TE/Prabhupada 0403 - విభావరీ శేషకు భాష్యము

Revision as of 06:37, 17 February 2019 by Anurag (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Purport to Vibhavari Sesa


కృష్ణుని రామ అని కూడా పిలుస్తారు. భగవంతుడు ,ఆయన రామావతారం దాల్చినప్పుడు రావణుని సంహరించాడు కాబట్టి రావణాంతకర అని పిలువబడ్డాడు. మాఖన-తస్కర, వృందావననంలో అతన్ని వెన్న దొంగ అని పిలుస్తారు. తన చిన్ననాటి లీలలలో, అతను గోపీకల యొక్క కుండల నుండి వెన్నని దొంగిలించేవాడు. అది ఆయన దివ్యమైన ఆనందలీల , అందుచే అతను మాఖన-తస్కర, మాఖననచోర అని పిలువబడ్డాడు. గోపీ-జన-వస్త్ర-హారి, అతను గోపీకలు స్నానం చేస్తున్నప్పుడు వారి వస్త్రములను దొంగిలించాడు. అది చాలా నిగూడ లీల. వస్తవానికి గోపీకలు కృష్ణుడిని కోరుకున్నారు. అందుకై వారు కాత్యాయని-దేవిని ప్రార్థించారు. ఎందుకంటే కృష్ణుడు తన వయస్సు గల గోపికలందరికీ ఆకర్షణీయం గా కనిపించాడు , కాబట్టి వారు ఆయన్ని భర్తగా కోరుకున్నారు. కృష్ణుడు గోపికల తోటివాడే.అయితే అతను అంత మంది గోపీకలకు ఎలా భర్త కాగలడు? కానీ అతను అంగీకరించాడు. ఎందుకంటే గోపికలు కృష్ణునికి భార్యలుగా కాదలచుకున్నారు, అందువలన,కృష్ణుడు వారి ప్రతిపాదనను అంగీకరించాడు. వారిని దయ చూపడానికి, అతను వారి దుస్తూలు దొంగిలించాడు, ఎందుకంటే భర్త భార్య యొక్క ఒంటి మీద బట్టలను తొలగించగలడు. ఎవరూ (వేరొకరు) వాటిని తాకలేరు. అది కృష్ణుని అసలు ఉద్దేశం, కానీ ప్రజలకు అది తెలియదు. అందువల్ల కృష్ణ-లీలలను సాక్షాత్కారము పొందిన వ్యక్తి నుండి వినాలి, లేదా ఆ భాగాన్ని(లీలను) పక్కనపెట్టాలి. లేకపోతే కృష్ణుడు వస్త్రాలు అపహరించాడని మనం తప్పుగా అర్థం చేసుకుంటాము, కృష్ణుడిది చాలా తక్కువ స్థాయి.ఆయన స్త్ర్హీ లోలుడు ,ఇలా భావిస్తాం. కానీ అది కాదు. ఆయన దేవాదిదేవుడు. ప్రతి భక్తుని కోరికను నెరవేరుస్తాడు. గోపికలను నగ్నంగా చూడటానికి కృష్ణునికి ఏ అవసరమూ లేదు, కాని వారు ఆయనకు భార్యలుగా అవాలని కోరుకున్నారు ,కాబట్టి, వారి కోరిక నెరవేరింది. సరే, "అవును, నేను మీ భర్తను. నేను మీ వస్త్రాలను తీసుకున్నాను. ఇప్పుడు మీరు మీ వస్త్రాలను తీసుకొని ఇంటికి వెళ్లండి." కాబట్టి అతన్ని గోపి-జన-వస్త్ర-హారి అంటారు. Brajera rākhāla, gopa-vṛnda-pāla, citta-hārī vaṁśī-dhārī. బ్రజేర -రాఖాల, వృందవనములోని గోపబాలుడు, మరియు గోప-వృంద-పాల, అతని కార్యం గోపాలురను సంతృప్తి పరచడం, అతని తండ్రి, చిన్నాన్నతో సహా, వారందరూ గోవులను పాలిస్తుండేవారు, వారిని సంతృప్తిపరచడమే ఆయన కార్యం. కాబట్టి అతను గోప-వృంద-పాల. Citta-hārī vaṁśī-dhārī, అతను వేణువు నాదం చేసినప్పుడు, అది