TE/Prabhupada 0038 - జ్ఞానం వేదాల నుండి ఉద్భవించినది
Lecture on BG 7.1 -- Hong Kong, January 25, 1975
ఇప్పుడు, కృష్ణుడు ఉన్నాడు. మన దగ్గర కృష్ణుడి చిత్రము, కృష్ణుడి ఆలయం, ఎంతో మంది కృష్ణులు. వారు కల్పితము కాదు. వారు ఊహజితం కాదు. మాయావాది తత్వవేత్తలు అనుకుంటున్నట్లు, ఏంటంటే "మీ మెదడులోనే మీరు ఊహించుకోవచ్చు." లేదు. భగవంతుడిని ఊహించుకోలేము. అది మరొక మూర్ఖత్వం. భగవంతుడిని ఎలా ఊహించుకోవచ్చు? అప్పుడు భగవంతుడు మీ ఊహకు విషయం అవుతాడు. ఆయన ఎటువంటి పదార్ధం కాదు. అది భగవంతుడి కాదు. ఊహించుకున్నది, భగవంతుడి కాదు. భగవంతుడు మీ ముందు ఉన్నాడు, కృష్ణుడు. ఈ గ్రహం పైన అయన వచ్చాడు. తదత్మనం శ్ర్జమ్య అహం, సంభవామి యుగే యుగే. కావున భగవంతుడి చూసినవారు దగ్గర నుంచి మీరు సమాచారం తీసుకోవాలి. తద్ విద్ధి ప్రాణిపాతెన పరిప్రస్నేన సేవయ ఉపదేక్స్యంతి తే జ్ఞానం జ్ఞానినాస్ తత్త్వ-దర్సినహ్ (భగ 4.34) తత్త్వ-దర్సినహ్. మీరు చూడనంత వరకు, నిజమైన సమాచారం ఇతరులకు ఎలా ఇవ్వగలరు? కావున భగవతుడిని కనిపించాడు, చరిత్రలోనే చూడడం కాదు. చరిత్రలో, కృష్ణుడు ఈ గ్రహం మీద ఉన్నప్పుడు, కురుక్షేత్ర యుద్ధం యొక్క చరిత్రలో ఎక్కడైతే ఈ భగవద్గీత చెప్పబడిందో, అది చారిత్రక యదార్ధం. కావున చరిత్ర ద్వారా మరియు శాస్త్రాలు ద్వారా భగవంతుడి శ్రీ కృష్ణుడుని చూడవచ్చు. శాస్త్ర-చక్సుస. ఈ ప్రస్తుత క్షణం వలె, కృష్ణుడు భౌతికముగా లేడు, కాని శాస్త్రము నుండి కృష్ణుడి అంటే ఏమిటి అని అర్థం చేసుకోవచ్చు. కావున శాస్త్ర-చక్సుర శాస్త్ర.. మీరు నేరుగా తెలుసుకోవచ్చు లేదా శాస్త్రము ద్వారా కూడా తెలుసుకోవచ్చు. నేరుగా తెలుసుకోవడం కన్నా శాస్త్రము ద్వారా తెలుసుకోవడం మంచిది. కావున మా జ్ఞానం, ఎవరైతే వేదముల సూత్రములు పాటిస్తున్నారో, వారి జ్ఞానం వేదములు నుండి ఉద్భవించింది. వారు ఎటువంటి జ్ఞానమును తయారు చేయరు. ఏదైతే వేదముల యొక్క ఆధారముతో అర్థం చేసుకున్నారో, అది సత్యము. కావున కృష్ణుడు వేదములు ద్వారా అర్థం చేసుకోవాలి. వేదిస్ చ సర్వైర్ అహం ఎవ వేద్యః (భగ 15.15) అది భగవద్గీత లో పేర్కొనబడింది. మీరు కృష్ణుడి గురించి ఊహించుకోలేరు. ఎవరైనా వెధవ నేను ఊహించుకుంటున్నాను అని చెబితే, అది వెధవ తనం. మీరు కృష్ణుడిని వేదములు ద్వార చూడాలి. వేదిస్ చ సర్వైర్ అహం ఎవ వేద్యః (భగ 15.15) వేదములు చదవడం యొక్క లక్ష్యము అది. అందువలన దాన్ని వేదాంతము అని అంటారు. కృష్ణుడి జ్ఞానము వేదాంతము.