TE/Prabhupada 0119 - ఆత్మ మరణించదు

Revision as of 18:38, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.1-10 and Talk -- Los Angeles, November 25, 1968


ప్రభుపాద: అవును. శ్రీమతి: అప్పుడు వయస్సు ఎంత. ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, మీరు ముసలివారు ఆవుతారా? ప్రభుపాద: లేదు, ఆత్మ ముసలిది కాదు. శరీరం మారుతుంది, ఇది పద్ధతి. ఇది వివరించడం జరుగుతుంది,

dehino 'smin yathā dehe
kaumāraṁ yauvanaṁ jarā
tathā dehāntara-prāptir
dhīras tatra na muhyati
(BG 2.13)


ఆత్మ మరణించదు. శరీరం మారుతుంది. అర్థం చేసుకోవాలి. శరీరం మారుతుంది. ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోగలరు. మీ చిన్ననాటి శరీరంలో ఈ చిన్న పిల్లవాడి వలె వేరొక శరీరము వున్నది. ఆ చిన్న పాప అమ్మాయిగా మరిన్నప్పుడు, అది వేరొక శరీరం అవ్వుతుంది. కానీ ఆత్మ ఈ శరీరంలో ఆ శరీరంలో ఉన్నాది. ఆత్మ మారదు అనటానికి ఇది రుజువు, శరీరం మార్పు చెందుతుంది. ఇది రుజువు. నా బాల్యం గురించి నేను ఆలోచిస్తున్నాను. అంటే నేను అప్పుడు ఇప్పుడు ఒక్కడినే. అప్పడు బాల్యములో ఉన్నాను. నా బాల్యంలో నేను ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను అని గుర్తు ఉంది. కానీ ఆ చిన్ననాటి శరీరం ఇక లేదు. అది పోయింది. అందువల్ల నా శరీరం మారిపోయింది, కానీ నేను మారలేదు. అది కాదా? ఇది సరళమైన నిజం. ఈ శరీరం మారుతుంది, ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను. నేను వేరొక శరీరంలోకి ప్రవేశించవచ్చు, అది పట్టింపు లేడు, కానీ నేను ఉంటాను. Tathā dehāntara-prāptir dhīras tatra na muhyati (BG 2.13). ప్రస్తుత పరిస్థితులలో కూడా నేను నా శరీరాన్ని మారుస్తున్నాను, అదేవిధంగా, అంతిమ మార్పు నేను చనిపోయినట్లు కాదు. నేను మరొక శరీరములోనికి వెళ్ళుతాను ... అది కూడా వివరిoచబడినది. vāsāṁsi jīrṇāni yathā (BG 2.22) నేను సన్యాసిగా మరనప్పుడు , నేను ఒక్క పెద్దమనిషి లాగా దుస్తులు ధరించాను. ఇప్పుడు నేను నా దుస్తులను మార్చాను. అంటే నేను చనిపోయానని కాదు. లేదు, నేను నా శరీరమును మార్చుకున్నాను. అంతే. నేను నా దుస్తులను మార్చుకున్నాను