TE/Prabhupada 0159 - పెద్ద పెద్ద ప్రణాళికలు ప్రజలు ఎలా కష్టపడి పని చేయాలి అని నేర్పుటకు

Revision as of 18:45, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 5.5.15 -- Vrndavana, November 3, 1976

పెద్ద, పెద్ద నగరాలు కలకత్తా, బాంబే, లండన్, న్యూయార్క్, ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. పెద్ద నగరాల్లో వారి ఆహారాన్ని సులభంగా పొందుతారు అని కాదు. లేదు అందరూ పని చేయాలి. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒకే స్థాయి స్థానాల్లో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? లేదు అది సాధ్యం కాదు. విధి, విధి ఒక మనిషి కష్టపడి పగలు రాత్రి, ఇరవై నాలుగు గంటల పని చేస్తున్నాడు; కేవలం అయిన రెండు చపాతీలు పొందుతున్నాడు, అంతే. బాంబేలో మనము చూశాము. వారు అటువంటి దుర్భర పరిస్థితిలో జీవిస్తున్నారు, పగటిపూట కూడా కిరోసిన్ దీపం ఉంటుంది. అలాంటి ప్రదేశంలో వారు జీవిస్తున్నారు, అలా మురికి పరిస్థితి. బొంబాయిలోని ప్రతిఒక్కరూ చాలా విలసవంతముగా జీవిస్తున్నారoటరా? లేదు అదేవిధంగా, ప్రతి నగరం. ఇది సాధ్యం కాదు. మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోలేరు, కేవలం కష్టపడి పనిచేయడం ద్వారా. అది సాధ్యం కాదు. మీరు పని చేయకపోయినా, పని చేసినా, మీకు ఉద్దేశించినది, మీరు దాన్ని పొందుతారు. అందువల్ల మన శక్తిని ఉపయోగించుకోవాలి mal-loka-kāmo mad-anugrahārthaḥ. శక్తిని ఉపయోగించాలి కృష్ణుడిని ఎలా సంతృప్తి పరచలో అనే దానికి వాడాలి. అది జరగాలి. శక్తి ఆ ప్రయోజనం కోసం వాడాలి. "నేను సంతోషంగా ఉంటాను" అని ఒక తప్పుడు ఆశ కోసం శక్తిని వ్యర్థo చేయకూడదు. నేను దీనిని చేస్తాను. నేను దానిని చేస్తాను. నేను ఇలా డబ్బు సంపాదిస్తాను. నేను ... "

