TE/Prabhupada 0514 - ఏ ఆనందం లేదు, కేవలం నొప్పి. ఇక్కడ, ఆనందం అంటే నొప్పి కొద్దిగా లేకపోవడం అని అర్థం

Revision as of 03:29, 1 January 2018 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0514 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.25 -- London, August 28, 1973


కాబట్టి మన వాస్తవ కర్తవ్యము బ్రహ్మ భూతః అవ్వడము కాబట్టి ఎవరు అవ్వవచ్చు? అది ఇప్పటికే వివరించబడింది. కృష్ణుడు ఇప్పటికే వివరించాడు, ఆ శ్లోకము ఏమిటి? Yaṁ hi na vyathayanty ete. Vyathayanti, నొప్పి ఇవ్వదు. భౌతిక, భౌతిక భారం, ఎల్లప్పుడూ సమస్యాత్మకమైనది. ఈ శరీరం కూడా. ఇది మరొక భారం. మనము దానిని మోయాలి. ఈ శారీరక నొప్పి మరియు ఆనందం ద్వారా ఒకరు కలత చెందనప్పుడు.. ఏ ఆనందం లేదు, కేవలం నొప్పి. ఇక్కడ, ఆనందం అంటే నొప్పి కొద్దిగా లేకపోవడం అని అర్థం. ఉదాహరణకు మీకు ఇక్కడ ఒక పుండు ఉంది. ఏమి పిలుస్తారు? Boil? Phoṛā? ఇది ఎల్లప్పుడూ బాధాకరమైనది. ఏదైనా వైద్య శాస్త్రపు మందును ఉపయోగించడము ద్వారా, నొప్పి కొంచము ఉపశమనం అవుతుంది, మీరు ఆలోచిస్తారు "ఇప్పుడు అది ఆనందం." కానీ పుండు ఉంది. మీరు ఎలా సంతోషంగా ఉంటారు? ఇక్కడ, వాస్తవానికి ఎటువంటి ఆనందం ఉండదు, కానీ మనము చాలా ప్రతి చర్యను కనుగొంటున్నాము ఉదాహరణకు వ్యాధి ఉన్నట్లుగానే. మనము ఔషధమును కనుగొన్నాము మనము వైద్య కళాశాలను కనుగొన్నాము. తయారీ చేస్తున్నాము, గొప్ప, గొప్ప వైద్యులను, M.D., FRCS. కానీ మీరు నివసించరు. లేదు, మీరు చనిపోవాల్సిందే. కాబట్టి పుండు ఉంది. తాత్కాలిక ఔషధమును కొంచము పూయడము ద్వారా, అది... అందువల్ల ఈ భౌతిక ప్రపంచం లో ఎటువంటి ఆనందం లేదు. అందుచేత కృష్ణుడు ఇలా అన్నాడు, "మీరు ఎందుకు సంతోషంగా ఉన్నారు? మీరు చనిపోవాలి ఏమైనప్పటికీ , అది మీ కర్తవ్యము కాదు, మీరు శాశ్వతమైన వారు, కానీ అయినప్పటికీ మీరు మరణాన్ని అంగీకరించాలి. "Janma-mṛtyu-jarā-vyādhi-duḥkha-doṣānudarśanam ( BG 13.9) ఇది మీ నిజమైన సమస్య.

కానీ ఈ మూర్ఖులు వారికి తెలియదు. మరణం సహజంగానే ఉంటుందని వారు భావిస్తున్నారు - మరణము తరువాత అంతా పూర్తయినది. ఇప్పుడు ఎంత కాలము నేను చనిపోనో, నన్ను ఆనందించనివ్వండి. Ṛṇaṁ kṛtvā ghṛtaṁ pibet. ఆనందం అంటే... మన భారతీయ పద్ధతి ప్రకారం, వారి ఆనందము మాంసాహారం తినడము కాదు పాశ్చాత్య దేశాలలో వలె వారి ఆనందం నెయ్యి తినడం, చబ్బీగా అవ్వడము, కొవ్వును పెంచుకోవడము. అది వారి ఆనందం. కాబట్టి చార్వాక ముని సిఫార్సు చేశారు, "ఇప్పుడు నెయ్యి తిని జీవితం ఆనందించండి." కచోరి, సమోసా, అన్ని నెయ్యితో తయారు చేయబడినవి. అప్పుడు "నాకు డబ్బు లేదు, సర్, నేను ఎక్కడ నెయ్యి పొందాలి?" Ṛṇaṁ kṛtvā. "అడుక్కోండి, అప్పు తెచ్చుకోండి, దొంగలించండి, నెయ్యి పొందండి." ఎట్లాగైతేనే, నల్ల మార్కెట్, తెల్ల మార్కెట్, ఏదో ఒక విధముగా. డబ్బు మరియు నెయ్యి తీసుకురండి, అంతే. Ṛṇaṁ kṛtvā ghṛtaṁ pibet. "సాధ్యమైనంత నెయ్యి తినండి." Ṛṇaṁ kṛtvā ghṛtaṁ pibet yāvād jīvet sukham. Jīvet. Sukhaṁ jīvet. ఎంత కాలము మీరు నివసిస్తే, ఆనందముగా నివసించండి, ఎంతో చక్కగా అది అన్ని యూరోపియన్ తత్వవేత్తల యొక్క సిద్ధాంతం. ఆనందముగా నివసించండి. కానీ తత్వవేత్త చివరికి పక్షవాతమునకు గురి అవుతాడు. ఆయన ఆనందము ముగిసి పోతుంది. ఎవరు పక్షవాతానికి గురి అయిన ఆ తత్వవేత్త ? కాబట్టి వారు ఈ సిద్ధాంతాలను తయారు చేస్తారు. యూరోపియన్ తత్వవేత్తలు మాత్రమే కాదు, భారతదేశంలో మరొక తత్వవేత్త, డాక్టర్ రాధాకృష్ణన్, ఇప్పుడు ఆయన మెదడు పక్షవాతమునకు గురి అయినది .

కాబట్టి వారు ఒక నియంత్రికుడు ఉన్నాడని అర్థం చేసుకోలేరు. మన సంతోషకరమైన జీవితం గురించి మనం ఎన్నో రకములుగా సిద్ధాంతములు చేయవచ్చు కానీ మీరు సంతోషంగా ఉండలేరు, అయ్యా, ఎంత కాలము మీరు ఈ భౌతికము శరీరమును కలిగి ఉంటారో. అది సత్యము. Janma-mṛtyu-jarā-vyādhi-duḥkha-doṣānudarśanam ( BG 13.9) అందువలన తెలివైన వ్యక్తులు, వారు ఉండాలి... కృష్ణుడు ప్రతి ఒక్కరిని తెలివిగలవాడుగా చేస్తాడు: "మీరు మూర్ఖులు, నీవు జీవితంలో శారీరక భావనలో ఉన్నారు. మీ నాగరికతకు విలువ లేదు. ఇది మూర్ఖపు నాగరికత. "