TE/Prabhupada 0702 - నేను ఆత్మ, శాశ్వతముగ. నేను ఈ పదార్ధమును కలుషితం చేశాను, అందుచే నేను బాధపడుతున్నాను
Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969
ప్రభుపాద: అవును?
శీలవతి: ప్రభుపాద, మీరు చెప్పారు ఎంతవరకు ఒకరు మైథునజీవితంలో నిమగ్నమయి ఉంటారో, వారు ఒక యోగి కాలేరు.
ప్రభుపాద: అవును.
శీలవతి: అయినప్పటికీ, మొన్నటి రోజు మీరు గృహస్థ జీవితం యొక్క సుగుణాలను పొగుడుతున్నారు , మీరు చెప్పారు, మీరు గృహస్థులుగా ఉన్న గొప్ప ఆచార్యుల పేర్లను కొందరిని పేర్కొన్నారు...
ప్రభుపాద: అవును, అది భక్తి-యోగ. ఈ సాధారణ యోగ పద్ధతిలో, ఈ అధ్యాయంలో వివరించబడిన విధముగా, బ్రహ్మచర్య జీవితాన్ని ఖచ్చితంగా అనుసరించాలి. కాని భక్తి-యోగ పద్ధతిలో ఆలోచన ఏమిటంటే మీరు కృష్ణుడి మీద మీ మనసు స్థిరముగా నిమగ్నము చేయాలి. కావున ఏ స్థితిలో ఉన్నా... గృహస్థ జీవితము అంటే మైథున సుఖములో నిమగ్నమవటము కాదు. గృహస్థుడు భార్యను కలిగి ఉండవచ్చు, లైంగిక జీవితం కలిగి ఉండవచ్చు, కాని పిల్లలను పొందుటకు మాత్రమే ఉన్నది, అంతే. గృహస్థుడు అంటే ఆయనకు హక్కు లభించినది వ్యభిచారమును చట్టబద్ధం చేయడానికి అని కాదు. అది గృహస్థుడు కాదు. గృహస్థుడు అంటే కేవలం మంచి పిల్లలను పొందటానికి లైంగిక జీవితాన్ని కలిగి ఉంటాడు, అంతే, అంతకు మించి కాదు. అది గృహస్థ జీవితము; పూర్తిగా నియంత్రించబడింది. గృహస్థుడు ఈ యంత్రాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా ఆయన దాన్ని ఉపయోగించవచ్చు అని కాదు. కాదు గృహస్థుడు, భర్త మరియు భార్య, ఇద్దరు కృష్ణ చైతన్యము కలిగి ఉన్నారు, కృష్ణ చైతన్యములో నిమగ్నమై ఉన్నారు, కాని వారికి ఒక పిల్లవాడు అవసరమైనప్పుడు, కృష్ణ చైతన్యము, అది అంతే. ఇది స్వచ్ఛంద గర్భనిరోధక పద్ధతి కూడా. ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు, అంతే. అంతకు మించి వద్దు కాబట్టి గృహస్థ జీవితము అంటే ఏ విధమైన నియంత్రణ లేకుండా లైంగిక జీవితము కలిగి ఉండటము. కాదు. కాని ఆధ్యాత్మిక జీవితం కోసం... ఆధ్యాత్మిక జీవితములో ఉన్నత స్థానము కోరుకుంటున్న వారు, మీరు ఈ భక్తి-యోగ పద్ధతిని, లేదా ఈ అష్టంగ-యోగ పద్ధతిని లేదా జ్ఞాన-యోగ పద్ధతిని అంగీకరించాలి, పరిమితి లేకుండా మైథున జీవితములో పాల్గొనుట ఎక్కడా లేదు. మైథున జీవితములో పాల్గొనుట అంటే మీరు తిరిగి రావాలని అర్థం. మీరు ఇంద్రియాలను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తే, అది భౌతిక జీవితము.