ప్రతి ఒక్కరి హృదయాలను అపహరిస్తుంది. అతను ప్రతి ఒక్కరి మనస్సును అపహరిస్తున్నాడు. యోగీంద్ర-వందన, కృష్ణుడు బృందావనంలో గోపబాలునిగా ఆటలాడుతున్నప్పటికీ, ఎలాగంటే పల్లెటూరి అబ్బాయి తన స్నేహితులతో పరిహాసాలడుతున్నట్లు, అయినా మరోవైపు, అతడు యోగీంద్ర-వందన. యోగీంద్ర అంటే గొప్ప యోగి, మర్మమైనవాడు. Dhyānāvasthita-tad-gatena manasā paśyanti yaṁ yoginaḥ ( SB 12.13.1) యోగులు తమ ధ్యానం ద్వారా ఎవరిని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు? వారు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నది ఈ కృష్ణున్నే. వారు కృష్ణుడిపై వారి మనసును కేంద్రీకరించే స్థాయికి వచ్చే వరకు, వారి యోగ సూత్రం, లేదా మర్మిక శక్తి, నిష్ఫలమే. Yoginām api sarveṣāṁ mad-gata-antara ( BG 6.47) యోగి, మొదటి తరగతి యోగి, ఎల్లప్పుడూ తన హృదయంలో కృష్ణుని ధ్యానించాలి. అదే యోగ పరిపూర్ణత. అందువలన యోగీంద్ర-వందన అని పిలువబడ్డాడు, śrī-nanda-nandana, braja-jana-bhaya-hārī. ఆయన గొప్ప గొప్ప యోగులచే ఆరాధించబడినప్పటికీ, అతను వృందావననంలో నంద మహారాజు కుమారునిగా నివసిస్తాడు, కృష్ణుని యొక్క సంరక్షణలో బృందావన వాసులు సురక్షితంగా ఆనందంగా వున్నారు. Navīna nīrada, rūpa manohara, mohana-vaṁśī-vihārī. నవీన నీరద, నీరద అంటే మేఘం, అతని రంగు తొలకరి మేఘము లాగ ఉంటుంది. తొలకరి మేఘము, నల్లని, రూపం. అయినా అతను చాల అందంగా ఉన్నాడు. సాధారణంగా ఈ భౌతిక ప్రపంచంలో నలుపు రంగు అంత అందంగా పరిగణించబడదు, ఆయన నలుపువర్ణంలో వున్నా కూడా,ఆయన శరీరం ఆధ్యాత్మికము, అతను విశ్వాకర్షకుడు. రూప మనోహర. మోహన-వంశిశ-విహారీ, అతను తన వేణువును ధరించినప్పుడు, అతను నలుపు వర్ణంలో వున్నప్పటికీ కూడా, అతను అందరికీ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాడు. Yaosodā-nandana, kašsa-nisūdana, అతను యశోదమాత కుమారుడిగ చాలా ప్రసిద్దిచెందాడు , అతను కంస సంహారి, మరియు నికుంజ-రాస విలాసి, అతడు నీకుంజములలో రాసనృత్యం చేస్తాడు.వంశీవట,నికుంజ. కదంబ-కానన, రాస-పరాయణ, అనేక కదంబ వృక్షలు ఉన్నాయి. కదంబ అనేది వృందావనములో ప్రత్యేకించి పెరిగే పుష్పము, చాలా సువాసనతో కూడిన అందమైన, ఘనమైన వలయాకార పుష్పం. కదంబకానన, అతను ఈ కదంబ చెట్టు క్రింద తన రాస నృత్యాన్ని ఆస్వాదించేవాడు. Ānanda-vardhana prema-niketana, phula-śara-yojaka kāma. గోపికల కామవాంఛలను పరిపూర్ణం చేసేవాడు మరియు వారికి దివ్యానందాన్ని కలిగించేవాడు. అనంద-వర్ధన ప్రేమ-నికేతన, ఎందుకంటే అతను ఆనంద నిధి. కృష్ణుడు ఆనంద నిధి కాబట్టి గోపికలు ఆయనతో ఆనందాన్ని ఆస్వాదించడం కోసం