TE/Prabhupada 0084 - కేవలము కృష్ణ భక్తుడు అవ్వండి
Lecture on BG 2.22 -- Hyderabad, November 26, 1972
మా ప్రతిపాదన కృష్ణుడి నుండి జ్ఞానాన్ని స్వీకరించండి పరిపూర్ణ వ్యక్తి, భగవంతుడు. మనము శాస్త్రమును అంగీకరించాలి. దానిలో తప్పులు లేవు. నేను ఆవుల పందిరి సమీపంలో నడుస్తున్నప్పుడు ఆవు పేడ కుప్పలు కుప్పలుగా ఉంది. నేను నా శిష్యులకు వివరిస్తున్నాను, ఇక్కడ, మనిషి మలం కుప్పలు కుప్పలుగా పెడితే ఎవరూ ఇక్కడకు రారు. ఇక్కడకు ఎవరూ రారు. కానీ ఆవు పేడ, ఆవు పేడ కుప్పలు చాలా ఉన్నాయి, అయినప్పటికీ మనము దీని ద్వారా వెళ్తున్నప్పుడు ఆనందము కలుగుతుంది. వేదాలలో చెప్పబడినది "ఆవు పేడ చాలా స్వచ్చమైనది" దీనిని శాస్త్రం అంటారు. మీరు వాదిస్తే, "ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది జంతువు మలం." కానీ వేదాలు, అవి. ఎందుకంటే జ్ఞానం పరిపూర్ణంగా ఉంది, వాదనకు కూడా జంతు మలం పవిత్రమైనది అని నిరూపించడానికి లేదు, కానీ అది పవిత్రమైనది. అందువలన వేదముల జ్ఞానం పరిపూర్ణమైనది మనము వేదాలు నుండి పరిజ్ఞానాన్ని తీసుకుంటే, మనం దర్యాప్తు, లేదా పరిశోధన కోసం ఉపయోగించు చాలా సమయం ఆదా అవుతుంది. మనము పరిశోధనను చాలా ఇష్టపడతాము. అంతా వేదాలలో ఉంది. ఎందుకు మీరు మీ సమయం వృథా చేస్తారు?
ఇది వేదముల జ్ఞానం. వేదముల జ్ఞానం అంటే భగవంతునిచే చెప్పబడినది. ఈ వేదముల జ్ఞానం అపౌరుషేయమ్. నా లాంటి సామాన్యుడి ద్వారా చెప్పబడలేదు. మనం అంగీకరిస్తే, మనము వేదముల జ్ఞానం అంగీకరిస్తే, వాస్తవమును కృష్ణుడు లేదా వారి ప్రతినిధులు చెప్తారు. కృష్ణుడు వివరించకుండా వున్నది ఆయన ప్రతినిధి వివరించడు. అందువలన ఆయన ప్రతినిధి కృష్ణ చైతన్య వ్యక్తులు కృష్ణుని ప్రతినిధులు. కృష్ణ చైతన్య వ్యక్తి ఏదైనా అర్థరహితముగా మాట్లాడడు. కృష్ణుడు వివరించిన దానికంటే ఎక్కువ వివరించడు. తేడా అదే. ఇతర అర్థంలేని వారు దుష్టులు, వారు కృష్ణుడు వివరించనిది వివరిస్తారు. కృష్ణుడు చెప్పారు మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మామ్ నమస్కురు ( BG 18.65) కానీ దుష్ట పండితులు, "కాదు, ఇది కృష్ణుడు కాదు, అది ఏదో ఉంది." అని చెప్తారు మీరు, ఇది ఎక్కడ నుంచి వస్తుంది? కృష్ణుడు నేరుగా చెప్పారు మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మామ్ నమస్కురు ( BG 18.65) కాబట్టి ఎందుకు మీరు విభేదిస్తున్నారు? మీరు ఎందుకు వేరే చెప్తారు: "కృష్ణుడి లోపల ఏదో ఉంది"? మీరు కనుగొంటారు... నేను నామము చెప్పడానికి ఇష్టపడను. చాలామంది దుష్ట పండితులు ఉన్నారు. వారు వారిని ఆ విధముగా అర్థం చేసుకుంటారు. భగవద్గీత భారతదేశం యొక్క గొప్ప శాస్త్రీయమైన, పుస్తకం అయినప్పటికీ అనేక మంది ప్రజలు మోసపోతుంటారు. గొప్ప గొప్ప... ఎందుకంటే ఈ దుష్ట పండితులు, పండితులు అని పిలవబడే వారి వలన. వారు అపార్థం చేసుకొనుట వలన.
