TE/Prabhupada 0089 - కృష్ణుని తేజస్సు అన్నిటికి మూలము

Revision as of 06:00, 16 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0089 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Lecture on BG 4.24 -- August 4, 1976, New Mayapur (French farm)


ఫ్రెంచ్ భక్తుడు: "నేను వాటిలో లేను" అని కృష్ణడు చెప్పినప్పుడు దాని అర్థము ఏమిటి? ప్రభుపాద: ఏమిటి? "నేను వాటిలో లేను" ఎందుకంటే మీరు అక్కడ అయినను చూడలేరు. కృష్ణడు ఉన్నారు, కానీ మీరు అయినను చూడలేరు. మీరు ఉన్నత స్థితిలో లేరు మరొక ఉదాహరణగా. ఇక్కడ, సూర్యకాంతి ఉంది. అందరు చూస్తున్నారు. కానీ సూర్యుడు ఇక్కడ ఉన్నారు అని కాదు. ఇది స్పష్టంగా వున్నదా? సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అంటే ... సూర్యు కాంతి ఇక్కడ ఉంది అంటే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అని అర్ధము.. మీరు సూర్యకాంతిలో ఉన్నారు అంటే మీరు "ఇప్పుడు నేను సూర్యుడిని చేజిక్కించుకున్నాను." అని కాదు సూర్యకాంతి సూర్యుడులో భాగం, కానీ సూర్యుడు సూర్యకాంతిలో లేడు. సూర్యుడు లేకుండా సూర్యకాంతి లేదు. ఈ సూర్యకాంతి సూర్యుడు అని అర్ధము కాదు. అదే సమయంలో, మీరు సూర్యకాంతి అంటే సూర్యుడు అని అర్థం చెప్పగలరు.


దీనిని acintya-bhedābheda, ఏకకాలంలో ఒక్కటిగా మరియు బిన్నముగా సూర్యరశ్మి లో మీరు సూర్యుడి, ఉనికిని అనుభూతి చెందుతారు కానీ మీరు సూర్య మండములోనికి వెళ్ళగలిగితే సూర్య దేవుని చూస్తారు నిజానికి, సూర్య కాంతి అంటే సూర్య భుగోలములో నివసిస్తున్న వ్యక్తి యొక్క శరీరము నుంచి వస్తున్న కాంతి అని అర్ధము.


దీనిని బ్రహ్మ సంహితలో వివరించారు. yasya prabhā prabhavato jagad-aṇḍa-koṭi (Bs. 5.40). ఎందుకంటే కృష్ణుని ... మీరు కృష్ణుడి యొక్క తేజస్సు వస్తోంది అని చూస్తున్నారు. ఇది అన్నిటికి మూలం. ఆ తేజస్సును యొక్క విస్తరణ బ్రహ్మజ్యోతి. మరియు ఆ బ్రహ్మజ్యోతిలో అసంఖ్యాకంగా ఆధ్యాత్మిక గ్రహాలు, బౌతిక గ్రహాలు, వెలువడతాయి. మరియు ప్రతి గ్రహంలో అనేక రకాల జీవులు ఉన్నారు. వాస్తవమునకు కృష్ణుడి శరీర కిరణాల మూలం కృష్ణడు.