TE/Prabhupada 0387 - గౌరాoగేరా దుటి పదకు భాష్యము
Purport to Gaurangera Duti Pada -- Los Angeles, January 6, 1969
Gaurāṅgera saṅge-gaṇe, nitya-siddha boli māne. చైతన్య ప్రభువుల యొక్క సహచరులను ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు సాధారణ బద్ధ జీవులు కాదు వారు ముక్తి పొందిన జీవులు Nitya-siddha bole māni ఇక్కడ మూడు కోవలకు చెందిన భక్తులు కలరు. అందులో మొదటిది సాధన సిద్ధ అంటారు సాధన సిద్ధి అంటే భక్తి యుక్త సేవ యొక్క ఖచ్చితమైన సూత్రాలను అనుసరించి ఒక వ్యక్తి భక్తిమార్గంలో సంపూర్ణుడు అయితే అతనిని సాధన సిద్ధ అంటారు ఇక రెండవ కోవకు చెందినవారిని కృపాసిద్ధ అంటారు కృపాసిద్ధ పరిపూర్ణమైన నియమాల సూత్రాన్ని అనుసరించకపోయినా ఆచార్యుని కృప ద్వారా లేక భక్తుడి దయవలన లేదా కృష్ణుని ద్వారా అతను పరిపూర్ణమైన దశకు చేరుకోగలరు. ఇది ప్రత్యేకమైనది. చివరి కోవకు చెందిన వారిని నిత్య సిద్ధ అంటారు. నిత్యసిద్ధ అంటే కలుషితమైన వారు కాదు. సాధన సిద్ధ, కృపాసిద్ధ కి చెందినవారు భౌతికతత్వం ద్వారా కలుషితం అవుతారు.నియంత్రణ సూత్రాలను అనుసరించడం ద్వారా లేదా ఎవరో భక్తుడి దయవలన, ఆచార్యుని కృపవలన వారు పరిపూర్ణమైన దశకు ఎదగగలరు. కానీ నిత్యసిద్ధకి చెందినవారు ఎప్పటికీ కలుషితం కాలేరు, వారు ఎల్లప్పుడూ ముక్త జీవులు. శ్రీ అద్వైత ప్రభు, శ్రీవాస, గదాధర, నిత్యానంద ప్రభువులే చైతన్య ప్రభువు యొక్క సహచరులు, వీరు అందరూ విష్ణు తత్వానికి చెందినవారు. వారు మాత్రమే ముక్త జీవులు. విముక్తి పొందిన వాళ్లే కాదు గోస్వాములు కూడా ఇంకా చాలామంది గోస్వాములు కలరు, వారు కూడా ఎప్పటికీ ముక్త జీవులు. అందువల్ల చైతన్య మహాప్రభు సహచరులు ఎల్లప్పుడూ ముక్త జీవులు అని ఎవరైతే అర్థం చేసుకుంటారో Nitya-siddha bale māni, sei yaya vrajendra suta-pāśa వెంటనే వారు కృష్ణధామములోకి ప్రవేశించడానికి అర్హత పొందుతారు
ఆ తరువాత అతను ఏం చెప్పారంటే gauḍa-maṇḍala-bhūmi, yebā jāni cintāmaṇi గౌడమండల అంటే పశ్చిమబెంగాల్ లో చైతన్య మహాప్రభు లీలల కోసం వారు ఏర్పాటు చేసుకున్న ధామము. నవద్వీప నగరంలో చైతన్య మహాప్రభు జన్మదిన వార్షికోత్సవ వేడుకలలో పాల్గొనడానికి భక్తులు వెళ్తారు. అక్కడ చైతన్య మహాప్రభు తిరిగిన ప్రదేశాలు అన్ని తిరిగేవారు. దానికి తొమ్మిది రోజుల సమయం పడుతుంది. బెంగాల్ లోని ఈ ప్రదేశాన్ని గౌడీయ మండల అని పిలుస్తారు. నరోత్తమ దాస ఠాకూరు ఏమి అన్నారు అంటే ఇక్కడ ఎటువంటి తేడా లేదు అని ఎవరు అర్థం చేసుకుంటారో బెంగాల్ లోని ఈ ప్రదేశానికి, మరియు వృందావనం లోని ప్రదేశాలకు ఎటువంటి తేడా లేదు అని ఎవరైతే అర్థం చేసుకుంటారో tāra haya