TE/Prabhupada 0077 - మీరు శాస్త్రీయంగా మరియు తత్వపరంగా అధ్యయనం చేయవచ్చు

Revision as of 11:17, 11 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0077 - in all Languages Category:TE-Quotes - 1971 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Invalid source, must be from amazon or causelessmery.com

Ratha-yatra -- San Francisco, June 27, 1971


కృష్ణుడు చెప్పుతారు, ఎవరైతే నిరంతరము కృష్ణుడి సేవలో ఇరవై నాలుగు గంటల నిమగ్నమై వుంటారో ఈ విద్యార్ధులవలె, కృష్ణ చైతన్య సంఘం సభ్యుల వలె మీరు వారిని కృష్ణుడి సేవలో ఇరవై నాలుగు గంటలు నిమగ్నమై వున్నట్లు చూస్తారు. నా ఉద్దేశ్యం ఏమిటంటే, కృష్ణ చైతన్య౦ ప్రాముఖ్యత ఏమిటంటే వారు ఎల్లప్పుడూ సేవలో నిమగ్నమై వుంటారు ఈ రథయాత్ర వేడుక ఒక ఉదాహరణగా చెప్పవచ్చు, కనుక కనీసం ఒక రోజు మీరందరు కృష్ణా చైతన్య సేవలో నిమగ్నమై వుంటారు. ఇది ఒక్కటే పద్ధతి, మీరు మీ జీవితాంతం సాధన చేస్తే అప్పుడు మరణ సమయంలో, మీరు అదృష్టవశాత్తూ కృష్ణుడిని గుర్తుంచుకోగలిగితే, మీ జీవితం విజయవంతమైంది. ఆ అభ్యాసం అవసరం. yaṁ yaṁ vāpi smaran loke tyajaty ante kalevaram (BG 8.6). మనము ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి, అది ఖచ్చితము. కానీ మరణ సమయంలో, మనము కృష్ణుడిని గుర్తుంచుకుంటే, వెంటనే మీరు కృష్ణుని దామమునకు బదిలీ చేయబడతారు. కృష్ణుడు ప్రతిచోటా ఉన్నాడు, కానీ ఇప్పటికీ కృష్ణుడికి ప్రత్యేక నివాసం ఉంది, దీనిని గోలోక బృందావనము అని పిలుస్తారు. మీరు అవగాహనా చేసుకోవచ్చు మన శరీరము, శరీరం అంటే ఇంద్రియాలు అని అర్ధము. మరియు ఇంద్రియాలు పైన మనస్సు ఉంది, ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది, ఇది ఇంద్రియాలను నియంత్రిస్తుంది, మరియు మనస్సు పైన బుద్ధి ఉంది, మరియు బుద్ధి పైన ఆత్మ ఉంది. మనకు సమాచారం లేదు, కానీ మనము ఈ భక్తి-యోగ పద్దతిని పాటిస్తే, క్రమంగా నేను అర్థం చేసుకుంటాను. నేను ఈ శరీరం కాదు. ఇది, సాధారణంగా పెద్ద, పెద్ద పండితులు, పెద్ద, పెద్ద తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు వారు కుడా ఈ శరీర భావనలో ఉన్నారు. అందరూ ఆలోచిస్తున్నారు, "నేను శరీరం," కానీ అది తప్పు. మనము ఈ శరీరం కాదు. నేను వివరించాను. శరీరము అంటే ఇంద్రియాలు కానీ ఇంద్రియాలను మనస్సు నియంత్రిస్తుంది మరియు మనస్సు బుద్ధి ద్వారా నియంత్రించబడుతుంది, మరియు బుద్ధి, ఆత్మ ద్వారా నియంత్రించబడుతుంది. ఇది మీకు తెలియదు. ఆత్మ యొక్క ఉనికిని ఎలా అర్థం చేసుకోవాలి అనుటకు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి విద్యా వ్యవస్థ లేదు, ఇది మానవుల అవగాహనకు ప్రధాన అవసరము. ఒక మానవుడు జంతువులు వలె తన సమయం వృధా చేసుకోరాదు, కేవలం తినడం, నిద్రపోవటం, సంభోగం, మరియు రక్షించుకోవటము . ఇది జంతు జీవితం. మనుషులు తమ అదనపు మేధస్సును వుపయోగించి అర్థం చేసుకోవాలి "నేను ... నేను ఎవరిని? నేను ఆత్మను." మనము "ఆత్మ" అని అర్థం చేసుకుంటే, జీవితం యొక్క ఈ శరీర భావన, ఈ ప్రపంచమును వినాశనము చేసినది శారీరక భావనలో నేను "నేను భారతీయుడిని" అని ఆలోచిస్తున్నాను, అతను "అమెరికన్," అని అతను ఏదో, ఏదో అని ఆలోచిస్తున్నాడు. కానీ మనమందరము ఒకటే. మనము ఒక ఆధ్యాత్మిక ఆత్మలము. మనము కృష్ణుడి, జగన్నాదుడి యొక్క శాశ్వత సేవకులము.


