TE/661217 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 19:26, 30 June 2021 by SanatanaGokula (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఇప్పటివరకు ఈ భౌతిక సృష్టికి సంబంధించినంతవరకు, ఈ విధంగాచెప్పబడినది, “భగవంతుడు తన భౌతిక శక్తి ద్వారా, ఈ భౌతిక ప్రపంచాన్ని మరియు భౌతిక ప్రపంచంలో అనంతమైన విశ్వాలను ఉద్భవింపచేస్తారు.” కాబట్టి భౌతిక ప్రపంచం శూన్యం నుంచి సృష్టింపడిందని ఎవరూ అనుకోకూడదు. ఖచ్చితంగా కాదు. ఇది అన్ని వేద సాహిత్యాలలో మరియు ముఖ్యంగా బ్రహ్మ-సంహితలో కూడా ధృవీకరించబడింది, మరియు భగవద్గీతలో కూడా చెప్పబడింది, ‘మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్’ (BG 9.10). కాబట్టి భౌతిక ప్రకృతి స్వతంత్రమైనది కాదు. జడ పదార్థము స్వతహాగానే పనిచేస్తుంది అనేది ఒక అపోహ, తప్పు భావన. జడ పదార్థానికి పని చేసే శక్తి లేదు. ఇది ‘జడ-రూప’. ‘జడ-రూప’ అంటే చలనం లేనిది, లేదా … జడ పదార్థములో ఎటువంటి ఛైతన్యము ఉండదు. అందువల్ల భగవంతుని ఆజ్ఞ లేకుండా జడ పదార్థం ఏ విధంగాను ఉద్భవించదు."
661217 - ఉపన్యాసం CC Madhya 20.255-281 - న్యూయార్క్