వచ్చేవాళ్ళు. ఎలాగైతే నీటిని కలిగివున్న ఒక సరస్సు నుండి నీటిని తీసుకెళ్లడనికి మనము అక్కడికి వెళ్ళినట్లు. అదేవిధంగా, మనం వాస్తవానికి ఆనందకరమైన జీవితం పొందదలచుకుంటే, దానిని మనం కృష్ణుడు అనే ఆనందనిధి నుండి పొందాలి. అనంద-వర్ధన, ఆ ఆనందం పెరుగుతూపోతుంది. భౌతిక ఆనందం తగ్గుతూవుంటుంది. మీరు భౌతిక ఆనందాన్ని సుదీర్ఘకలం ఆనందించలేరు, అది తగ్గిపోతుంది, కానీ ఆధ్యాత్మిక ఆనందం, మీరు దానిని ఆనంద నిధి అయిన కృష్ణుని నుంచి పొందదలిస్తే ఆ ఆనందం పెరుగుతూ ఉంటుంది. మీ ఆనందసామర్థ్యం పెరుగుతుంది, మీరు మరింత ఆనందం పొందుతారు. మీరు మీ ఆనందసామర్థ్యం పెంచుకుంటే, పెంచాలని కోరితే, సరఫరా కూడా నిరంతరం ఉంటుంది. దానికి పరిమితి లేదు. Phula-śara-yojaka kāma, అతడు దివ్య మన్మథాకారుడు. మన్మథుడు, తన విల్లుతో బాణంతో, అతను భౌతిక ప్రపంచం యొక్క కామవాంఛలను పెంచుతాడు. అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో, కృష్ణుడు సాటిలేని మన్మథుడు. అతను గోపీకల యొక్క కామవాంచలను పెంచుతాడు. వారు ఆయన చెంతకు చేరే వారు,వారివురు కలిసి సుఖించేవారు.ఆ ఆనందం తరగనిది. వారు వారి కోరికను పెంచుకునేవారు, కృష్ణుడు వారికి ఎటువంటి భౌతిక కాలుష్యం అంటని దివ్యానందాన్ని వారికి ఒసగేవాడు. వారు నృత్యం చేశారు, అంతే. Gopāṅganā-gaṇa, citta-vinodana, samasta-guṇa-gaṇa-dhāma. అతను ముఖ్యంగా గోపాంగనలకు ఆకర్షణీయుడు. గోపాంగనా అనగ వ్రజ-దామము యొక్క నృత్యకారులు. opāṅgaṇa-gaṇa, citta-vinodana, వారు కేవలం కృష్ణ ధ్యానంలోనే ఉండేవారు. వారు కృష్ణుని పట్ల చాలా ఆకర్షితులయ్యారు. అనుబంధాన్ని పెంచుకున్నారు, వారు తమ చిత్తముయందు కృష్ణుని యొక్క రూపాన్ని క్షణకాలం కూడా మరువలేరు. చిత్తవినోదన,ఆయన గోపికల యొక్క హృదయాలను ఆక్రమించాడు.కాబట్టి చిత్తవినోదన. సమస్త-గుణ-గణ-దామ, అతను సకల ఆధ్యాత్మిక లక్షణాల నిధి. Yamunā-jīvana, keli-parāyaṇa, mānasa-candra-cakora. మనస-చంద్ర-చకోర, చకోర అని పిలువబడే పక్షి ఉంది. అది చంద్రకాంతి చేత ఆకర్షితమౌతుంది. అదేవిధంగా, కృష్ణుడు గోపీకల మద్యలో గల చంద్రుడు, వారు కేవలం అతనివైపే ఆకర్షితులవుతారు. మరియు అతను యమునా నదికి జీవము, ఎందుకంటే అతను యమునా నదిలో ఆటలాడుతూ ఆనందించేవాడు. Nāma-sudhā-rasa, gāo kṛṣṇa-yaśa, rākho vacanta. కాబట్టి,భక్తివినోద ఠాకురుల వారు ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నారు, ఇప్పుడు మీరు భగవంతుని యొక్క ఈ దివ్య నామాలను కీర్తించండి. Rākho vacana mano: "నా ప్రియమైన మనసా, దయచేసి నా ఈ మాటను విను. తిరస్కరించవద్దు, కృష్ణుడి యొక్క ఈ పవిత్ర నామాలను నిరంతరం కీర్తించు. "