TE/Prabhupada 0698 - మీ ఇంద్రియాలను సేవించడం బదులుగా దయచేసి రాధాకృష్ణులను సేవించండి, మీరు సంతోషంగా ఉంటారు
Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969
భక్తుడు: మీరు ఎందుకు రాధా-కృష్ణ చైతన్యము బోధిస్తున్నారు?
ప్రభుపాద: హమ్?
భక్తుడు: మీరు రాధా-కృష్ణ చైతన్యము ఎందుకు బోధిస్తున్నారు?
ప్రభుపాద: ఎందుకంటే మీరు మరిచిపోయారు. అది మీ సహజ స్థితి. మీరు రాధా-కృష్ణుల యొక్క సేవను మరిచిపోయారు, కాబట్టి మీరు మాయకు యొక్క సేవకునిగా మారారు? మీరు మాయ యొక్క సేవకులు, మీ ఇంద్రియాలు. అందువలన నేను బోధిస్తున్నాను, “మీరు మీ ఇంద్రియాలను సేవిస్తున్నారు, ఇప్పుడు మీరు మీ సేవను రాధాకృష్ణుల వైపు తిప్పండి, మీరు సంతోషంగా ఉంటారు. మీరు అందించే సేవ. రాధాకృష్ణ లేదా మాయకా?, భ్రాంతి ఇంద్రియాలు. అందరూ ఇంద్రియాలను సేవిస్తున్నారు.అవునా కాదా?" కానీ అతడు సంతృప్తి చెందలేదు. అతడు సంతృప్తి చెందలేడు. అందువల్ల నేను వారికి సరైన సమాచారాన్ని ఇస్తున్నాను - మీరు అందించే సేవ. అని మీ ఇంద్రియాలను సేవించడం బదులుగా దయచేసి రాధాకృష్ణులను సేవించండి, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. సేవకుడిగా మీ స్థితి అదే విధముగా ఉంది, కానీ నేను మంచి సేవను అందిస్తున్నాను. మీరు రాధాకృష్ణులను సేవించకపోతే, అప్పుడు మీరు మీ ఇంద్రియాలను సేవించాలి, మాయా. కాబట్టి మీ సేవా పరిస్థితి అలానే ఉంటుంది. మీరు రాధాకృష్ణులను సేవించకపోయినా కూడా అందువల్ల ఉత్తమ ఉపదేశము అంటే మీ ఇంద్రియాలను సేవించే బదులుగా, మీకు ఇష్టము వచ్చినట్లుగా, దయచేసి రాధాకృష్ణులను సేవించండి, మీరు సంతోషంగా ఉంటారు.అంతే.
భక్తుడు: ప్రభుపాద? ఈ ప్రశ్న అడిగే ముందు మీరు శ్లోకాల గురించి మాట్లాడటం జరిగింది చైతన్య మహాప్రభు మనకోసం విడిచినవి. నాకు అర్థం కాలేదు. ఒకవైపు ఆయన అంటారు మనం ఈ భౌతిక సాగరం నుంచి విముక్తులము అవ్వాలని అనుకోవటం లేదు, మనము కేవలం సేవించాలని అనుకుంటున్నాము. ఆ తర్వాత, మరొక శ్లోకములో, ఆయన కృష్ణుడితో విజ్ఞప్తి చేస్తున్నాడు తనను తరించమని మరణమనే ఈ సముద్రము నుండి మరియు ఆయన కమల చరణాల పై ఒక అణువుగా స్వీకరించమని. ఇది నాకు వైరుధ్యంగా కనబడుతుంది. నాకు......
ప్రభుపాద: ఆ వైరుధ్యం ఏమిటి? దయచేసి వివరించండి.
భక్తుడు: ఇది కనిపిస్తుంది. మీరు ముందు వివరించారు మనము ఈ భౌతిక సాగరం నుండి తరించాలని ప్రార్థించ కూడదు అని మనము కేవలం కృష్ణుడిని సేవించడానికి ప్రయత్నించాలి మనము ఎక్కడ ఉన్నప్పటికీ. మరణ సాగరము నుండి తరించటం అతడిని భౌతిక సాగరం నుండి బయటకు తీసుకురావాలని కోరుతున్నట్లుగా ఉంది.( గజిబిజిగా)
ప్రభుపాద: న ధనం, న జనం, మమ జన్మని జన్మనీశ్వరె భవతాద్ భక్తిర్ అహైతుకి ( CC Antya 20.29,Siksastaka 4). నన్ను మీ సేవలో ఉంచండి. ఇది ప్రార్థన. ఇది ప్రార్ధన ఇంకో ప్రార్థన:
- అయి నంద-తనుజ కింకరం
- పతితం మాం విషమె భవాంబుదౌ
- కృపయా తవ పాద పంకజ-
- స్థిత-ధూళి-సదృశ విచింతయ
- ( CC Antya 20.32,Siksastaka 5)
ఇంకొకటి, “మీరు నన్ను కేవలం మీ కమల చరణాల పై ధూళిగా స్వీకరించండి.” అందువల్ల ఒక శ్లోకంలో ఆయన అంటారు; " మీరు మీ సేవలో నన్ను నిమగ్నం చేయండి," ఇంకో శ్లోకంలో ఆయన అన్నారు " మీరు నన్ను మీ పద్మంలో ధూళిలా స్వీకరించండి." తేడా ఏమిటి? తేడా లేదు