"శ్రీ కృష్ణునికి మరియు సాధారణ మానవునికి లేదా సాధారణ జీవికి మధ్య గల వ్యత్యాసం ఏమిటంటే, మనం ఒకే చోట ఉంటాం, కాని శ్రీ కృష్ణుడు ... గోలోక ఏవ నివసతి అఖిలాత్మ భూత (BS 5.37). శ్రీ కృష్ణుని దివ్య ధామం, దీనిని గోలోక బృందావనం అని పిలుస్తారు. నేను వచ్చినది కూడా బృందావన నగరం, ఈ బృందావనంను భూలోక బృందావనమని పిలుస్తారు. ఏ విదంగా అయితే శ్రీకృష్ణ భగవానుడు భూమి మీద లీలలను ప్రకటించటానికి తన ఆంతరంగిక శక్తి ద్వారా అవతరిస్తారో, అదే విధంగా వారి నివాస ధామం అయిన గోలోక బృందావనం, కూడా భూమి మీద అవతరిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు భూమి మీద అవతరించే సమయంలో, తను స్వయంగా ఆ ప్రత్యేక స్థలమునందు అవతరిస్తారు. అందువలనే బృందావనం అతి పవిత్రమైనది."
|