TE/Prabhupada 0131 - చాల సహజముగానే తండ్రికి శరణాగతి పొందుతాము

Revision as of 18:40, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 7.11-16 -- New York, October 7, 1966

ఈ పిచ్చి, ఈ భ్రాంతి, ఈ భౌతిక ప్రపంచం యొక్క భ్రమ, అధిగమించడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇది చాలా కష్టం. కానీ కృష్ణుడు చెప్పారు mām eva ye prapadyante māyām etāṁ taranti te (BG 7.14). ఎవరైనా స్వచ్ఛందంగా, లేదా తన దుర్భర జీవితాన్ని అర్థం చేసుకోని అతను కృష్ణుడికి ఆశ్రయము పొందితే, నా ప్రియమైన కృష్ణ, నేను చాలా జన్మలలో నిన్ను మర్చిపోయాను. నీవు నా తండ్రివి అని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను నీవు నా రక్షకుడివి. నేను నీకు శరణాగతి పొందుతాను తప్పిపోయిన పిల్లవాడు తండ్రి దగ్గరకు ఎలా వెళ్తాడో, నా ప్రియమైన తండ్రి, నేను మిమల్ని అపార్ధము చేసుకొని మీ రక్షణ నుండి దూరంగా వెళ్ళిపోయాను, కానీ నేను బాధపడ్డాను. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను. తండ్రి ఆలింగనము చేసుకుంటాడు,నా ప్రియమైన పుత్రుడా, నీవు వచ్చావు. నేను ఇన్ని రోజులు నీ కోసము చాలా ఆత్రుతగా ఉన్నాను నీవు తిరిగి వచ్చావు సంతోషంగా ఉంది. తండ్రి చాలా దయతో ఉంటాడు. మనం అదే స్థితిలో ఉన్నాము. దేవాది దేవునికి మనము శరణాగతి పొందీన వెంటనే ఆది చాలా కష్టం కాదు. తండ్రి వద్ద కుమారుడు ఆశ్రయము పొంధటము ఇది చాలా కష్టమైన పనా?. మీరు చాలా కష్టమైన పని అని అనుకుంటున్నారా? ఒక కుమారుడు తన తండ్రి వద్ద ఆశ్రయము తీసుకుంటున్నాడు. ఇది చాలా సహజమైనది. ఏ అవమానమూ లేదు. తండ్రి ఎల్లప్పుడూ ఉన్నతమైనవాడు. నా తండ్రి పాదాలను తాకినట్లయితే, నేను నా తండ్రి ఎదుట వంగి నమస్కరిస్తే, ఆది కీర్తి. అది నాకు ఎంతో ఘనమైనది. ఏ అవమానమూ లేదు. ఇబ్బంది లేదు. ఎందుకు మనము కృష్ణుడికి ఆశ్రయము పొందకూడదు?


ఇది పద్ధతి. Mām eva ye prapadyante. ఈ బ్రాంతి చెందిన జీవులు అందరు, వారు నా దగ్గర ఆశ్రయము తీసుకున్నప్పుడు māyām etāṁ taranti te (BG 7.14). అయినకు జీవితంలో ఏలాంటి కష్టాలు ఉండవు. అయిన వెంటనే తండ్రి రక్షణలో ఉంటాడు. మీరు భగవద్గీత చివరిలో కనుగొంటారు. ahaṁ tvāṁ sarva-pāpebhyo mokṣayiṣyāmi mā śucaḥ (BG 18.66). తండ్రి ... తల్లి తన యొక్క రొమ్ము మీదకు వచ్చిన పిల్ల వాడిని, తల్లి రక్షిస్తుంది. ఏదైన ప్రమాదం ఉంటే, తల్లి మొదట తన జీవితాన్ని త్యాగము చేయటానికి సిద్ధం అవుతుంది, తరువాత పిల్లవాడి జీవితమును. అదేవిధంగా, మనము దేవుడు రక్షణలో ఉన్నప్పుడు, అప్పుడు భయం లేదు.