TE/Prabhupada 0571 - ఒకరు కుటుంబ జీవితములో ఉండకూడదు

Revision as of 17:25, 23 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0571 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes - In...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
[[FR/Prabhupada 0570 - Même en cas de malentendu entre mari

et femme, il n’est pas question de divorce|Page Précédente - Vidéo

0570]]

[[FR/Prabhupada 0572 - Pourquoi devriez-vous dire, "Oh! Je ne

veux pas que vous parliez dans mon église"|Page Suivante - Vidéo

0572]]

[[Vaniquotes:Everyone should give up family connection at a certain age, after the age of 50. One should

not remain in family life. That is Vedic culture|Original Vaniquotes page in English]]



Press Interview -- December 30, 1968, Los Angeles


విలేఖరి: ఇప్పుడు మీరు కొంత కాలం ఈ సంస్థకు వెళ్ళారా?

ప్రభుపాద: ఎటువంటి నిర్దిష్టమైన సమయము లేదు. లేదు కానీ, చెప్పడానికి, నేను శిక్షణ పొందాను, నా తండ్రి ఈ పరంపరకు చెందినవాడు...

విలేఖరి: ఓ, మీ తండ్రి...

ప్రభుపాద: అవును. నా తండ్రి చిన్ననాటి నుండి నాకు శిక్షణ ఇచ్చారు, అవును. నేను 1922 లో నా ఆధ్యాత్మిక గురువును

కలుసుకున్నాను, నేను దీక్ష తీసుకున్నాను... మొత్తం మీద ఒక నేపథ్యము ఉంది, నేను చెప్పినట్లుగా, 80, 90 శాతం ప్రజలు కుటుంబ పరముగా కృష్ణ

చైతన్యమును కలిగి ఉన్నారు. మీరు చూడండి? కాబట్టి మేము మా జీవిత ప్రారంభము నుండి శిక్షణ పొందుతాము. అధికారికముగా, 1933 లో నా

ఆధ్యాత్మిక గురువుని నేను అంగీకరించాను. అప్పటి నుండి, నేను కొంత నేపథ్యం కలిగి ఉన్నాను, నేను కలుసుకున్నప్పటి నుండి, నేను ఈ ఆలోచనను

అభివృద్ధి చేసుకున్నాను.

విలేఖరి: నేను అర్థము చేసుకోగలను, నేను అర్థము చేసుకోగలను. మీరు, ఒక కోణంలో, మీ స్వంతముగా 1933 నుండి దీనిని వ్యాప్తి చేస్తూన్నారు.

ప్రభుపాద: లేదు. నేను దీనిని ప్రచారము చేస్తున్నాను పందొమ్మిది వందల...., ఆచరణాత్మకంగా '59 నుండి.

విలేఖరి: '59, నేను అర్థము చేసుకోగలను.



అ సమయం నుండి మీరు ఏం చేశారు... ప్రభుపాద: నేను గృహస్థుడను. నేను ఔషధ తయారిలో వ్యాపారము చేస్తున్నాను. గతంలో, నేను ఒక గొప్ప

రసాయన సంస్థలో మేనేజర్ ను. నేను గృహస్థుడిని అయినప్పటికీ ఈ జ్ఞానాన్ని నేను నేర్చుకుంటున్నాను. నేను ఈ బ్యాక్ టు గాడ్ హెడ్ ను

ప్రచురించాను...


విలేఖరి: మీరు ప్రచురించడం జరిగింది... ప్రభుపాద: భారతదేశంలో. విలేఖరి: నేను అర్థము చేసుకున్నాను.

ప్రభుపాద: అవును, 1947 లో నా ఆధ్యాత్మిక గురువు ఆజ్ఞ ప్రకారము నేను ప్రారంభించాను. నేను ఏమి సంపాదించినా, నేను ఖర్చు చేస్తున్నాను.

అవును. నాకు తిరిగి ఏమి రావడము లేదు, కానీ నేను ప్రచారము చేస్తున్నాను. నేను ఎంతో కాలము నుండి ఈ పనులను చేస్తున్నాను. కానీ

వాస్తవానికి నా కుటుంబంతో అన్ని సంబంధములు వదలివేసిన తరువాత, నేను 1959 నుండి ఈ పనిని చేస్తున్నాను.


విలేఖరి: మీకు పిల్లలు ఉన్నారా? ప్రభుపాద: అవును, నాకు ఎదిగిన అబ్బాయిలు ఉన్నారు.