మనము భగవద్గీతను ప్రచారము చేస్తున్నాము. కృష్ణుడు చెప్పారు, కృష్ణుడు చెప్పారు, సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకమ్ శరణం వ్రజ ( BG 18.66) మనము భగవద్గీతను బోధిస్తున్నాము. కృష్ణ చైతన్యముతో ఉండండి. కేవలం కృష్ణుని భక్తునిగా మారండి. మీరు గౌరవించాలి. మీరు ప్రతి ఒక్కరినీ గౌరవించ వలసి ఉంటుంది. మీరు మహోన్నతులు కారు. మీరు సేవ కోసం కొంత మందిని పొగడవలసి ఉంటుంది. అయినప్పటికీ... మీరు ఒక మంచి పరిస్థితి పొందినప్పుడు, మీరు పొగడాలి మీరు అధ్యక్షుడు అయినా, దేశం యొక్క అధ్యక్షుడు అయినప్పుడు మీరు మీ పౌరులను పొగడాలి 'దయచేసి, నాకు మీ ఓటు ఇవ్వండి నేను సౌకర్యాలు పుష్కలంగా మీకు ఇస్తాను కాబట్టి మీరు పొగడాలి. అది సత్యము. మీరు చాలా గొప్ప మనిషి కావచ్చు. కానీ మీరు కూడా కొంత మందిని పొగడాలి. మీరు ఒక యజమానిని అంగీకరించాల్సి ఉంటుంది. మహోన్నతమైన గురువు అయినా కృష్ణుని ఎందుకు అంగీకరించరు? ఇబ్బంది ఎక్కడ ఉంది? నేను కృష్ణుని మినహా వేలాది యజమానులను అంగీకరిస్తాను. ఇది మన తత్వము నేను కృష్ణుని మినహా వేలాది గురువులను అంగీకరిస్తాను. ఇది మన పట్టుదల. అప్పుడు మీరు ఎలా సంతోషంగా ఉంటారు? కృష్ణుని అంగీకరించడం ద్వారా మాత్రమే ఆనందం సాధించవచ్చు.
- భోక్తారాం యజ్ఞ - తపసాం
- సర్వ - లోక - మహేశ్వరం
- సుహృదం సర్వ - భూతానాం
- జ్ఞాత్వామామ్ శాంతిముచ్యతిః
- ( BG. 5.29)
ఇది శాంతి పద్ధతి. కృష్ణుడు చెప్తారు. మీరు ఆమోదించండి. "నేను ఆనందించే వాడిని మీరు ఆనందించే వారు కాదు మీరు ఆనందించేవారు కాదు. మీరు అధ్యక్షుడిగా ఉండవచ్చు లేదా మీరు కార్యదర్శి కావచ్చు. మీరు ఏమైనా కావచ్చు. కానీ మీరు ఆనందించేవారు కాదు. కృష్ణుడు ఆనందించేవాడు. మనము దానిని అర్థం చేసుకోవాలి. ఇలా మీరు... నేను రాబోయే ముందు ఆంధ్ర రిలీఫ్ కమిటీ నుండి వచ్చిన ఒక లేఖకు సమాధానము ఇచ్చి వచ్చాను కృష్ణుడు సంతృప్తిగా లేకపోతే ఈ సహాయక కమిటీ ఏమి చేస్తుంది కేవలం కొంత నిధులను సేకరించడము ద్వారా? కాదు, అది సాధ్యం కాదు. ఇప్పుడు వర్షం పడుతోంది. ఇప్పుడు మీరు ప్రయోజనము పొందుతారు. వర్షం కృష్ణుడి మీద ఆధారపడి ఉంటుంది. నిధులు సేకరించే మీ సామర్థ్యం మీద ఆధారపడి లేదు.