TE/660829 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 12:27, 4 May 2025 by Jagadiswari (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1966 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - న్యూయార్క్ {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"చావుని జయించాలంటే అదే ప్రధాన సమస్య... కనీసం పూర్వ వైదిక నాగరికత రోజులలో. ప్రతి ఒక్కరూ, జ్ఞానంలో ఉన్నత స్థానంలో ఉన్న ఏ వ్యక్తి అయినా, వారి ప్రధాన లక్ష్యం మరణాన్నీ ఎలా జయించాలి అన్నది. ఇప్పుడు, ప్రస్తుతానికి మరణాన్ని ఎలా జయించాలనే ప్రశ్న దిగువు గా మారింది. "చావు ఉండనివ్వండి. చావు రానంత కాలం నేను ఆనందిస్తాను, ఇంద్రియభోగం పొందుతాను". అదే ప్రస్తుత నాగరికతకు ప్రామాణికంగా మారింది. కానీ అసలు సమస్య మరణాన్ని ఎలా జయించాలనేదే. వారు అనుకుంటారు. . . పరిశోధకులు అంటారు: "ఓ, మరణం . . . మరణాన్ని జయించలేం. పక్కన పెట్టండి. పక్కన పెట్టండి. మరణాన్ని వేగవంతం చేయడానికి అణుబాంబు వంటి ఏదైనా తయారు చేద్దాం." ఇది శాస్త్రీయ పురోగతి. చావు ఉంది, సమస్య ఉంది... పూర్వం, ప్రజలు మరణాన్ని ఎలా జయించాలో ఆలోచించేవారు, కాని ప్రస్తుత సమయంలో వారు మరణాన్ని వేగవంతం చేయాలని ఆలోచిస్తున్నారు, మరియు వారు దానిని జ్ఞాన పురోగతి అని పిలుస్తారు."
660829 - ఉపన్యాసం BG 05.14-22 - న్యూయార్క్