TE/661213b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 18:52, 29 June 2021 by SanatanaGokula (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"శ్రీ కృష్ణుడి అసంఖ్యాక విస్తరణలు కలవు. కానీ తను అవతరించినప్పుడు, తనే దేవాదిదేవుడు అని నిరూపించుటానికి, (వాటిలో) కొన్ని మాత్రమే మన ముందు ప్రదర్శించారు. ఎందుకంటే, భవిష్యత్తులో చాలా మంది మూర్ఖులు దేవునిగా లేదా దేవుని అవతారంగా అనుకరించడానికి ప్రయత్నిస్తారు. కానీ శ్రీకృష్ణుడు తన జీవితంలో ఎన్నో అసాధారణమైన కార్యాలను ప్రదర్శించినట్టు, ఎవ్వరును ప్రదర్శించలేరు. ఉదాహరణకు ఏడు సంవత్సరముల వయస్సులో గోవర్ధన గిరిని ఎత్తారు. (మీరు ఆ చిత్రాన్ని చూశారు). తను యవ్వనంలో ఉన్నపుడు పదహారు వేల మందిని వివాహము చేసుకున్నారు, మరియు పదహారు వేలుగా విస్తరించారు. మరియు తను కురుక్షేత్ర యుద్ధంలో విశ్వరూపాన్ని ప్రదర్శించారు. కాబట్టి ఎవ్వరైనా 'నేను దేవుడు' అని చెప్పుకునే ముందు, ఇటువంటి అసాధారణ లీలలను చూపించడానికి సిద్ధంగా ఉండాలి. లేకపోతే, వివేకవంతుడు ఎవరైనా మూర్ఖుడిని దేవుడిగా అంగీకరించరు."
661213 - ఉపన్యాసం CC Madhya 20.164-173 - న్యూయార్క్