కాబట్టి నేడు చాలా శుభప్రదమైన రోజు. ఈ రోజు కృష్ణ భగవానుడు, అతను ఈ భూమిపై ఉన్నప్పుడు, అతను కురుక్షేత్రములో ఒక సూర్య గ్రహణం వేడుకలో పాల్గొన్నాడు, మరియు కృష్ణుడు, అతని సోదరుడు బలరాముడు మరియు సోదరి సుభద్ర కురుక్షేత్ర క్షేత్రాన్ని సందర్శించడానికి వచ్చారు. కురుక్షేత్ర భూమి ఇప్పటికీ భారతదేశంలోనే ఉంది. ఏదో ఒక రోజు మీరు భారతదేశమునకు వెళ్ళితే, మీరు కురుక్షేత్ర భూమిని అక్కడ ఉన్నట్లు చూస్తారు. కాబట్టి ఈ రథ-యాత్ర వేడుకను దానికి గుర్తుగా జరుపుకుంటారు కృష్ణుడు తన సోదరుడు మరియు సోదరితో కురుక్షేత్రమునకు వచ్చిన సందర్బాన్ని. జగన్నాథుడు, చైతన్య మహాప్రభు పారవశ్యంతో ఉన్నారు రాధారాణి కృష్ణుని ప్రేమించే భావనలో చైతన్య మహా ప్రభు ఉన్నారు కాబట్టి అతను ఆలోచిస్తున్నారు, "కృష్ణ, దయచేసి తిరిగి బృందావనమునకు తిరిగి రండి." మరియు వారు రథయాత్ర ముందు నృత్యం చేశారు మరియు మీరు గ్రహించవచ్చు మీరు మేము ప్రచురించిన పుస్తకాలు కొన్ని చదివితే ..., మా సంస్థ ప్రచురించినవి. చైతన్య మహాప్రభు యొక్క భోధనలు అనే పుస్తకము. ఇది చాలా ముఖ్యమైన పుస్తకం. మీరు కృష్ణ చైతన్య ఉద్యమం గురించి తెలుసుకోవాలంటే, మా వద్ద తగినన్ని పుస్తకాలు వున్నాయి. మీరు శాస్త్రీయంగా మరియు తత్వపరంగా అధ్యయనం చేయవచ్చు. కానీ మీకు పుస్తక పఠనం మీద ఆసక్తి లేకుంటే మీరు హరే కృష్ణ మంత్రం జపము చేస్తుంటే క్రమంగా ప్రతిదీ మీకు వెల్లడి అవుతుంది, మరియు మీరు కృష్ణుడితో మీ సంబంధాన్ని అర్థం చేసుకుంటారు.


ఈ వేడుకలో పాల్గొనడానికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు మనము హరే కృష్ణ గానము చేస్తూ జగన్నాథ స్వామితో ముందుకు వెళ్దాము. హరే కృష్ణ.