"కాబట్టి అతను ‘స్వయం-రూప’, అతను స్వయం-రూపంలో, ఎల్లప్పుడూ బృందావనంలోనే ఉంటాడు, మరియు కేవలం ఒక గోపబాలుని వలె ఉంటాడు. అదియే అతని నిజమైన రూపము (కృష్ణ). కురుక్షేత్ర యుద్ధరంగంలో ఉన్న కృష్ణుడు, కృష్ణుడి యొక్క నిజరూపము కాదు. ఒక ఉన్నత న్యాయస్థానం లో న్యాయమూర్తిని, మీరు అతని వాస్తవమైన రూపము ఎక్కడ చూడగల్గుతారు? అతని వాస్తవమైన రూపము మీరు అతని ఇంటిలోనే చూడగల్గుతారు, (కోర్టు) బల్ల మీద కాదు. కోర్టు బల్లలో, అతని తండ్రి వస్తే కూడా, హైకోర్టు న్యాయమూర్తి తండ్రి, అతను న్యాయమూర్తిని 'గౌరవనీయులైన న్యాయమూర్తి' అని సంబోధించాల్సి ఉంటుంది. అది కోర్టు. అదే వ్యక్తి ఒక్కరే అయినా ఇంట్లో వేరేగా మరియు కోర్టులో వేరేగా పరిగణించబడతారు. అలాగే, స్వయం-రూప కృష్ణ బృందావనం దాటి వెళ్ళడు. అతను ఎప్పుడూ గోపబాలుని వలె ఉంటాడు. అంతే."
|