vraja-bhūmi vāsa, ఇక్కడ జీవించడం అంటే వృందావనంలో జీవించడం అంత మంచిది. అప్పుడు అతను gaura-prema rasārṇarve. అని చెప్తారు చైతన్య మహాప్రభు యొక్క కార్యక్రమాలు ఎలా వుంటాయంటే కృష్ణుని ప్రేమ రసా సముద్రం ఎలా ఉంటుందో అలానే ఉంటాయి అందువలన ఈ సముద్రంలో ఎవరైతే మునుగుతారో gaura-prema-rasārṇave, sei taraṅga yebā ḍube. ఉదాహరణకు మనం సముద్రపు స్నానానికి వెళ్తే నీటిలో ఆడుకుంటూ,సముద్రపు అలలలో మునిగి తేలుతూ ఉంటాము అదేవిధంగా, చైతన్య మహాప్రభు భగవంతుని ప్రేమను పంచి పెడుతున్న సముద్రము యొక్క అలలలో ఆటలు ఆడుతున్న వ్యక్తి, ఆనందమును తీసుకొనే వక్తి, మునిగే వ్యక్తి, అలాంటి వ్యక్తి వెంటనే కృష్ణుడికి రహస్య భక్తుడు అవుతాడు Sei rādhā-mādhava-antaraṅga.అంతరంగ. అంటే సాధారణ భక్తులు కారు, వారు రహస్య భక్తులు నరోత్తమ దాస ఠాకూర్ చెప్తున్నారు gṛhe vā vanete thāke. చైతన్య మహాప్రభు ఉద్యమ తరంగాలలో ఆనందం తీసుకుంటున్న అలాంటి భక్తుడు ఎందుకంటే అతను భగవంతునికి అత్యంత రహస్యమైన భక్తుడు అవుతాడు
అందువలన నరోత్తమ్ దాస ఠాకూర్ చెప్పారు! అటువంటి భక్తుడు ఏది పట్టించుకోరు అతను సన్యాస ఆశ్రమములో వుండవవచ్చు లేదా అతను ఒక గృహస్తుడు అయినా కూడా. Gṛha అంటే గృహస్తుడు కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమం చెప్పదు, ప్రతి ఒక్కరు సన్యాసము తీసుకోవాలని చెప్పరు. మాయవాది సన్యాసులు, నిరాకారవాదులు, శంకరాచార్య వంటివారు ఈ నియమము మొదట ఉంచుతారు నీవు మొదట సన్యాస ఆశ్రమమును స్వీకరించి, అప్పుడు ఆధ్యాత్మిక పురోగతి గురించి మాట్లాడు. కాబట్టి శంకర సాంప్రదాయములో ఎవ్వరిని ప్రామాణికమైన నిరకారవాదిగా అంగీకరించరు అతను సన్యాస ఆశ్రమమును అంగీకరిస్తే తప్ప. కానీ ఇక్కడ, ఈ చైతన్య ఉద్యమంలో అలాంటి షరతు లేదు. అద్వైత ప్రభు, అతను గృహస్థుడు. నిత్యానంద, అతను గృహస్థుడు. గదాధర ఇతను కూడా గృహస్థుడు. మరియు శ్రీవాస అతను కూడా గృహస్థుడు . మరియు చైతన్య మహాప్రభు కూడా రెండుసార్లు వివాహం చేసుకున్నారు. కనుక ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు నరోత్తమ దాస ఠాకూరు చెప్పారు సన్యాస ఆశ్రమమును తీసుకున్నా లేదా గృహస్త జీవితంలో ఉన్నా, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతను నిజానికి చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటే, మరియు నిజానికి అది ఏమిటి అని అర్ధం చేసుకొంటే అతను అటువంటి భక్తి మహాసముద్రపు తరంగాలలో స్ఫూర్తి తీసుకుంటూ వుంటే, అటువంటి వ్యక్తి ఎప్పుడూ విముక్తుడై ఉంటాడు మరియు నరోత్తమ దాస ఠాకూరు అతని సాంగత్యమును పెంచుకుంటూ ఉండాలని ఆశిస్తున్నాడు ఈ పాట యొక్క అర్థం మరియు ప్రధానాంశము ఇదే