"మన విద్య యొక్క పురోగతి గురించి మనము చాలా గర్వపడుతున్నాము, కానీ మీరు వివిధ వ్యక్తులను 'మీరు ఏమిటి?' అని ప్రశ్నిస్తే, చాలా అరుదుగా మాత్రమే తాము ఏమిటో సమాధానం ఇవ్వగలరు. ప్రతి ఒక్కరూ తాము ఈ శరీరమే అన్న భావనలో ఉన్నారు. కాని మనం వాస్తవానికి ఈ శరీరం కాదు. ఈ ప్రశ్న మనం చాలా చాలాసార్లు చర్చించాము. కాబట్టి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత 'నేను ఈ శరీరం కాదు' అని గ్రహించినప్పుడు అతడు వాస్తవమైన జ్ఞానమునకు వచ్చును. అది నిజమైన జ్ఞానం, 'నేను ఏవరు?'. అది ప్రారంభం. కనుక కృష్ణ భగవానుడు ఇక్కడ బోధించే జ్ఞానము, అర్జునునికి ఇచ్చిన ఉపదేశము, 'ఇది రాజ విద్య'. రాజా-విద్య అంటే తననుతాను ఏమిటో తెలుసుకోవడం మరియు తదనుగుణంగా వ్యవహరించడం. అదియే రాజ-విద్యా."
|