మించాలి అని కాదు? అది న్యాయమా? మరియు అది ఒక్కటే కాదు, ఎవరైనా రాజ్యములో రాజు దగ్గరికి వస్తే రాజు వాళ్ళకి ఆశ్రయము ఇవ్వాలి. ఎందుకు తేడా? ఎవరైనా ఆశ్రయం కొరకు, "అయ్యా, నేను మీ రాజ్యములో ఉండాలి," అని అడిగితే, అప్పుడు అతనికి అన్ని సౌకర్యములును ఇవ్వాలి. ఎందుకు ఇది," లేదు ,లేదు, నువ్వు రాకూడదు, నువ్వు అమెరికా దేశస్థుడివి, నువ్వు భారతియుడివి, నువ్వు అది అని ? లేదు. నిజంగా ఒకవేళ సూత్రములు పాటిస్తే, అవి చాలా ఉన్నాయి, వేదముల సూత్రములు, అప్పుడు ఆదర్శవంతమైన రాజు మంచి నాయకుడు అవుతాడు. మరియు ప్రకృతి సహకరిస్తుంది. అందువలన ఇలా చెప్పబడింది ఏంటంటే, మహారాజ యుధిస్థిర పరిపాలన అప్పుడు, కామం వావర్స పర్జన్యః సర్వ-కామా-దుఘ మహి (SB 1. 10. 4) మహి, ఈ భూమి, మీరు మీ అవసరములు అన్ని ఈ భూమి నుండి పొందవచ్చు. అది ఆకాశము నుండి కిందకి పడదు. అవును, అది ఆకాశము నుండి వర్షపు రూపములో కిందకి పడుతుంది. కానీ వారికీ శాస్త్రము తెలియదు భూమి నుండి అన్ని వివిధ ఏర్పాటులు ద్వారా ఎలా వస్తున్నాయో అని ? కొన్ని కచ్చిత సందర్బములలో వర్షాలు కురుస్తాయి మరియు జ్యోతిష్య ప్రభావం. అప్పుడు అనేక వస్తువులు ఉత్పత్తి చెందుతాయి, అమూల్యమైన రాళ్ళూ, ముత్యాలు. వాళ్ళకి తెలియదు ఇవి ఎలా వస్తున్నాయో అని. అందువలన, రాజు ధర్మవంతుడు అయితే, అతనికి సాయం కోసం ప్రకృతి కూడా సహకరిస్తుంది. మరియు రాజు, ప్రభుత్వం అధర్మము అయితే, అప్పుడు ప్రకృతి కూడా సహకరించదు.