TE/Prabhupada 0075 - మీరు గురువు దగ్గరకు వెళ్ళవలెను

Revision as of 18:31, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.8.25 -- Mayapur, October 5, 1974

కొంత మంది ఉన్నతమైన ప్రశ్నలు గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నప్పుడు, బ్రహ్మ జిజ్ఞాస, ఆయనకి ఒక గురువు అవసరం. తస్మాద్ గురు ప్రపద్యేత : మీరు ఇప్పుడు ఉన్నతస్థాయి జ్ఞానాన్ని అర్థం చేసుకోవడంలో ఉత్సాహవంతులై ఉన్నారు, కాబట్టి మీరు గురువు వద్దకు వెళ్ళాలి. తస్మాద్ గురు ప్రపద్యేత. ఎవరు? జిజ్ఞాసుః శ్రేయ ఉత్తమమ్. ఉత్తమమ్ అంటే ఏదైతే చీకటి పైన ఉందో. ఈ మొత్తం ప్రపంచంలో చీకటి ఉంది. కావున, ఎవరైతే చీకటి దాటి వెళ్ళాలని కోరుకుంటారో. తమసోమా జ్యోతిర్గమ. వేదముల ఉత్తర్వు ఏమిటంటే: "చీకట్లో నీవు ఉండవద్దు, కాంతికి లోనికి వెళ్ళు." ఆ కాంతి బ్రహ్మణ్, బ్రహ్మ జిజ్ఞాస. కాబట్టి జ్ఞానమును కోరుకొనే వ్యక్తి... ఉత్తమ... ఉద్గత - తమ యస్మాత్. ఉద్గత- తమ. తమ అంటే అజ్ఞానము కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలో, అజ్ఞానం లేదు. జ్ఞానం. మాయావాది తత్వవేత్తలు, వారు కేవలం చెప్తారు, జ్ఞానం, జ్ఞానవాన్. కానీ జ్ఞానమునకు మూసపోత లేదు. జ్ఞానము చాలా రకాలు ఉన్నాయి. బృందావనములో, జ్ఞానం వుంది. కానీ వైవిధ్యాలు ఉన్నాయి. కొందరు కృష్ణుడిని సేవకునిగా ప్రేమిస్తారు. కొందరు కృష్ణుడిని స్నేహితునిగా ప్రేమిస్తారు. కొందరు కృష్ణుడి ఐశ్వర్యమును అభినందించాలని కోరుకుంటారు. కొందరు కృష్ణుడికి తండ్రిగా తల్లిగా ప్రేమిస్తారు. కొందరు కృష్ణుడిని ప్రేమికుడిగా ప్రేమించాలని అనుకుంటారు. కొందరు కృష్ణుడిని శత్రువుగా ప్రేమిస్తారు. కంసుని వలె ఇది కూడా బృందావన లీలలో ఉంది. కంసుని వలె ఆయన ఎప్పుడూ కృష్ణుడి గురించి వేరే విధముగా ఆలోచిస్తున్నాడు, కృష్ణుడిని ఎలా చంపాలా అని. పూతన, ఆమె కృష్ణుడి ప్రేమికురాలిగా వచ్చింది, ఆమె తన రొమ్ము నుండి పాలను ఇవ్వటానికి కానీ కృష్ణుడిని ఎలా చంపాలి అనేది అంతర్గత కోరిక. కానీ అది కూడా పరోక్ష ప్రేమ, పరోక్ష ప్రేమగా పరిగణిస్తారు. అన్వయాత్.

కాబట్టి కృష్ణుడు జగత్ గురు. ఆయన మొదటి గురువు. కృష్ణుడు బోధకుడై భగవద్-గీతను వ్యక్తిగతంగా బోధిస్తున్నాడు మనము మూర్ఖులము, మనము పాఠం నేర్చుకోము చూడండి. అందువల్ల మనము మూర్ఖులము ఎవరైతే జగత్ గురువు నుండి పాఠములు నేర్చుకొనుటకు అనర్హులో వారు మూర్ఖులు. అందువలన, మన పరీక్ష పరికరం: ఒకరికి కృష్ణుడు తెలియకపోతే, భగవద్గీతను ఎలా అనుసరించాలో తెలియకపోతే, వెంటనే అతన్ని ఒక మూఢుడిగా భావిస్తాము. అతన్ని పట్టించుకోకండి, ఆయన ప్రధాన మంత్రి కావచ్చు, ఆయన హై కోర్ట్ న్యాయమూర్తి కావచ్చు, లేదా... లేదు. లేదు, ఆయన ప్రధానమంత్రి, ఆయన ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి. అయినా మూర్ఖుడు అవును. ఎలా? మాయయా అపహృత- జ్ఞానః : ( BG 7.15) ఆయనకి కృష్ణుడి జ్ఞానం లేదు. ఆయన మాయ చేత కప్పబడి ఉన్నాడు. మాయయా అపహృత- జ్ఞానః ఆసురం భావమాశ్రితః. అందువలన ఆయన ఒక మూర్ఖుడు. కాబట్టి నేరుగా ప్రచారము చేయండి. వాస్తవానికి, మీరు ఈ విషయాలను మృదువైన భాషలో చెప్పవచ్చు, ఏ ఆందోళన చేయవద్దు, ఎవరైతే కృష్ణుని జగద్-గురువుగా అంగీకరించరో ఆయన పాఠాలు తీసుకోడో, ఆయన ఒక మూర్ఖుడు. జగన్నాథ పురిలో వున్న ఈ మూర్ఖుడు లాగా, అతను చెప్తాడు అది "మీరు మరల జన్మ తీసుకుంటారు. అప్పుడు మీరు...." అది మూర్ఖుడు, అతన్ని మూర్ఖుడిగా తీసుకోండి. ఎందుకు? అతను జగత్ గురువు; ఆయన కూడా చెప్తాడు "నేను జగత్-గురువుని." కానీ ఆయన జగత్ గురువు కాదు. జగత్ అంటే ఏమిటో ఆయన చూడలేదు. అతను ఒక కప్ప. అతను జగత్-గురువు అని చెప్తాడు. కాబట్టి అతను మూఢాః. కృష్ణుడు చెప్పాడు అతను మూఢాః అని ఎందుకంటే అతను కృష్ణుడు ద్వారా వచ్చిన పాఠాలను తీసుకోలేదు.