TE/660727 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 16:51, 2 June 2021 by SanatanaGokula (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"దేవాది దేవుని అత్యున్నత నాయకుడు అని వేద సాహిత్యంలో పిలుస్తారు. నిత్యో నిత్యానాం చేతనాస్ చేతనానాం. ‘నిత్యం’ అంటే శాశ్వతమైన (వాడు), మరియు ‘నిత్యానాం’ అంటే ఎందరో శాశ్వతమైన వాళ్లు. మనము ఆ ఎందరో శాశ్వతమైన వాళ్లము. ‘ఏక’, ఆ ఒక్క శాశ్వతమైన వాడు... ఏకో బహూనాం విదధాతి కామాన్. శాశ్వతమైన (నిత్యమైన) వాళ్లు రెండు రకాలున్నారు. మనము జీవులము, మనము కూడా శాశ్వతమైనవాళ్లము, మరియు దేవాది దేవుడు, అతను కూడా శాశ్వతమే. శాశ్వతత్వమునుకు సంబంధించినంతవరకు ఇద్దరము గుణాత్మక స్వభావంలో సమంమే. భగవంతుడు శాశ్వతమే, మరియు మనము శాశ్వతమే. సచ్-చిద్-ఆనంద-విగ్రహ (BS 5.1). అతను కూడా పూర్తి ఆనంద మయుడు, మరియు మనమందరం కూడా ఆనందమయులము, ఎందుకంటే మనమందరం కూడా అదే గుణాలతో కూడి తన నుండి విడివడిన భాగాలము. కానీ ఆయన నాయకుడు."
660727 - ఉపన్యాసం BG 04.11 - న్యూయార్క్