TE/Prabhupada 0304 - మాయ భగవంతుడిని కప్ప లేదు
Lecture -- Seattle, October 2, 1968
ప్రభుపాద: చదువుతు ఉండండి.
తమలా కృష్ణ: "ఏకకాలంలో ఏకత్వం వైవిధ్యం ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉంటుoది జీవులు మరియు దేవుని మధ్య. "
ప్రభుపాద: ఇప్పుడు ఏకకాలంలో ఈ ఏకత్వం వైవిధ్యం, ఇదే ఉదాహరణ, భూమిని తీసుకోండి. ఎవరో చెప్పారు, ", నేను భాగమును నీరుగా చుసాను." ఎవరో చెప్తురు, "లేదు. ఆ భాగమును భూమిగా నేను చూశాను." కావునా ఒకే కాలంలో ఏకత్వం వైవిధ్యం. ఒకే కాలంలో ఏకత్వం వైవిధ్యం. మన స్థానము ... మనము ఆత్మ కృష్ణుడు, దేవుడు, ఆత్మ ... అయిన సంపూర్ణమైన ఆత్మ నేను ఆ ఆత్మ యొక్క కణమును. సూర్యుడు, సూర్యుడి భూగోళము, సూర్యరశ్మి వలె ప్రకాశించే కణాల అణువులు, అవి కూడా సూర్యకాంతి. మనకు సూర్యరశ్మి కిరణాలు సూర్యరశ్మి అణు కణాల కలయిక వలన ఇవ్వబడినవి. మనము కూడా సూర్యుని భూగోళము యొక్క కణాలవలె మెరుస్తూ ఉంటాము, కానీ మనము పూర్తిగా సూర్యునితో సమానంగా లేము. ప్రకాశించే కణాలు, సూర్యరశ్మి యొక్క అణువులు, సూర్యుని భుగోళముతో పరిమాణంలో సమానంగా ఉండవు, కానీ లక్షణములు అవిధముగానే ఉంటాయి. అదేవిధంగా, మనము జీవులము, మనము ఆ మహోన్నతమైన ఆత్మ, కృష్ణుడు లేదా దేవుడు యొక్క చిన్న కణాలము. అందువలన మనం కూడా ప్రకాశిస్తాము. మనకు అవే లక్షణములు ఉన్నాయి. బంగారం యొక్క ఒక చిన్న కణం బంగారం వలె ఉన్నాది. అది ఇనుము కాదు. అదేవిధంగా, మనము ఆత్మ; మనము ఒకటి. కానీ ఎందుకంటే నేను చిన్న కణము కనుక ... అదే ఉదాహరణ . తటస్తా భాగం చాలా తక్కువగా ఉన్నది, ఇది కొన్నిసార్లు నీటిచే కప్పబడి ఉన్నది. కానీ భూమి యొక్క పెద్ద భాగం, ఇది ఏ నీరు లేకుండా ఉంది. అదేవిధంగా, మాయ చిన్న కణామైన ఆత్మను కప్ప గలదు, కానీ మయా దేవుడిని కప్ప లేదు. అదే ఉదాహరణ, ఆకాశం, సూర్యరశ్మి. సూర్యరశ్మి, సూర్యరశ్మిలో ఓక్క భాగం, మేఘంతో కప్పబడి ఉంది. కానీ మీరు విమానం ద్వారా వెళ్ళి ఉంటే, జెట్ విమానం, మేఘము పైన, మీరు సూర్యరశ్మి ఏ మేఘము లేకుండా ఉన్నది అని కనుగొంటారు. మేఘం మొత్తం సూర్యుడిని కప్ప లేదు. అదేవిధంగా, మాయ దేవాదిదేవుని కప్పలేదు. మాయా బ్రాహ్మణ్ యొక్క చిన్న కణములను కప్పగలుగుతుంది. సిద్ధాంతం, మాయావాదా సిద్ధాంతం: నేను ఇప్పుడు మాయ ద్వారా కప్ప బడ్డాను. నేను మాయ నుండి బయిటకు వచ్చిన వెంటనే నేను దేవునిలో ఒకటిగా ఉంటాను ... మనము అదే విధంగా దేవునిలో ఒకటిగా ఉన్నాము. సూర్యరశ్మి సూర్యుని భూగోళము లాగే, లక్షణములో తేడా లేదు. సూర్యుడు ఎక్కడైతే ఉంటాడో సూర్యరశ్మి ఉంటుంది, కానీ చిన్న కణాలు, సూర్యరశ్మి యొక్క అణువులు, సూర్యుని పూర్తి భూగోళమునకు సమానంగా ఉండవు దీనిని ఈ అధ్యాయంలో చైతన్య మహాప్రభు వర్ణించారు.