భౌతిక జీవితములో నేను చక్కని ఇంద్రియాలను కలిగి ఉన్నాను, నా ఇంద్రియాలను పూర్తిగా వీలైనంత వరకు ఆస్వాదిస్తాను.ఇది భౌతిక జీవితము. ఉదాహరణకు పిల్లులు, కుక్కలు, పందులు వలె. పందులు, అవి లైంగికంగా ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, అవి అది తల్లి లేదా సోదరి లేదా ఇది లేదా అది అని పట్టించుకోవు. మీరు చూడండి? ఇది శ్రీమద్-భాగవతములో చెప్పబడింది: nāyaṁ deho deha-bhājāṁ nṛloke kaṣṭān kāmān arhate viḍ-bhujāṁ ye ( SB 5.5.1) Viḍ-bhujām. Viḍ-bhujām, అంటే viṭ అంటే మలం, bhujām అంటే తినేవాడు. కాబట్టి మలం-తినేవాడి యొక్క ఇంద్రియ తృప్తి అనేది ఈ మానవ జీవితానికి ఉద్దేశించబడలేదు. మలము తినేవాడు అంటే ఈ పందులు. పంది యొక్క ఇంద్రియ తృప్తి ఈ మానవ రూపానికి సంబంధించినది కాదు. పరిమితి. అందువలన మానవ జీవితంలో వివాహ పద్ధతి ఉంది. ఎందుకు? ఈ వివాహము మరియు వ్యభిచారము ఏమిటి? వివాహ పద్ధతి అంటే లైంగిక జీవితమును పరిమితి చేయడము. వివాహ పద్ధతి అంటే మీకు భార్య ఉంది అని కాదు - ఏ చెల్లింపు లేకుండా మీరు నియంత్రణ లేని లైంగిక జీవితం కలిగి ఉండటము కాదు. లేదు, అది వివాహం కాదు. వివాహం అంటే మీ లైంగిక జీవితాన్ని పరిమితం చేయడం. ఆయన ఇక్కడ అక్కడ మైథున జీవితం కోసం వేటాడుతాడు? లేదు, మీరు అలా చేయకూడదు. మీ భార్య ఇక్కడ ఉంది, అది పిల్లవాడు కోసం మాత్రమే. ఇది పరిమితి.
నాలుగు విషయాలు ఉన్నాయి: loke vyavāyāmiṣa-madya-sevā nityā hi jantor na hi tatra codanā ( SB 11.5.11) Vyavāya- మైథున జీవితం, మాంసం తినడం, āmiṣa. āmiṣa అంటే మాంసం, చేపలు, గుడ్లు తినడం. కాబట్టి, vyavāya అంటే మైథున జీవితం. మైథున జీవితం మరియు మాంసం తినడం, మాంసాహారి ఆహారం. Āmiṣa ... Mada-sevā, నిషా. Nityāsu jantuḥ.. ప్రతి బద్దజీవునికి సహజముగా ఆసక్తి ఉంటుంది. Pravṛtti. కాని వ్యక్తులు దానిని నియంత్రించుకోవాలి. అది మానవ జీవితం. మీరు సహజ ఆసక్తి యొక్క తరంగాలలో మీరు ఉంటే, అది మానవ జీవితం కాదు. మీరు పరిమితం చేయాలి. మొత్తం మానవ జీవితం నియంత్రణ నేర్చుకోవడానికి ఉద్దేశించబడింది. అది మానవ జీవితం. ఇది ఖచ్చితమైన వేదముల నాగరికత. Tapo divyaṁ yena śuddhyet sattvam ( SB 5.5.1) తన ఉనికిని పవిత్రము చేసుకోవాలి. ఆ ఉనికి ఏమిటి? నేను ఆత్మ, ఎప్పుడూ ఉన్నాను, శాశ్వతముగా. నేను ఆత్మ, ఎప్పుడూ ఉన్నాను, శాశ్వతముగా.