TE/Prabhupada 0217 - దేవహుతిది ఒక సంపూర్ణ స్త్రీ స్థానము: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0217 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Hawaii]]
[[Category:TE-Quotes - in USA, Hawaii]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0216 - Krishna est première classe et son dévot est aussi première classe|0216|FR/Prabhupada 0218 - Le guru ouvre les yeux|0218}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0216 - కృష్ణుడు మొదటి-తరగతి వాడు, అతని భక్తులు కూడా మొదటి-తరగతి వారే|0216|TE/Prabhupada 0218 - గురువు యొక్క కర్తవ్యము కళ్ళను తెరిపించడము|0218}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|2FCeUjecrK4|దేవహుతిది ఒక సంపూర్ణ స్త్రీ స్థానము  <br />- Prabhupāda 0217}}
{{youtube_right|yM-mJXzQ6Mo|దేవహుతిది ఒక సంపూర్ణ స్త్రీ స్థానము  <br />- Prabhupāda 0217}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 18:52, 8 October 2018



Lecture on SB 3.28.1 -- Honolulu, June 1, 1975


కనుక ఈ యువరాణి, అనగా మను కుమార్తె అంటే, ఆమె కర్దమ మునిని సేవించటం మొదలుపెట్టింది. మరియూ యోగ ఆశ్రమములో,అది ఒక కుటీరం, మరియూ మంచి ఆహారం వుండదు, పనిమనిషి లేదు, అలాంటివి ఏవి లేవు. కనుక క్రమంగా చాలా సన్నగా అయింది, ఆమె చాలా అందమైన రాజ కుమార్తె. కనుక కదంబ ముని అనుకున్నాడు "ఆమె తండ్రి నాకు ఇచ్చాడు, ఆమె ఆరోగ్యం, అందం క్షీణిస్తుంది. కనుక ఆమె భర్తగా, నేను ఆమె కోసం ఏది అయినా చేయాలి. " కనుక యోగ శక్తి ద్వారా అతను ఒక గొప్ప నగరము గల విమానం నిర్మించాడు. అదీ యోగ శక్తి. 747 కాదు. (నవ్వు) ఎంతో గొప్ప నగరం, సరస్సు ఉంది, తోట ఉంది, పనిమనిషి ఉంది, గొప్ప, గొప్ప రాజభవనాలు, మరియూ మొత్తం ఆకాశంలో తేలియాడుతుంది, మరియూ ఆమె అన్ని వివిధ లోకములు చూచేటట్లుగా అతను చేశాడు. ఈ విధంగా ... ఇది నాల్గవ అధ్యాయంలో చెప్పబడింది, మీరు దాన్ని చదవగలరు. ఒక యోగిగా అతను ఆమెను అన్ని విధాలా సంతృప్తిపరిచాడు. మరియూ అప్పుడు ఆమె పిల్లలను కోరుకున్నది. కాబట్టి కర్దమ ముని ఆమె ద్వారా తొమ్మిది కుమార్తెలు మరియూ ఒక కుమారుని కలిగించాడు. "నీకు పిల్లలు కలిగిన వెంటనే, నేను వెళ్ళిపోతాను, అనే వాగ్దానంతో. నేను ఎల్లకాలము నీతో కలిసి నివసించను. " కనుక ఆమె అంగీకరించింది. అందువల్ల పిల్లలు కలిగిన తరువాత, అందులో కపిల దేవుడు వొకడు, కుమారుడు, అతను పెద్ద వాడైన తరువాత అతను కూడా చెప్పాడు, "నా ప్రియమైన తల్లి, నా తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, నేను కూడా ఇల్లు వదిలేస్తాను, నీవు నా నుండి ఏదైనా ఉపదేశం తీసుకోవాలనుకుంటే నీవు తీసుకొనవచ్చు. అప్పుడు నేను వెళ్ళిపోతాను. " కనుక వెళ్లబోయే ముందు అతను తన తల్లికి ఉపదేశము యిస్తున్నాడు.

ఇప్పుడు, ఈ దేవహుతి యొక్క పరిస్థితి ఒక పరిపూర్ణమైన స్త్రీ. ఆమెకు మంచి తండ్రి వచ్చాడు, ఆమెకు మంచి భర్త వచ్చాడు, ఆమెకు అద్భుతమైన కుమారుడు వచ్చాడు. కనుక మహిళ జీవితంలో మూడు దశలను కలిగి వుంటుంది. మగవాడు పది దశలు కలిగి ఉంటాడు. ఈ మూడు దశలు అనగా ఆమె చిన్న వయస్సులో ఉన్నప్పుడు, ఆమె తండ్రి రక్షణలో జీవించాలి. దేవహుతి వలె ఆమె యువతిగా పెరిగినప్పుడు, ఆమె తన తండ్రి వద్ద "నేను ఆ గొప్పమనిషిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, ఆ యోగి." అని ప్రతిపాదించింది. తండ్రి కూడా ప్రతిపాదన చేశాడు. కనుక, ఆమె వివాహం చేసుకోనంత కాలం, ఆమె తండ్రి రక్షణలో వుంటుంది. ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె యోగి భర్తతోనే ఉండిపోయింది. మరియూ ఆమె రాణి, రాజు యొక్క కుమార్తె అవటము వలన చాల రకాలుగా కష్టాలు పడింది. ఈ యోగి, అతను ఒక కుటీరములో వుండే వాడు, ఆహారం లేదు, ఆశ్రయం లేదు, అటువంటివి ఏవి లేవు. కనుక ఆమె బాధలు పడ వలసి వచ్చింది. తను "నేను రాజు కుమార్తెను, నేను జీవితంలో చాలా సంపన్నమైన పరిస్థితిలో పెరిగాను", అని ఎన్నడూ చెప్పలేదు. ఇప్పుడు నాకు ఒక మంచి అపార్ట్మెంట్, మంచి ఆహారాన్ని ఇవ్వలేని భర్త వచ్చాడు. అతనిని పరిత్యాగం చేయి. " లేదు. ఎన్నడూ చేయలేదు. అది పరిస్థితి కాదు. ఏమైనా, నా భర్త, అతను ఎవరైనా కావచ్చు, ఎందుకంటె నేను ఏదో ఒక పెద్ద మనిషిని నా భర్తగా అంగీకరించాను, నేను అతని సౌకర్యాలను చూసుకోవాలి, మరియూ అతను ఏ పరిస్థితిలో వున్నా, ఏదీ పట్టింపు కాదు. " ఇది మహిళ యొక్క బాధ్యత. కానీ అది వేదము యొక్క ఉపదేశము. ఈ రోజుల్లో, చిన్న వ్యత్యాసం వస్తే, అసమ్మతి - విడాకులు. మరొక భర్తను ఎంచుకో. కాదు. ఆమె ఉండిపోయింది. ఆ తర్వాత ఆమెకు చాలా మంచి పిల్లవాడు కలిగాడు, దేవాది దేవుడు, కపిల. కాబట్టి ఇది మూడు దశలు. స్త్రీ కోరుకోవాలి ... మొదటిది, తన (ఆమె) కర్మ ద్వారా ఒక సరైన తండ్రి క్రింద రక్షణ ఇవ్వబడుతుంది, మరియూ అప్పుడు సరి అయిన భర్త క్రింద, మరియూ అప్పుడు కపిల దేవుని వంటి మంచి బిడ్డను ఉత్పత్తి చేస్తుంది.