కుండలు తయారు చేసేవాని కథ. కుమ్మరి ప్రణాళిక చేస్తూన్నాడు. అయిన దగ్గర కొన్ని కుండల ఉన్నాయి అయిన ప్రణాళిక చేస్తున్నాడు, "ఇప్పుడు నేను ఈ నాలుగు కుండలను కలిగి ఉన్నాను. నేను వాటిని అమ్ముతాను. నాకు కొంత లాభం వస్తుంది. అప్పుడు పది కుండలు తయారు చేస్తాను. అప్పుడు నేను పది కుండలను విక్రయిస్తాను, నాకు కొంత లాభము వస్తుంది. నేను ఇరవై కుండలు తరువాత ముప్పై కుండలు, నలభై కుండలు తయారు చేస్తాను. ఈ విధంగా నేను లక్షాధికారి అవుతాను. ఆ సమయంలో నేను వివాహం చేసుకుoటాను, ఈ విధంగా నా భార్యను నేను నియంత్రిస్తాను. ఆమె మాట వినకపోతే, నేను ఆమెను ఇలాగా కిక్ చేస్తాను అయిన తన్నినప్పుడు అయిన కుండలను తన్నాడు అన్ని కుండలు పగిలినవి. (నవ్వు) ఆతని కల చెదిరినది. మీరు చూడoడి? అదేవిధంగా, మీరు కేవలం కలలు కంటున్నారు. కొన్ని కుండలతో మనము కలలు కంటున్నాము "ఈ కుండలు చాలా కుండలుగా పెరుగుతాయి, చాలా కుండలు, చాలా కుండలు," అప్పుడు అంతా అయిపోతుంది . కల్పన చేయకండి, ప్లాన్ చేసుకోండి. అంటే ... గురువు, ఆధ్యాత్మిక గురువు ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి "ఈ ముర్ఖులు ప్లాన్ చేయకుండవుండటానికి. ఈ దుష్టుడు సంతోషంగా ఉండటానికి ప్రణాళిక చేయకపోవచ్చు. Na yojayet karmasu karma-mūḍhān. ఇది కర్మ-జగత్, ఈ ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచం ఇది. వారు ఇప్పటికే ఆసక్తి కలిగి ఉన్నారు, ఉపయోగం ఏమిటి? Loke vyayāyāmiṣa-madya-sevā nityāstu jantuḥ. లైంగిక జీవితం లాంటిది. సెక్స్ జీవితం సహజమైనది. లైంగిక ఆనందాన్ని ఎలా పొందాలనే దానిపై ఏ విశ్వవిద్యాలయ విద్య అవసరం లేదు. వారు దాన్ని ఆనందిస్తారు. ఎవరూ ... "ఎవరూ నేర్పలేదు ఎలా ఏడవాలో లేదా ఎలా నవ్వలో లేదా ఎలా సెక్స్ జీవితం ఆనందించాలో. బెంగాలీ సామెత ఉంది. ఇది సహజమైనది. ఈ కర్మకు ఏ విద్య అవసరం లేదు. ఇప్పుడు వారు పెద్ద పెద్ద ప్రణాళికలు చేస్తున్నారు ఎలా కష్టపడి పని చేయాలో అని ప్రజలకు నేర్పుతున్నారు. ఇది సమయం వృధా చేయడానికి. కృష్ణ చైతన్యవంతులు ఎలా కావాలో అని ప్రజలకు నేర్పించడం కోసం విద్యా సంస్థలు తప్పనిసరిగా ఉండాలి. దీని కోసము దాని కోసము కాదు ఆ కార్యక్రమం ఎప్పటికి విజయవంతం అవ్వదు, సమయం వృధా అవుతుంది. Tal labhyate duḥkhavad anyataḥ sukhaṁ kālena sarvatra gabhīra-raṁhasā. ప్రకృతి యొక్క చట్టం పని చేస్తుంది. Prakṛteḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi sarvaśaḥ (BG 3.27). ఏదేమైనా ...

మన వైదిక నాగరికత ప్రజలు వారు ఉన్న స్థితిలో సంతృప్తి చెందారు, ఒక బ్రహ్మణుడిగా, క్షత్రియుడిగా, వైశ్యుడిగా, శూద్రనిగా. దేవుడి దయ ద్వారా ఏమి వచ్చినా అయిన సంతృప్తి పడేవాడు. కృష్ణుని యొక్క దయను పొందటానికి అర్హత పొందటానికి వాస్తవమైన శక్తిని ఉపయోగించేవారు. ఇది కావలసివున్నది. కృష్ణుడికి ఎలా ఆశ్రయము పొందాలో తెలుసుకోవడము. తరువాత ahaṁ tvāṁ sarva-pāpebhyo mokṣayiṣyāmi (BG 18.66). అది ముగింపు భారతదేశంలో మనము ఇది చూస్తాము ... గొప్ప ఋషులు, వారు అనేక పుస్తకాలు రాశారు, కానీ వారు ఒక కుటీరమును నివసించడానికి ఉపయోగించే వారు. కేవలం రాజులు, క్షత్రియులు వారు పాలించాలి కనుక , వారు పెద్ద, పెద్ద రాజభవనాలు నిర్మించుకునేవారు. ఇంకెవరూ ఉపయోగించలేదు. వారు చాలా సరళమైన జీవితాన్ని, చాలా సరళమైన జీవితాన్ని గడిపారు. ఆర్ధిక అభివృద్ధి, ఆకాశమంత ఎత్తు వున్నా భవనములు, భూగర్భ మార్గాలు మొదలైన వాటి కొరకు సమయాన్ని వృథా చేయలేదు. ఇది వేదముల నాగరికత కాదు. ఇది రాక్షస నాగరికత.