"మన ఆధ్యాత్మిక దృష్టి ప్రస్తుత స్థితిలో భౌతిక శరీరము లేదా భౌతిక ఇంద్రియములతో కప్పబడి ఉండుట వలన, ఆధ్యాత్మిక జగత్తు లేదా ఆధ్యాత్మికమైనది ఏదియును భౌతిక ఇంద్రియములవలన గాంచలేము. కానీ, కొంత మేరకు ఆధ్యాత్మిక అనుభూతి పొందగలము. అది సాధ్యము. ఆధ్యాత్మికత గురించి పూర్తి అజ్ఞానముతో ఉన్నప్పటికీ కొంత ఆధ్యాత్మిక అనుభూతి పొందగలము. మీరు ప్రశాంతముగా స్వీయ పరిశీలన చేసుకుంటే “నేను ఎవరు? నేను ఈ వ్రేలునా? నేను ఈ శరీరాన్నా? నేను ఈ జుత్తునా?” అని ఆలోచిస్తే మనకే అనిపిస్తుంది “నేను ఇవేవి కాదని”. వీటికి మించి ఎదో అని భావము కలుగుతుంది, అదే ఆధ్యాత్మికత."
|