TE/Prabhupada 0521 - నా విధానం రూపగోస్వామి అడుగుజాడలను అనుసరించడం
Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968
కృష్ణ చైతన్యమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కేవలము దీనిని సాధన చేయడం ద్వారా, ఏదో ఒక మార్గము ద్వారా, మీరు కృష్ణుడితో అనుబంధాన్ని పొందుతారు. ఏదో మార్గము. యేన తేన ప్రకారేన, ఏదో మార్గము. మీరు ఎవరినైనా ఇష్టపడినట్లయితే, ఏ విధముగానైనా, మీరు దాన్ని పొందటానికి ప్రయత్నిస్తారు.... ఇది చాలా కష్టము కాదు. మనకు వ్యూహాలు తెలుసు. ఒక జంతువు కూడా, ఒక జంతువు, తనకు కావాల్సిన వాటిని తెలివిగా ఎలా పొందాలో తెలుసు. జీవితం కోసం పోరాటం అంటే ప్రతి ఒక్కరూ తన లక్ష్యం పొందటానికి ప్రయత్నిస్తున్నారు. చాలా మంది, వ్యూహాత్మకంగా. కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి,అసాధ్యమైనటువంటి ఈ భౌతిక వస్తువులను అందుకొనుటకు బదులుగా, మీరు ఏదో మార్గంలో కృష్ణుడిని పట్టుకొనుటకు ప్రయత్నించండి. అది మీ జీవితాన్ని విజయవంతం చేస్తుంది. ఏదో ఒక మార్గం. మయ్యాస... యేన తేన ప్రకారేన మనః కృష్ణే నివసయెత్ సర్వే విధి-నిషేధాః స్యుర్ ఎతయోర్ ఏవ కింకరాః
ఇప్పుడు, కృష్ణ చైతన్యములో చాలా వున్నాయి.... ఈ పద్ధతి, చాలా వున్నాయి. నేను కేవలం ఒకదాని తర్వాత ఒకటి ప్రవేశపెడుతున్నాను, కొద్దికొద్దిగా, కానీ భారతదేశంలో ఈ కృష్ణ చైతన్యాన్ని అభ్యసిస్తున్నవారు, వారికి చాలా నియమ నిబంధనలు ఉన్నాయి. ఎవరో చెప్తారు " స్వామీజీ చాలా సాంప్రదాయవాది, ఆయనకు చాలా నియమ నిబంధనలు ఉన్నాయి." కానీ నేను ఒక్క శాతం ప్రవేశపెట్టలేదు. ఒక్క శాతం. ఎందుకంటే మీ దేశంలో అన్ని నియమ నిబంధనలను ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. నా విధానం రూపగోస్వామి అడుగుజాడలను అనుసరించడం. ఏదోవిధంగా, వారిని కృష్ణుడితో అనుబంధాన్ని పెంచుకోనివ్వండి. అది నా (అస్పష్టమైనది). మరియు నియమ నిబంధనలు, వారు తరువాత చేస్తారు. మొదట అతడిని కృష్ణుని మీద ప్రేమ కలిగేలా చేయాలి. అందువల్ల ఇది యోగ. కృష్ణుడు వివరిస్తున్నాడు, మయ్యాసక్త-మనాః పార్థ. కాబట్టి కృష్ణుని మీద ప్రేమ కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ఎందుకు మీరు కృష్ణుడితో అనుబంధమై ఉండకూడదు? కృష్ణ చైతన్యములో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. మాకు కళలు ఉన్నాయి, మాకు చిత్రకళ వుంది, మా వద్ద నృత్యము ఉంది, మా వద్ద సంగీతము ఉంది, మా వద్ద మొదటి-రకము ఆహారము ఉంది, మావద్ద మొదటి-రకము దుస్తులు, మొదటి-రకము ఆరోగ్యం, ప్రతిదీ ఒక్కటీ మొదటి రకము. ఈ మొదటి-రకం విషయాల మీద కేవలం మూర్ఖునికి మాత్రమే ప్రేమ ఉండడు. ప్రతిదీ. అదే సమయంలో సులభము. ఈ పద్ధతి మీద ప్రేమ లేక పోవడానికి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే అతడు మొదటి-రకం మూర్ఖుడు. అంతే. నేను మీకు స్పష్టంగా చెప్తాను. ఎవరైనా రానివ్వండి, నాతో వాదించండి, అతడు కృష్ణ చైతన్యాన్ని స్వీకరించకపోవడం ద్వారా మొదటి-రకం మూర్ఖుడు అవునో కాదు. నేను దానిని రుజువు చేస్తాను.
కాబట్టి మొదటి-రకం మూర్ఖుడు అవ్వకండి. మొదటి రకం తెలివైన వ్యక్తి అవ్వండి. చైతన్య- చరితామృత యొక్క రచయిత చెప్పినట్లు, కృష్ణ యేయ్ భజె సెయ్ బఢ చతుర. కృష్ణ చైతన్యమును తీసుకున్న వారెవరైనా అతడు మొదటి-రకం తెలివైన వ్యక్తి. కాబట్టి మొదటి-రకం మూర్ఖుడిగా ఉండకండి, కానీ మొదటి-రకం తెలివైన వ్యక్తిగా ఉండండి. అది నా అభ్యర్థన.
చాలా ధన్యవాదములు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
మొన్నటి రోజు చాలా మంది విద్యార్థులు వచ్చారు, ఇప్పుడు ఎవరూ రాలేదు. ఎందుకంటే వారు మొదటి-రకం మూర్ఖుడిగా ఉండాలని అనుకుంటున్నారు, అంతే. అంటే.... ఇది వాస్తవం. కాబట్టి ఒకరు చాలా తెలివైన వారైతే తప్ప, వారు కృష్ణ చైతన్యమును తీసుకోలేరు. వారు ఈ విధముగా లేదా ఆ విధముగా, మోసపోవాలని అనుకుంటున్నారు. అంతే. సాదా విషయము, సాధారణ విషయము, ఫలితం చాలా గొప్పది - వారు ఒప్పుకోవడానికి అంగీకరించరు.