విలేఖరి: మీరు వారిని వదిలి వెళ్ళారా? ప్రభుపాద: అవును. నాకు నా భార్య, నా మనవళ్ళు, ప్రతి ఒక్కరూ ఉన్నారు, కానీ నాకు వారితో ఎటువంటి

సంబంధం లేదు. వారు తమ సొంత విధానములో జీవిస్తున్నారు. పెద్ద అబ్బాయి సంరక్షణలో నా భార్య ఉంది. అవును.

విలేఖరి: సరే, అది...? నేను అలా చేయడము కష్టము అని అనుకుంటాను, మీ కుటుంబాన్ని వదలివేయడము మరియు "తర్వాత కలుస్తాను." అని

చెప్పడము,

ప్రభుపాద: అవును, అవును, అది వేదముల నియంత్రణ. 50 ఏళ్ల వయస్సు తర్వాత, అందరూ ఒక నిర్దిష్ట సమయములో కుటుంబ సంబంధమును

వదలి వేయాలి. ఒకరు కుటుంబ జీవితములో ఉండకూడదు. ఇది వేదముల సంస్కృతి. మరణం వరకు కాదు , ఒక కుటుంబీకుడుగా ఉండడము, ఇది

మంచిది కాదు.


విలేఖరి: మీరు దానిని వివరించండి. ప్రభుపాద: మొదట, ఒక బాలుడు బ్రహ్మచారిగా, ఆధ్యాత్మిక జీవితములో శిక్షణ పొందుతాడు. అప్పుడు ఆయన

కుటుంబ జీవితములో ప్రవేశించవద్దని సూచన ఇస్తున్నాడు. కానీ తన లైంగిక జీవితాన్ని నియంత్రించుకోలేకపోతే, అతడు అనుమతించబడతాడు, "సరే,

నీవు పెళ్లి చేసుకో." అప్పుడు ఆయన కుటుంబ జీవితంలో ఉంటాడు. అందువలన ఆయన 24 లేదా 25 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకుంటాడు. 25

సంవత్సరాలు, ఆయన లైంగిక జీవితం ఆనందిస్తాడు. ఈలోగా, ఆయన కొందరు పెద్ద పిల్లలను పొందుతాడు. కాబట్టి 50 సంవత్సరాల వయసులో, భర్త

భార్య ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతారు వారు కేవలం కుటుంబ బంధము నుండి వదులుకోవడానికి యాత్రా ప్రాంతాలకు ప్రయాణము చేస్తారు. ఈ

విధముగా, ఆ మనిషి కొంచెం ఉన్నత స్థానమునకు వచ్చినప్పుడు, ఆయన తన భార్యను అడుగుతాడు నీవు వెళ్ళి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో నీ

కుమారులు, ఎదిగినారు, వారు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. నేను సన్యాసము తీసుకుంటాను. " కాబట్టి ఆయన ఒంటరిగా ఉంటాడు తాను పొందిన

జ్ఞానాన్ని ప్రచారము చేస్తాడు. ఇది వేదముల నాగరికత. అంతే కాని ఒక వ్యక్తి జన్మ నుండి మరణం వరకు కుటుంబ జీవితంలో ఉండడము. కాదు బౌద్ధ

ధర్మములో కూడా ఒక బౌద్ధుడు కనీసం పది సంవత్సరాల పాటు తప్పనిసరిగా సన్యాసిగ ఉండాలి అనే నిబంధన సూత్రం ఉంది. అవును. ఆధ్యాత్మిక

పరిపూర్ణతను ఎలా సాధించాలనేది మొత్తం ఆలోచన. ఒక వ్యక్తి తన కుటుంబ జీవితంలో చిక్కుకొని ఉండినట్లయితే, అతడు ఆధ్యాత్మికతను అభివృద్ది

చేసుకోలేడు. అయితే కుటుంబము మొత్తం కూడా, మొత్తం కుటుంబము కృష్ణ చైతన్యములో ఉంటే, అది ఉపయోగకరంగా ఉంటుంది. కానీ చాలా

అరుదు. ఎందుకంటే భర్త కృష్ణ చైతన్యము కలిగి ఉండవచ్చు, భార్య ఉండకపోవచ్చు. కానీ సంస్కృతి చాలా చక్కగా ఉంది, అందరు కృష్ణ చైతన్యములో

ఉన్నారు.