TE/Prabhupada 0578 - కేవలం కృష్ణుడు చెప్పేది మాట్లాడండి
Lecture on BG 2.19 -- London, August 25, 1973
కాబట్టి మీరు ఆపివేస్తే, మీరు ఈ జనన మరణాన్ని నిలిపివేయాలనుకుంటే, ఇంద్రియ భోగములో మునిగిపోకండి. మళ్లీ చిక్కుకుంటారు.
- nūnaṁ pramattaḥ kurute
- vikarma yad indriya-prītaya
- āpṛṇoti na sādhu manye yata ātmano 'yam
- asann api kleśada āsa dehaḥ
- ( SB 5.5.4)
అది సరే, ఈ శరీరం కొన్ని సంవత్సరాల కోసమే, ఇది ముగిసిపోతుంది. అది సరే. ఇది ముగుస్తుంది, కానీ మీరు మరొక శరీరం అంగీకరించాల్సి ఉంటుంది. శరీరం, శరీరాన్ని అంగీకరించటం, మీరు చేయాలి ఎందుకంటే మీకు కోరిక ఉంది, ఇంద్రియ తృప్తి. కాబట్టి ఇంద్రియ తృప్తి అంటే మీరు ఇంద్రియాలు కలిగి ఉన్నారు తృప్తి పరుచుకోవటానికి. కాబట్టి కృష్ణుడు చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా కరుణామయుడు, సంతోషంగా లేడు, కానీ ఆయన చాలా కరుణామయుడు. అది సరే, ఈ దుష్టుడు ఇలా కోరుకుంటున్నాడు. అతడికి ఈ సౌకర్యం ఇవ్వండి. అయితే సరే. ఈ దుష్టుడు మలము తినాలని కోరుకుంటున్నాడు. అయితే సరే. ఆయనకు పంది శరీరం ఇవ్వండి." ఇది ఇలా కొనసాగుతుంది, ప్రకృతి చట్టం.
కాబట్టి ఈ జ్ఞానం, భగవద్గీత జ్ఞానం, మానవ సమాజానికి ఎంతో ఖచ్చితమైనది. కృష్ణుడు ఈ జ్ఞానం వ్యాప్తి చెందాలని కోరుకుంటున్నారు ఎందుకంటే అందరూ, sarva-yoniṣu kaunteya sambhavanti mūrtayaḥ... ( BG 14.4) ఆయన బీజము ఇచ్చు తండ్రి. తండ్రి సహజముగా మేలు కోరుకునేవాడు. ఈ దుష్టులు, వారు బాధపడుతున్నారు, prakṛti-sthāni. Manaḥ ṣaṣṭhānīndriyāṇi prakṛti-sthāni karṣati ( BG 15.7) కేవలం, మానసిక కల్పన చే, మనః, ఇంద్రియాల సహాయం చేత, వారు చాలా కష్టపడుతూ ఉన్నారు. వారు నా వద్దకు వస్తే వారు చాలా చక్కగా జీవిస్తారు, నా స్నేహితుడిగా, నా ప్రియుడిగా, నా తండ్రిగా, నా తల్లిగా, వృందావన. కాబట్టి, మళ్లీ చెప్పండి, వారిని పిలవండి. "అందువల్ల.... కృష్ణుడు వస్తారు. Yadā yadā hi dharmasya ( BG 4.7) ప్రపంచం మొత్తం ఇంద్రియ భోగం అను తప్పుడు ముద్ర క్రింద నడుస్తుంది. అందువల్ల ఆయన వచ్చి సలహా ఇస్తాడు, sarva-dharmān parityajya: ( BG 18.66) నీవు దుష్టుడివి, ఈ వ్యాపకం అంతా విడిచిపెట్టు. మీరు శాస్త్రీయంగా పురోగమించినందుకు గర్వపడకండి. మీరు అంతా దుష్టులు. ఈ అర్థం లేనిది వదిలేయండి. నా దగ్గరకు రండి. నేను మీకు రక్షణ ఇస్తాను." ఇది కృష్ణుడు. ఆయన ఎంత దయగలవాడు. అవే పనులు కృష్ణుని సేవకు చేయవలెను. ఒక గొప్ప యోగి ఇంద్రజాలికుడు అవకూడదు. లేదు, అది అవసరం లేదు. కేవలం కృష్ణుడు చెప్పేది మాట్లాడండి. అప్పుడు మీరు ఆధ్యాత్మిక గురువు అవుతారు. అర్థం లేనిది ఏది మాట్లాడకండి. చైతన్య మహాప్రభువు కూడా చెప్పారు, yāre dekha tāre kaha 'kṛṣṇa'-upadeśa ( CC Madhya 7.128) కేవలం మీరు కృష్ణుడి ఉపదేశాన్ని బోధించండి, మీరు ఎవరిని కలుసుకుంటారో. అప్పుడు మీరు ఆధ్యాత్మిక గురువు అవుతారు. అంతే. చాలా సులభం.
చాలా ధన్యవాదములు. (ముగింపు)