TE/661203 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
“శ్రీమద్భాగవతంలో పన్నెండు స్కంధములు ఉన్నాయి. కృష్ణ భగవానుని రూపాన్ని మరియు అతని కార్యకలాపాలను పదవ స్కంధములో ప్రస్తావించారు. అనగా కృష్ణభగవానుని జీవిత విశేషాలను ప్రస్తావించబడటానికి ముందు తొమ్మిది స్కంధములు ఉన్నాయి అని అర్థం అవుతుంది. ఈ విధంగా ఉండటానికి కారణం ఏమిటి? ఎందుకంటే “దశమే దశమం లక్ష్యం ఆశ్రీతాశ్రయ విగ్రహం!!” శ్రీకృష్ణభగవానుని అర్థం చేసుకోవడానికి ముందు ఈ సృష్టి ఏమిటి? ఈ సృష్టి ఎలా జరుగుతుంది? దీని కార్యకలాపాలు ఏమిటి? ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటి? తత్వశాస్త్రం అంటే ఏమిటి? వైరాగ్యం అంటే ఏమిటి? మోక్షము అంటే ఏమిటి? ఈ విషయాలన్నీ మనం చక్కగా నేర్చుకోవాలి. వీటిని సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాతనే మనం శ్రీకృష్ణ భగవానుని అర్థం చేసుకోగలుగుతాం.” |
661203 - ఉపన్యాసం CC Madhya 20.146-151 - న్యూయార్క్ |