TE/Prabhupada 0032 - నేను మాట్లాడవలసినదంతా నా పుస్తకాలలో మాట్లాడాను

Revision as of 09:56, 17 April 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0032 - in all Languages Category:TE-Quotes - 1977 Category:TE-Quotes - Ar...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Arrival Speech -- May 17, 1977, Vrndavana

ప్రభుపాద: కావున నేను మాట్లాడలేను. నేను చాలా నీరసంగా ఉన్నాను. నేను చండీగర్ కార్యక్రములు వెళ్ళడానికి ఇతర ప్రదేశాలకు వెళ్ళాలి కానీ ఆ కార్యక్రమమును రద్దు చేసుకున్నాను. ఎందుకంటే నా శరీర ఆరోగ్య స్థితి చాలా క్షీణిస్తోంది. అందుకే వ్రిందావనముకు రావడానికి మొగ్గు చూపాను. చావు వస్తే, ఇక్కడే రానివ్వని . కొత్తగా చెప్పడానికి ఇప్పుడు ఏమి లేదు. నేను ఏదైతే చెప్పాలో, నా పుస్తకాలలో చెప్పాను. ఇప్పుడు మీరు అది అర్థం చేసుకోండి మరియు మీ కృషిని కొనసాగించండి. నేను ఉన్నా లేకపోయినా, దానితో సంబంధం లేకుండా. ఏ విధంగా కృష్ణుడు శాశ్వతముగా జీవిస్తున్నాడో , అదే విధంగా, మనవ జీవి కూడా శాశ్వతముగా జీవిస్తాడు. కానీ కీర్తిర యస్య స జీవతి: ఎవరైతే భగవంతుడికి సేవ చేస్తాడో వాడు చిరకాలము జీవిస్తాడు ." కావున మీరు కృష్ణుడికి సేవ చేయడం నేర్చుకున్నారు. మరియు కృష్ణుడి తో మనము శాశ్వతముగా జీవించవచ్చు. మన జీవితం శాశ్వతం . న హన్యతే హన్యమానే సరిరే (భగ 2. 20). ఈ శరీర తాత్కాలిక అదృశ్యం, అది లెక్క కాదు. శరీరం ఉన్నదే అదృశ్యం కొరకు. తథ దేహాంతర-ప్రప్తిహ్(భగ 2 13). కావున కృష్ణుడికి సేవ చేస్తూ చిరకాలము జీవించండి చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ!