TE/Prabhupada 0962 - మనము భగవంతుణ్ణి ఖచ్చితమైన వాస్తవముగా తీసుకుంటాము
720000 - Lecture BG Introduction - Los Angeles
మనము భగవంతుణ్ణి ఖచ్చితమైన వాస్తవముగా తీసుకుంటాము కాబట్టి, నేను భగవద్గీత యధాతథము గురించి మాట్లాడతాను. భగవద్గీత చెప్పడానికి ఉద్దేశ్యం, వివరిస్తాను భగవద్గీతకు అనేక ఎడిషన్లు ఉన్నాయి. భగవద్గీత్ యొక్క స్పూర్తిని విడిచిపెట్టి, వారికి తోచినట్లు వారు వివరణ ఇస్తున్నారు కావున ఈ ప్రత్యేకమైన పేరు, 'యథాతథము' ముఖ్యమైనది, భగవద్గీత యొక్క ఏ ఇతర ఎడిషన్ లో కూడా రాయబడలేదు, అది 'యధాతథము' అని. ఈ సంబంధంలో, చికాగో విశ్వవిద్యాలయం యొక్క ప్రొఫెసర్ డిమోక్ ఒక ముందుమాట వ్రాశాడు, ఆయన థీమ్ ను విషయమును చాలా అభినందిస్తాడు. ఆయన ఇలా అంటాడు, "స్వామి భక్తివేదాంత యొక్క ఈ గీత మీద వ్యాఖ్యానము, అది చట్టబద్ధమైనది." ఆయన అంగీకరిస్తారు భగవద్గీత యథాతధము జ్ఞానం యొక్క గొప్ప పుస్తకము చట్టబద్దమైన ప్రస్తావన. ఆయన ఇలా కూడా అంటాడు, "అంత కంటే ఈ అనువాదంలో, పాశ్చాత్య రీడర్ కు కృష్ణుడు భక్తుడు తన సొంత గ్రంథాలను ఎలా అర్థం చేసుకుంటాడో చూడడానికి ప్రత్యేకమైన అవకాశం ఉంది. " కాబట్టి, కృష్ణుడి గురించి... భక్తులు వాస్తవానికి కృష్ణుడి పుస్తకం గురించి అర్థం చేసుకోవచ్చు. ఇతరులు, వారు భక్తుడు కాకపోతే, వారు ఎలా కృష్ణుడి గురించి అర్థం చేసుకోగలరు? కుటుంబానికి చెందిన ఒక సభ్యుని వలె, కుటుంబం యొక్క పెద్ద గురించి చాలా చక్కగా చెప్పగలరు; బయటివారు కుటుంబం గురించి ఎలా చెప్పగలరు? అది సాధ్యం కాదు. అదేవిధముగా, కృష్ణుడి గురించి, కృష్ణుని భక్తుడు చక్కగా మాట్లాడగలరు. ఇతరులు కాదు. ఇతరులకు కృష్ణుడి గురించి మాట్లాడే హక్కు లేదు, కృష్ణుడు కూడా, అర్జునుడు భగవద్గీత యొక్క సరైన విద్యార్థిగా ఒప్పుకుంటాడు. ప్రారంభంలో, కృష్ణుడు ఇలా అంటాడు, "నేను నిన్ను నా విద్యార్థిగా ఎంచుకున్నాను నీవు నా స్నేహితుడివి మరియు నీవు నా భక్తుడవు. " కాబట్టి, మరో మాటలో చెప్పాలంటే మనము అర్థం చేసుకోవచ్చు కృష్ణుడితో సన్నిహిత సంబంధాన్ని కలిగిన వారు భగవద్గీతను అర్థం చేసుకో గలరు. కృష్ణుడు చెప్పినట్లు, "నీవు నా ప్రియ మిత్రుడవు." ఆయన కృష్ణుడితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. భక్తుడు కాకుండా, ఎవరూ కృష్ణుడితో సన్నిహిత సంబంధం కలిగి ఉండలేరు. ఇవి అర్థం చేసుకోవలసిన అంశాలు.
కాబట్టి, భగవద్గీత ఐదు వేల సంవత్సరాల క్రితం చెప్పబడినది కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి. భగవంతుని అవగాహన చేసుకునే విజ్ఞాన శాస్త్రం ఈ భగవద్గీతలో ఉంది. భగవద్గీత భగవంతుని యొక్క శాస్త్రం. ఆ ప్రత్యేకమైన విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రతి దానికి శాస్త్రము, శాస్త్రీయ గ్రంధాలు ఉన్నాయి. అదేవిధముగా, భగవంతుని యొక్క విభిన్న రకాలైన అంశాలు ఉన్నాయి. సాధారణంగా, వారు దానిని ఒక ఆలోచనగా తీసుకుంటారు కానీ మనము దానిని ఆలోచనగా తీసుకోము. మనము భగవంతున్ని ఖచ్చితమైన వాస్తవముగా తీసుకుంటాము. మీరు నన్ను చూస్తున్నట్లుగా నేను నిన్ను చూస్తున్నాను. ఇది ఖచ్చితమైన వాస్తవం. అదేవిధముగా, భగవంతుని నీవు చూడవచ్చు, భగవంతుడు ఇప్పటికే మిమ్మల్ని చూస్తున్నాడు. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు కూడా భగవంతుడిని చూడగలరు. కాబట్టి ఆ పద్ధతి మనము అర్థం చేసుకోవాలి, భగవంతుడిని ఎలా చూడాలి. ఆ పద్ధతి అన్ని వేదముల గ్రంథాలలో పేర్కొనబడింది. ఆ పద్ధతిని భక్తి-యోగం అంటారు. కృష్ణుడు కూడా భగవద్గీత లో చెప్తాడు, bhaktyā mām abhijānāti yāvān yaś cāsmi tattvataḥ ( BG 18.55) ఎవరైనా కృష్ణుడి గురించి తెలుసుకోవాలని అనుకుంటే, ఆయన ఎవరు అని అప్పుడు ఒకరు భక్తి-యోగా పద్ధతిని అంగీకరించాలి. వివిధ రకాలైన యోగులు ఉన్నారు. యోగ అనేది భగవంతునితో తమని తాము అనుసంధానించుకొనుట. కావున, యోగ గురించి ఉహగాహన చేయడము మనకు సహాయం చేయదు. మీరు ఖచ్చితమైన యోగను తీసుకోవాలి. ఖచ్చితమైన యోగా అనేది కృష్ణ చైతన్యము