ఇప్పుడు నేను ఈ పదార్ధమును కలుషితం చేశాను, అందుచే నేను బాధపడుతున్నాను ఇప్పుడు నేను ఈ పదార్ధమును కలుషితం చేశాను, అందుచే నేను బాధపడుతున్నాను. అందుకని నేను పవిత్రము అవ్వాలి. ఉదాహరణకు మీరు వ్యాధి స్థితి నుండి స్వేచ్చను పొందవలసింది. మీకు జ్వరం వచ్చినప్పుడు మీరు చికిత్స పొందుతారు. నిరంతర ఆనందం కాదు. డాక్టర్ చెప్తాడు, "దీన్ని చేయవద్దు, దీనిని చేయవద్దు, దీనిని చేయవద్దు." అదే విధముగా ఈ మానవ జీవితం ఈ వ్యాధి యొక్క స్థితి నుండి బయటపడాలి - ఒక భౌతిక శరీరము కలిగి ఉన్నాము. మనం పరిమితం చేయకపోతే చికిత్స ఎక్కడ ఉంది? నివారణ ఎక్కడ ఉంది? మొత్తం పద్ధతి పరిమితి చేయడము. తపో దివ్యమ్ ( SB 5.5.1) కేవలం ఒకరి కార్యక్రమాలను, తపస్సులు, నిష్ఠ ఆధ్యాత్మిక సాక్షాత్కారము పై దృష్టిని కేంద్రికరించడము. ఇది మానవ జీవితం. కాని సామాజిక సమాజంలో వివిధ ఆశ్రమాలు ఉన్నాయి: బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్త, సన్యాస. మొత్తం పద్ధతి పరిమితం చేయడం. కాని గృహస్థ, గృహస్థుడు అంటే లైంగిక జీవితాన్ని పూర్తిగా పరిమితం చేయలేని వారికి చిన్న అవకాశము ఇవ్వడం. అంతే. గృహస్థ అంటే నియంత్రణ లేని లైంగిక జీవితం కాదు. మీకు ఈ వివాహిత జీవితం అలాంటిది అని తెలిసినట్లయితే, అది తప్పుడు భావన. మీరు జీవితంలో ఈ వ్యాధిగ్రస్త పరిస్థితి నుండి బయటకి రావాలంటే మీరు నియంత్రించుకోవాలి. మీరు వ్యాధి నుండి బయటపడలేరు. మీ ఇంద్రియాలను నిరంతరం అనుభవిస్తూ వెళ్ళితే. లేదు. అది సాధ్యం కాదు. Yad indriya-prītaya āpṛṇoti na sādhu manye yata ātmano 'yam asann api kleśada āsa dehaḥ ( SB 5.5.4) ఇంద్రియాల ఆనందపు నాగరికతలో నియంత్రణ లేకుండా మునిగిపోతున్న వారు... ఇది మంచిది కాదు. ఎందుకంటే అతడు మరోసారి ఈ భౌతిక శరీరాన్ని అంగీకరించడానికి దారి తీస్తుంది. బహుశా మానవ శరీరం, లేదా జంతు శరీరం, లేదా ఏ శరీరం అయినా. కాని ఆయన ఈ శరీరాన్ని అంగీకరించాలి. మీరు ఈ శరీరాన్ని అంగీకరించిన వెంటనే, అప్పుడు మీరు శరీరంలోని మూడురకాల దుఃఖాలకు గురికావలసి ఉంటుంది. జననం, మరణం, వృద్ధాప్యము, వ్యాధులు. ఇవి త్రివిధ క్లేశముల యొక్క లక్షణాలు.
కావున ప్రజలు... ఒకరు శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి ఈ విషయములను, కాని వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి బాధ కొనసాగుతుంది. వారు బాధను కూడా పట్టించుకోరు. ఉదాహరణకు జంతువుల వలె, అవి బాధపడుతున్నాయి, కాని అవి దానిని పట్టించుకోవు. అవి మరచిపోతాయి. ఆచరణాత్మకంగా ఈ ఇంద్రియ తృప్తి నాగరికత అంటే జంతు నాగరికత. కొంచము మెరుగు పట్టినది, అంతే.