TE/Prabhupada 0755 - సముద్రపు బాధితుడు
Lecture on SB 6.1.7 -- Honolulu, May 8, 1976
ప్రభుపాద: మీరు భగవద్గీత చదివారు. సర్వ-యోనిషు: అన్ని జీవ రాశులలో జన్మించడము. Sarva-yoniṣu sambhavanti mūrtayo yaḥ ( BG 14.4) వేర్వేరు జీవన రూపాలు, 84,00,000 ఉన్నాయి. వారు అందరు జీవులు, కానీ కర్మ ప్రకారం, వారికి వేర్వేరు శరీరాలు వచ్చాయి. ఇది వ్యత్యాసం. ఉదాహరణకు మనము నా ఎంపిక ప్రకారం వేర్వేరు దుస్తులను పొందాము, అదేవిధముగా, నా ఎంపిక ప్రకారం వేర్వేరు శరీరాలు మనకు లభిస్తాయి. ఈ ఉదయం మనము బాధితుల గురించి మాట్లాడుకున్నాము... ఏమి పిలుస్తారు? సముద్రపు బాధితులా ?
భక్తులు: నీటిలో తిరిగేవారు.
ప్రభుపాద: నీటిలో తిరిగేవారు, అవును. (భక్తులు నవ్వు) సర్ఫర్. నేను నీటిలో తిరిగేవారిని సఫరర్ "బాధితుడు" అని పిలుస్తాను. "సముద్రపు-బాధితుడు." (నవ్వు) సముద్ర-నీటిలో తిరిగేవారు, అది ఆచరణాత్మకమైనది, ఎందుకంటే మనము పరిస్థితిని సృష్టిస్తున్నాము దాని ద్వారా మనం ఒక చేప అవుతాము. (నవ్వు) అవును. కాలుష్యం. మీరు కావాలనే ఒక వ్యాధితో కలుషితమైతే, మీరు తప్పక ఆ వ్యాధి నుండి బాధపడతారు. భగవద్గీతలో Kāraṇaṁ guṇa-saṅgo 'sya sad-asad janma-yoniṣu ( BG 13.22) వివిధ రకాల జీవులు ఎందుకు ఉన్నాయి? కారణం ఏంటి? ఆ కారణం అంటే కారణం. కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు... Kāraṇaṁ guṇa-saṅgo 'sya sad-asad janma-yoniṣu. Prakṛteḥ kriyamāṇāni ( BG 3.27) Prakṛti-stho 'pi puruṣaḥ bhuñjante tad-guṇān (BG 13.22). కారణం... మనము రోగముతో బాధపడుతున్నాము... ప్రకృతి యొక్క చట్టం చాలా ఖచ్చితమైనది, మీకు ఏదైనా సంక్రమించి ఉంటే, ఏదైనా వ్యాధి కొంత కాలుష్యం, అప్పుడు మీరు బాధపడాలి. ఇది ప్రకృతి యొక్క చట్టం సహజముగా జరుగుతుంది. Kāraṇaṁ guṇa-saṅgo 'sya.
కాబట్టి మూడు విషయాలు భౌతిక ప్రకృతిలో -సత్వ గుణము, రజో గుణము, తమోగుణము ఉన్నాయి. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత సేపు, puruṣaḥ prakṛti-stho 'pi bhuñjante tad-guṇān. మనము కొన్ని ప్రదేశాల్లో ఉంటే, మనము ఆ ప్రదేశము యొక్క గుణాలతో ప్రభావితం అయితీరుతాము. కాబట్టి మూడు గుణాలు ఉన్నాయి: సత్వ గుణము, రజో-గుణము... మనము సత్వ గుణములో ఉండాలి, లేదా రజో గుణము లేదా తమోగుణము తో. ఇప్పుడు మూడు × మూడు, అది తొమ్మిది అవుతుంది, తొమ్మిది × తొమ్మిది, ఇది ఎనభై ఒకటి అవుతుంది. కాబట్టి మిశ్రమం. కేవలము రంగు వలె. మూడు రంగులు ఉన్నాయి: నీలం, ఎరుపు పసుపు. ఇప్పుడు, తయారీ రంగు నిపుణులైన వారు, కళాకారులు, వారు ఈ మూడు రంగులను రకరకములుగా కలపుతారు మరియు వాటిని ప్రదర్శిస్తారు. అదేవిధముగా, గుణాలు లేదా వాటి కలయిక వలన, సాంగత్యం - kāraṇaṁ guṇa-saṅgo 'sya - మనము వివిధ రకాల శరీరాలను పొందుతున్నాము. కాబట్టి మనం చాలా రకాల శరీరాలను చూస్తాము. Kāraṇaṁ guṇa-saṅgo 'sya ( BG 13.22) ఈ విధంగా చాలా ఆనందము తీసుకుంటున్న వ్యక్తి, చేపల వలె సముద్రంలో నృత్యం చేస్తున్నాడు, అందువలన ఆయన ఆ ప్రకృతి యొక్క గుణాలను కలుషితం చేస్తున్నాడు, తద్వారా ఆయన తదుపరి జీవితములో ఆయన ఒక చేప అవుతాడు. మహాసముద్రంలో అతని నృత్యం చాలా స్వేచ్చగా ఉంటుంది. (నవ్వు) ఇప్పుడు, అది మానవుని దశకు రావడానికి లక్షలాది సంవత్సరములు తిరిగి తీసుకుంటుంది. Jalajā nava-lakṣāṇi sthāvarā lakṣa-viṁśati. ఆయన చేపల జీవితం జన్మల గుండా వెళ్ళాలి. 9,00,000 వివిధ జీవన జాతులు ఉన్నాయి. అప్పుడు మీరు తిరిగి భూమికి వస్తారు- మీరు చెట్లు, మొక్కలు మొదలైనవి. ఇరవై లక్షల వివిధ రూపాల ద్వారా మీరు వెళ్ళాలి. అది పరిణామం. డార్విన్ యొక్క పరిణామ సిద్ధాంతం, సంపూర్ణంగా వివరించబడలేదు. ఇది వేదముల సాహిత్యంలో వివరించబడింది. కాబట్టి కేవలం ఒక చెట్టు పది వేల సంవత్సరాలు నిలబడి ఉంది, మనము ఈ జీవితం గుండా వెళ్ళాలి. కానీ పరిపూర్ణ జ్ఞానం లేదు. మనం ఇప్పుడు చాలా మంచి అమెరికన్ శరీరం లేదా భారతీయ శరీరం అని ఆలోచిస్తున్నాం. లేదు. ఈ జీవితానికి వచ్చేందుకు చాలా సంవత్సరాలు పట్టింది. అందువల్ల శాస్త్రములు చెప్తాయి, labdhvā sudurlābhaṁ idaṁ bahu-sambhavānte ( SB 11.9.29) చాలా లక్షల సంవత్సరాల పాటు వేచి ఉన్న తర్వాత మీరు ఈ మానవ రూపాన్ని పొందారు. కాబట్టి దానిని దుర్వినియోగపరచవద్దు. అది వేదముల నాగరికత, మానవ జీవితాన్ని దుర్వినియోగపరచకూడదు