TE/740928 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు మాయాపూర్

Revision as of 05:08, 17 June 2021 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మీరు కృష్ణుని అర్థం చేసుకోకపోతే, వేదాలు మరియు వేదాంతాలు మరియు ఉపనిషత్తులు అని పిలవబడే మీ పఠనం, అవి పనికిరాని సమయం వృథా. కాబట్టి ఇక్కడ కుంతి నేరుగా చెప్తున్నారు 'నా ప్రియమైన కృష్ణా, మీరు ఆద్యం పురుషం, అసలైన​ వ్యక్తి. మరియు ఈశ్వరం. మీరు సాధారణ వ్యక్తి కాదు. మీరు పరమ నియంత్రికులు' (శ్రీమద్భాగవతం 1.8.18). అదే కృష్ణుని యొక్క అవగాహన. ఈశ్వరః పరమః కృష్ణః (బ్రహ్మ సంహిత 5.1). అందరూ నియంత్రికులు, కానీ పరమ నియంత్రికులు కృష్ణుడు. కాబట్టి ఈ భౌతిక ప్రపంచాన్ని ఖండించినప్పటికీ - దుఃఖాలయం అశాశ్వతం (భగవద్గీత 8.15),కృష్ణుడు చెప్పారు-ఇది కూడా కృష్ణుని రాజ్యం, ఎందుకంటే ప్రతిదీ దేవుడికి, కృష్ణునికి చెందినది. కాబట్టి ఖండించబడిన వ్యక్తులు బాధపడడం కోసం ఈ ఖండించబడిన ప్రదేశం సృష్టించబడింది. ఎవరు ఖండించబడ్డారు? కృష్ణుని మరచిపోయి స్వతంత్రంగా సంతోషంగా ఉండాలని కోరుకునేవారు, అందరూ ఖండించబడిన రాక్షసులు. మరియు కృష్ణునికి శరణాగతులైనవారు ఖండించబడరు. అదే తేడా."

740928 - ఉపన్యాసం శ్రీమద్భాగవతం 01.08.18 - మాయపూర్

740928 - ఉపన్యాసం SB 01.08.18 - మాయాపూర్