TE/Prabhupada 0673 - ఒక పిచ్చుక సముద్రమును పొడిగా చేయటానికి ప్రయత్నిస్తున్నది. దీనిని పట్టుదల అని అంటారు
Lecture on BG 6.16-24 -- Los Angeles, February 17, 1969
భక్తుడు: "పట్టుదల గురించి మాట్లాడితే, సముద్రపు అలల వలన తన గుడ్లను కోల్పోయిన పిచ్చుక యొక్క ఉదాహరణను మనము పాటించాలి. ఒక పిచ్చుక సముద్రపు ఒడ్డున తన గుడ్లు పెట్టినది. కానీ మహాసముద్రం వాటిని తన అలలతో తీసుకు వెళ్ళిపోయినది. పిచ్చుక చాలా చింతించినది, ఆమె గుడ్లను తిరిగి ఇమ్మని సముద్రమును కోరింది. మహాసముద్రం దాని విజ్ఞప్తిని కనీసము పరిగణించలేదు, అందువలన ఆమె సముద్రమును పొడి చేయడానికి నిర్ణయించింది. ఆమె ప్రారంభించింది... "
ప్రభుపాద: ఉదాహరణకు ఒక పిచ్చుక సముద్రమును పొడిగా చేయటానికి ప్రయత్నిస్తున్నది. (నవ్వుతూ) దీనిని పట్టుదల అని పిలుస్తారు. ఉదాహరణకు మా గాంధీ వలె. ఆయన బ్రిటీష్వారిపై యుద్ధం ప్రకటించాడు. అహింసాత్మకమైన. సహాయ నిరాకరణ యుద్ధం. మీరు చూడండి? కానీ పట్టుదల ఉంది. ఆ "నేను బ్రిటీషర్లను పంపించేయాలి." ఆయన చేశాడు. ఆయుధం ఏమిటి? అహింస. సరే మీరు పోరాడండి, నన్ను చంపండి, నేను మీ పై దాడి చేయను. మీరు చూడండి? ఆయన అయ్యాడు, అది ఏమిటి? పట్టుదల. ప్రజలు నవ్వారు గాంధీ బ్రిటీష్ సామ్రాజ్యంపై, శక్తివంతమైన బ్రిటీష్ సామ్రాజ్యం పై యుద్ధాన్ని ప్రకటించారు. బ్రిటీష్వారు భారతదేశాన్ని కోల్పోయిన తర్వాత, వారు సామ్రాజ్యము అంతా కోల్పోయారు. ఇది బ్రిటీష్ సామ్రాజ్యం యొక్క ఆభరణము కనుక వారు ఫార్ ఈస్ట్ లో అన్ని కోల్పోయారు, వారు ఈజిప్ట్ లో అన్ని కోల్పోయారు, వారు సూయజ్ కాలువను కోల్పోయారు, ప్రతిదీ కోల్పోయారు కాబట్టి పట్టుదల చాలా మంచి విషయము. కొనసాగించు.
భక్తుడు: "ఆమె చిన్న ముక్కుతో నీటిని తీసుకోవడము ప్రారంభించినది, ప్రతి ఒక్కరూ తన అసాధ్యమైన నిర్ణయానికి ఆమెను చూసి నవ్వారు. ఆమె కార్యక్రమాల వార్త వ్యాప్తి చెందింది, చివరికి గరుత్మంతుడు, విష్ణు భగవానుని యొక్క అతిగొప్ప పక్షి వాహనము, ఇది విన్నది. ఆయన తన చిన్న సోదరి పక్షి పట్ల కనికరము కలిగాడు, ఆయన చిన్న పిచ్చుకను చూడడానికి వచ్చాడు, ఆయన తన సహాయం వాగ్దానం చేసినాడు. అందువల్ల గరుడ, పిచ్చుక గుడ్లు తిరిగి ఇమ్మని సముద్రమును అడిగారు, ఆయన పిచ్చుక యొక్క పనిని స్వయంగా చేపట్టినారు. ఈ సముద్రం భయపడింది, గుడ్లు తిరిగి ఇచ్చింది. ఆ విధముగా పిచ్చుక గరుడ యొక్క దయతో సంతోషము పొందినది. "
ప్రభుపాద: అవును. కాబట్టి గరుడ ఆయన రక్షించటానికి వచ్చాడు, అవును. కొనసాగించు.
భక్తుడు: అదేవిధముగా, యోగాభ్యాసం, ముఖ్యంగా భక్తి-యోగా, కృష్ణ చైతన్యములో, చాలా కష్టమైన పని అనిపించవచ్చు, కానీ ఎవరైనా గొప్ప పట్టుదలతో సూత్రాలను అనుసరిస్తే, భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తాడు, తమకు తాము సహాయం చేసుకునే వారికి భగవంతుడు సహాయం చేస్తాడు.
ప్రభుపాద: అంతే. ఏమైనా సందేహాలు ఉన్నాయా?
భక్తుడు: ప్రభుపాద, విజయము సాధించటానికి పట్టుదల ముఖ్యమైన కారణం అని చెప్పినప్పుడు... ఎలా ఎల్లప్పుడూ ఒకరు ఈ ఉత్సాహమును ఉంచుకుంటారు, ఎవ్వరూ ఎల్లప్పుడూ ఈ ఉత్సాహం లేదా పట్టుదల యొక్క అగ్నిని ఉంచుకుంటారు? ఎన్నో విషయాలతో వ్యవహరించేటప్పుడు...
ప్రభుపాద: పట్టుదల అంటే మీరు ఉత్సాహంగా కూడా ఉంటారు. అది పట్టుదలలో ఒక భాగము. Utsāhād dhairyāt, tat-tat-karma (Nectar of Instruction 3). ఉత్సాహ, ఆ ఉత్సాహం పట్టుదలకు వాస్తవమైన ప్రారంభము. మీరు ఉత్సాహంగా ఉంటే తప్ప, మీ పట్టుదల ఎలా కొనసాగుతుంది? కాబట్టి పట్టుదల, ఉత్సాహం, సహనం, నియంత్రణ సూత్రములతో పని చేస్తే, ఇవి పట్టుదల యొక్క వివిధ విధులు. ఈ విషయాలు, ఉత్సాహం, ఓర్పు, విశ్వాసముతో పనిచేయడం అన్నిటికి ఒకే పదము పట్టుదల. ఇవి పట్టుదల యొక్క విభిన్న లక్షణాలు